అలబామాలో సూర్యోదయం… లాంగ్స్టన్ హ్యూజ్

నేను స్వరకర్తని కాగలిగినపుడు

అలబామాలో సూర్యోదయం గురించి

ఒక చక్కని స్వర రచన చేస్తాను

.

దానికి

తంపరల మీదనుంచి అలవోకగా ఎగసివచ్చే పొగమంచులాగా

ఆకాశమునుండి తేలికగా నేలకిరాలే తెలిమంచులాగా  ఉండే

చక్కదనాల గీతాలని సమకూరుస్తాను .

.

ఆ గీతాల్లో

మహోన్నతమైన వృక్షాల గురించీ,

దేవదారుచెట్ల ముళ్ల సువాసనగురించీ

ఎర్ర రేగడినేలమీద

చినుకులుపడిన తర్వాత వచ్చే సుగంధపరిమళం గురించీ,

సుదీర్ఘమైన ఎర్రని మెడలతో

సింధూరపు రంగు ముఖాలతో

బలిష్టమైన గోధుమవన్నె బాహువులతో

తెల్లని “డెయిజీ” ల వంటి నేత్రాలతో

నలుపూ తెలుపూ కలయికలోని

అన్ని వన్నెల మనుషుల గురించీ

తెల్లవీ, నల్లవీ, పసుపువీ, గోధుమరంగువీ

ఎర్రటి బంకమట్టి చేతులగురించీ,

అవి అందరినీ వేళ్ళతో ప్రేమతో స్పృశించడం గురించీ,

మనుషులు ఒకర్నొకరు

మంచుతాకినంత సహజంగా తాకడం గురించీ కీర్తిస్తాను.

.

ఆ సంగీతపు ప్రభాత సంధ్యలో

నేను స్వరకర్తని కాగలిగితే

అలబామాలో సూర్యోదయాన్ని

వర్ణిస్తాను.

.

లాంగ్స్టన్ హ్యూజ్

(February 1, 1902 – May 22, 1967)

అమెరికను కవీ, సామాజిక కార్యకర్తా, నవలా రచయితా, నాటక కర్తా, పత్రికా రచయితా.

Jazz Poetry పిలవబడే సరికొత్త కవితా ప్రక్రియకి ఆద్యుడే గాక, 1920 – 30లలో న్యూయార్క్ నగరపు పొలిమేరల్లో ఉన్న “Harlem”తో ముడిపడ్ద “Harlem Revolution” గా చెప్పబడే నల్లజాతి రచయితల  తిరుగుబాటు స్వరాన్ని బాగా వినిపించినవాడు. “The Negro Speaks of Rivers” అన్నది బాగా ప్రఖ్యాతి పొందిన కవిత.

ఏ సృజనాత్మక రచయితకైనా తన స్వీయానుభవంలో గాఢమైన ముద్ర వేసిన సంఘటనలుగాని / విషయం గాని చక్కని కవితలుగా రూపాంతరం చెందుతాయి. ఈ కవితలో తనకాలంలో నల్లజాతివారు గురవుతున్న విచక్షణనీ, దాన్ని రూపుమాపాలన్న అతని ఆదర్శాన్నీ వ్యక్తపరచడం మనం గమనించ వచ్చు.

Français : Explanation of License: The is a wo...

.

Daybreak in Alabama.

.

When I get to be a composer
I’m gonna write me some music about
Daybreak in Alabama
And I’m gonna put the purtiest songs in it
Rising out of the ground like a swamp mist
And falling out of heaven like soft dew.
I’m gonna put some tall tall trees in it
And the scent of pine needles
And the smell of red clay after rain
And long red necks
And poppy colored faces
And big brown arms
And the field daisy eyes
Of black and white black white black people
And I’m gonna put white hands
And black hands and brown and yellow hands
And red clay earth hands in it
Touching everybody with kind fingers
And touching each other natural as dew
In that dawn of music when I
Get to be a composer
And write about daybreak
In Alabama.

.

Langston Hughes

(February 1, 1902 – May 22, 1967)

American poet, social activist, novelist, playwright, and columnist

Further Reading:

http://en.wikipedia.org/wiki/Langston_Hughes

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: