రోజు: సెప్టెంబర్ 14, 2012
-
అలబామాలో సూర్యోదయం… లాంగ్స్టన్ హ్యూజ్
నేను స్వరకర్తని కాగలిగినపుడు అలబామాలో సూర్యోదయం గురించి ఒక చక్కని స్వర రచన చేస్తాను . దానికి తంపరల మీదనుంచి అలవోకగా ఎగసివచ్చే పొగమంచులాగా ఆకాశమునుండి తేలికగా నేలకిరాలే తెలిమంచులాగా ఉండే చక్కదనాల గీతాలని సమకూరుస్తాను . . ఆ గీతాల్లో మహోన్నతమైన వృక్షాల గురించీ, దేవదారుచెట్ల ముళ్ల సువాసనగురించీ ఎర్ర రేగడినేలమీద చినుకులుపడిన తర్వాత వచ్చే సుగంధపరిమళం గురించీ, సుదీర్ఘమైన ఎర్రని మెడలతో సింధూరపు రంగు ముఖాలతో బలిష్టమైన గోధుమవన్నె బాహువులతో తెల్లని “డెయిజీ” ల…