అనువాదలహరి

ఫ్రాన్సిస్… మొపాసా, ఫ్రెంచి కథా రచయిత

మేము పిచ్చాసుపత్రినుండి బయటకు వస్తున్నప్పుడు, ముందు ఆవరణలో, కనిపించనికుక్కను అదేపనిగా పిలుస్తున్న ఒక బక్కపలచని వ్యక్తిని చూశాను.  ఎంతో ప్రేమగా మృదువుగా “కోకాట్, నా చిన్ని కోకాట్;  ఇలా దామ్మా కోకాట్, దగ్గరకి రా నా చక్కదనాల కోకాట్,” అని పిలుస్తూ, దూరంగా ఉన్న కుక్క దృష్టిని  ఆకర్షించడానికి మనం సాధారణంగా చేసేట్టుగానే  కాలు నేలకేసి కొడుతున్నాడు. నేను డాక్టర్ని అడిగేను అతనిపిచ్చికి కారణం ఏమిటని.

“ఓహ్, అతని సంగతా… అదొక చిత్రమైన కథ,” అని, “అతని పేరు ఫ్రాన్సిస్, ఒక పెద్దింటి  గుర్రపుబగ్గీ తోలేవాడు; అతని కుక్కను అతనే నీట్లో ముంచి చంపేసేడు. దానితో అతనికి పిచ్చెక్కింది.”

అతని కథ చెప్పమని నేను పదే పదే బ్రతిమాలేను. కొన్ని విషయాలు అల్పమైనవీ, అతి సామాన్యమైనవే  కావొచ్చుగానీ, అవి మన మనసుమీద గాఢమైన  ముద్రను వేస్తాయి.

ఈ విషయం అతని దగ్గర పనిచేసిన కుర్రాడికి తప్ప ఎవరికీ తెలీదుట. అతను చెప్పిన చిత్రమైన కథ ఇదీ:

*

పారిస్ నగర శివార్లలో ఒక మధ్యతరగతి ధనిక కుటుంబం నివసిస్తుండేది. వాళ్ళ బంగళా సియాన్ నది ఒడ్డున ఉన్న ఒక తోట మధ్యలో ఉండేది. ఈ ఫ్రాన్సిస్ వాళ్ళ గుర్రపుబగ్గీ నడిపేవాడు… పల్లెటూరి కుర్రాడు, అంత నైపుణ్యం లేకపోయినా మనసు మంచిది, సీదాసాదా మనిషి, సులభంగా బోల్తా పడిపోయేంత అమాయకుడు.

ఒక రోజు సాయంత్రం అతను తనయజమాని ఇంటికి వెళ్తుంటే, ఒక కుక్క అతన్ని వెంబడించడం ప్రారంభించింది. మొదట అతను దాన్ని గమనించనే లెదు, కానీ, ఆ జంతువు అతని అడుగులో అడుగు  వేసుకుంటూ అతన్ని వదలకుండా అనుసరించడంతో వెనక్కి తిరిగి చూడక తప్పింది కాదు. అతను తనకి పరిచయమున్న కుక్కేమోనని ఒకసారి వెనక్కి తిరిగి చూసేడు. కాని, ఉహూ, ఇంతకుముందెప్పుడూ దాన్ని అతను చూడలేదు.

ఆ కుక్క వేలాడుతున్న పెద్ద పొదుగులతో, చూడ్డానికి భయమేసేంత బక్కచిక్కిఉంది. అతని వెనక అతి దీనంగా, ఆకలి చూపులు చూస్తూ, తోక కాళ్ళ మధ్య ముడుచుకుని, చెవులు తలకి ఆన్చుకుని, అతను ఆగితే ఆగుతూ, నడవగానే మళ్ళీ నడుస్తూ అనుసరించసాగింది.

అస్థిపంజరంలా ఉన్న ఆ జంతువుని అతను తరమబోయాడు. “ఫో! బతుకుమీద ఆశ ఉంటే ఫో… పోతావా పోవా! ఫో! అదుగో! అదుగో!” అని  బెదిరించాడు. అది నాలుగడుగులు పరిగెత్తి కూచునేది, అతనేంచేస్తాడో అని నిరీక్షిస్తూ. అతను బయలుదేరగానే, తనూ బయలుదేరేది.

అతను రాళ్ళు తీస్తున్నట్టు నటించేవాడు. వెంటనే అది తన పొదుగులూపుకుంటూ కొద్దిదూరం పరిగెత్తేది; అతను వెనుదిరిగేసరికల్లా అతని వెనకాతల తయారయ్యేది.

చివరికి ఫ్రాన్సిస్ కి దానిమీద జాలి కలిగింది. అది బెరుకు బెరుకుగా, దాని వీపు అర్థవృత్తాకారంగావంగి దాని పక్కఎముకలన్నీ తోలుకిందనుండి కనిపిస్తుండగా ముందుకి రెండడుగులేసింది. పొడుచుకొస్తున్న దాని ఎముకలని ఒకసారి మెత్తగా నిమిరి “అయితే, నా వెనక రా!” అన్నాడు. అది తనని అంగీకరించి, స్వాగతించేడని అర్థం చేసుకుంది; చేసుకుని, తన కొత్త యజమాని కాళ్ళదగ్గిర పడి ఉండకుండా అతనికంటే ముందు పరిగెత్తడం ప్రారంభించింది.

తన గుర్రాలశాలలో గడ్డిమీద దాన్ని పడుక్కోబెట్టి వంటింట్లోకి అది తినడానికి బ్రెడ్డుకోసం పరిగెత్తాడు. కడుపునిండా తిన్నతర్వాత, దగ్గరగా ముడుచుకుని బొంగరంలా పడుక్కుని నిద్రపోయింది.

మరుసటిరోజు బగ్గీవాడు తనయజమానితో కుక్క విషయం చెప్పగానే, అతను దాన్ని అతనితో ఉంచుకుందికి అనుమతి ఇచ్చేడు. అది మంచి తెలివైనదీ విశ్వాసమైనదే కాదు, ప్రేమగల సాధు జంతువు కూడా.

*

కానీ, అనతికాలంలోనే దాన్లో ఒక తీవ్రమైన లోపం వాళ్ళు కనుక్కున్నారు. కార్తెలతో నిమిత్తం లేకుండా సంవత్సరము పొడుగునా అది ప్రేమతో రగిలిపోతుండేది. కొద్దిరోజుల్లోనే ఊర్లో ఉన్న అన్ని కుక్కలతో పరిచయం చేసుకుని, అన్నీ కలిసి ఊరంతా తిరుగుతుండేవి. ఓ పడుచుపిల్లకుండే నిర్లక్ష్యంతో వాటన్నిటి ప్రేమనూ స్వీకరిస్తూ, ప్రతి కుక్కనీ ఇష్టపడుతున్నట్టు నటిస్తూ, కుక్కలలోని అన్ని జాతులనీ దానివెనక వెనకతిప్పుకుంటూ ఉండేది… అందులో కొన్ని పిడికిలంత ఉంటే, మరికొన్ని గాడిదంత పొడుగుండేవి. వాటిని అంతూపొంతూలేని దారులంట తిప్పితిప్పి అది విశ్రాంతికి ఎక్కడైనా ఆగిందంటే, అవన్నీ దానిచుట్టూ వర్తులాకారంలో నాలుకలు బయటకుజాచుకుంటూ నిలబడుతుండేవి.

ఊర్లోవాళ్లందరూ దాన్ని వింతగా చూసే వాళ్ళు; ఇంతకుముందెప్పుడూ వాళ్ళటువంటి జంతువుని చూడలేదు. పశువైద్యుడికయితే దాని సంగతి అంతుపట్టలేదు.

సాయంత్రం అది తన వాసమైన గుర్రాలశాలకి వచ్చేసరికి దానిమీద హక్కుకోసం అన్ని కుక్కలూ చుట్టుముట్టేవి. ఆ తోటచుట్టూ ఉన్న కంచెలో ఏ మాత్రం చిన్న ఖాళీ కనిపించినా అందులోంచి దూరి, పూలపాదులన్నీ కుమ్మేసి, పువ్వులు రాల్చేసి, చదునుచేసిన నేలలో గోతులు తవ్వేసి తోటమాలి ప్రాణాలు తోడేస్తుండేవి. రాత్రల్లా తమ స్నేహితురాలు నివాసమున్న భవనం చుట్టూ అరుస్తుండేవి; వాటిని వెనక్కి పంపించడం ఎవరికీ చాతనయేది కాదు.

ఉదయంపూట అయితే అవి ఇంట్లోకి కూడా వచ్చేస్తుండేవి. దాన్ని రావడం అనకూడదు, అదొక దండయాత్ర, ఒక మహమ్మారి, ఒక విపత్తులా ఉండేది. ఆ ఇంట్లో వాళ్ళు మెట్లదగ్గరో, అప్పుడప్పుడు గదుల్లోనూ, అందమైన తోకలున్న పసుపుపచ్చని చిన్న కుక్కల్నో, వేటకుక్కల్నో, బుల్ డాగ్ లనో, మురికిపట్టిన తోడేళ్ళవేటకుక్కల్నో, ఓ ఇల్లూ, జీవితమూలేని ఊరకుక్కల్నో, వాటితోపాటు అప్పుడప్పుడు పిల్లలు భయపడే మేలుజాతి బలిష్టమైన కుక్కల్నో ఎదుర్కుంటుండేవాళ్ళు.

ఆ ఊరికి పదిమైళ్ళ వ్యాసార్థంలో ఉన్న అన్ని కుక్కలూ, పేరున్నవీ లేనివీ ఎక్కడినుండి వచ్చేవో ఎవరికీ తెలీదు; కొంతకాలం గడిపి మళ్ళీ అన్నీ ఎలా మాయమయ్యేవో ఎవరికీ తెలీదు.

అయినప్పటికీ, ఫ్రాన్సిస్ కి అదంటే ప్రాణం. దానికి కోకాట్ అని పేరు పెట్టాడు. ఏ దురుద్దేశమూ లేకుండ చెప్పాలంటే దాని కా పేరు తగిందే. “ఈ జీవికి మాట ఒక్కటే తక్కువగాని, ఇది నిజంగా ఒక మనిషే,” అని పదే పదే అంటూ ఉండేవాడు.

దానికోసం చాలా అందమైన ఎర్రని తోలుపటకా ఒకటి తయారుచేయించేడు. దానికి అతికిన రాగిరేకుమీద ఇలా చెక్కించేడు : “కుమారి కోకాట్ కి ప్రేమతో, ఫ్రాన్సిస్, సారణి”

*

కోకాట్ ఇప్పుడు బాగా లావయింది. ఒకప్పుడు అది ఎంత బక్కగా ఉండేదో ఇప్పుడంత లావుగా తయారయింది. దాని శరీరం ఊరిపోయి పొదుగులు వేలాడుతున్నాయి. ఒక్క సారిగా అది లావెక్కి పోయి, ఊబకాయం మనుషులు పాదాలు ఎడంచేసి నడిచినట్టు, పంజాలు ఎడంచేసి నడుస్తోంది; పరిగెత్తడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా ఊపిరికోసం నాలిక బయటపెట్టి, వెడల్పుగా నోరు తెరుస్తోంది .

సంవత్సరానికి నాలుగు ఈతలు ఈనుతూ, కుక్కల్లో ఎన్ని జాతులున్నాయో అన్ని జాతుల పిల్లలను కంటూ, అది ఎనలేని సంతానశక్తిని కనబరిచేది. ఫ్రాన్సిస్  ఏ కుక్కపిల్ల దాని పాలుతాగడానికి అర్హురాలో నిర్ణయించుకుని మిగతావాటిని నిర్దాక్షిణ్యంగా తన బట్టలో చుట్టి నదిలోకి విసిరేసేవాడు.

*

దానిమీద నేరాల చిట్టా విప్పడంలో తోటమాలికి ఇప్పుడు వంటమనిషి జతగూడింది. వంటసామాన్ల దగ్గరా, బీరువాల్లో, బొగ్గులగదిలో, ఎక్కడపడితే అక్కడ అవి ఆమెకి తారసపడుతున్నాయిట… తనని చూడగానే పరిగెత్తి పారిపోతూ.

ఇంటి యజమానికి సహనం నశించి కోకాట్ ని వదుల్చుకో మని ఫ్రాన్సిస్ ని ఆజ్ఞాపించేడు. ఓదార్చనలవిగాని దుఃఖంలోఉన్న అతడు దాన్ని ఎవరిదగ్గరైనా ఉంచుదామని ప్రయత్నించేడు. కానీ, దాన్ని ఎవరూ తీసుకుందికి సుముఖత కనబరచలేదు. అప్పుడతను పారిస్ ఈశాన్యంగా పది పన్నెండు మైళ్ళ పొలిమేరల్లో ఉండే బండివాడికి అప్పజెప్పి వదుల్చుకుందికి ప్రయత్నం చేసేడు.

కానీ, అదే రోజు సాయంత్రం, కాకోట్ తిరిగి ఇల్లు చేరుకుంది.

అతనికి వేరే ప్రయత్నాలు చెయ్యక తప్పలేదు. రైల్లో ఒక వంటవాడికి 5 ఫ్రాంకులు ఇవ్వడానికీ, హావ్రే (బెల్జియం) చేరిన తర్వాత దాన్ని అతను దాన్ని వదిలెయ్యడానికీ ఒప్పందం కుదుర్చుకున్నాడు.

మూడు రోజులుపోయిన తర్వాత బాగా నలిగిపోయి, అలసిపోయి, బాగా చిక్కిపోయి యధాప్రకారం ఇంట్లో  ప్రత్యక్షం అయింది.

యజమానికి దానిమీద జాలి వేసి, మరేమీ మాటాడలేదు.

*

పూర్వంకంటే ఇప్పుడు ఎక్కువ  కుక్కలు వెంటపడటమేగాక, అవి కవ్వించే పనులు చెయ్యడం ప్రారంభించేయి. ఓ రోజు యజమాని ముఖ్యమైన డిన్నరు ఇస్తుంటే, పూర్ణంపెట్టిన కోడిమాంసం, వంటామె చూస్తుండగానే పట్టుకుపోయాయి.  వాటిని ప్రతిఘటించే ఆమె సాహసం చెయ్యలేకపోయింది.

ఈమాటు యజమానికి విపరీతమైనకోపం వచ్చింది. వెంటనే ఫ్రాన్సిస్ ని తనదగ్గరకు పిలిపించుకుని, “దీన్ని నీళ్లలోకి విసిరెయ్యకపోయావో, రేపు ఉదయం నిన్ను పనిలోంచి తీసెస్తాను. అర్థమయిందా?” అని హెచ్చరించేడు.

ఆ మాటలకి మనిషి పూర్తిగా హతాసుడైపోయాడు.ఆ చోటే వదిలెద్దామన్న ఆలోచనతో పెట్టే బేడా సర్దుకుందికి మేడమీది తనగదిలోకి వెళ్ళాడు.  అంతలోనే అతను ఎవరికీ ఇష్టంలేని ఈ జీవి తనవెనకఉండగా ఎక్కడా తనకి ఉద్యోగంవచ్చే అవకాశం లేదని పునరాలోచనలో తట్టింది; అంతే కాదు, అతను మంచి కుటుంబంలో పనిచేస్తున్నాడు; మంచి జీతం, మంచి తిండీ కూడా దొరుకుతున్నాయి; కనుక ఇవన్నీ కేవలం ఒక కుక్కకోసం వదులుకోడం అంత సమంజసంగా కనిపించలేదు. అతను తన లాభనష్టాలన్నీ బేరీజువేసుకుని, చివరికి మరుచటిరోజు ఉదయాన్నే దాన్ని వదుల్చుకుందామన్న నిర్ణయానికి వచ్చేడు.

కానీ, అతనికి రాత్రి సరిగా నిద్రపట్టలేదు. తెల్లవారుతూనే లేచి, బలమైన తాడు పేనుతూ, కుక్క ఎక్కడుందో వెదకడానికి బయలుదేరేడు. అది నెమ్మదిగా నిద్రలేచి, వొళ్ళు ఒకసారి విదిల్చుకుని, కాళ్ళు ఒకసారి ముందుకీ వెనక్కీ సాగదీసి బధ్ధకం వదిలించుకుని తన  యజమానిని పలకరించడానికి బయలుదేరింది. దాన్ని చూడగానే అతని ధైర్యం సన్నగిలింది. దాన్ని ప్రేమగా నిమురుతూ, పొడవైన దాని చెవులు సరిచేస్తూ, మూతి ముద్దాడుతూ, అతనికి తెలిసిన అన్ని ముద్దుపేర్లతో దాన్ని పిలవడం ప్రారంభించాడు.

పక్కింట్లో గడియారం మోగింది; ఇక తను ఎంతమాత్రం ఆలశ్యం చెయ్యలేడు. అతను తలుపు తీసాడు. “దా,” అని పిలిచేడు. దానికి బయటకు వెళ్తున్నామని అర్థం అయి తోకాడించడం ప్రారంభించింది.

వాళ్ళు నదిగట్టుకి వెళ్ళి నీళ్ళు బాగాలోతుగా ఉండేచోట ఆగేరు. దాని  అందమైన ఎర్రని తోలుపటకాకి తాడు ఒక కొన ముడివేశాడు, ఒక పెద్ద బండరాయి తీసుకుని  దాన్ని రెండోకొసకు పెనవేశాడు. అతను కాకోట్ ని అతని చేతుల్లోకి తీసుకుని, వీడ్కోలు చెప్పేవాళ్ళని ముద్దుపెట్టుకునేంత గాఢంగా ముద్దుపెట్టుకోసాగేడు. దాని మెడపట్టుకుని “నా అందాల కాకోట్, నా బుజ్జి కాకోట్,” అని పిలుస్తూ, ఒళ్ళు నిమురుతుంటే, అది కూడ ఆనందంతో గుర్రుమంటూ, ప్రతిస్పందించసాగింది.

పదిసార్లు దాన్ని నీటిలోకి విసిరెయ్యడానికి ప్రయత్నించాడు గాని, పది సార్లూ అతని మనసు అంగీకరించలేదు. చివరకి అకస్మాత్తుగా గట్టి నిర్ణయం తీసుకుని, తన శక్తినంతా కూడదీసుకుని ఎంతవరకు వీలయితే అంత దూరంగా నీట్లోకి విసిరేడు. అది స్నానం చేసేటప్పుడు ఈదినట్టు ఈదడానికి మొదట ప్రయత్నం చేసింది. కాని మెడకికట్టిన తాడువల్ల రాయి క్రిందకి లాగడంతో పదే పదే దాని తల నీట్లోకి పోయింది. మునిగిపోతున్న మనిషి కొట్టుకుంటూ కొట్టుకుంటూ చూసే  నిస్సహాయమైన చూపొకటి తనయజమాని వైపు చూసింది. దాని శరీరమంతా ములిగిపోకముందు వెనకకాళ్ళు కొట్టుకుంటూ కొట్టుకుంటూ నీటిమీద కనిపించేయి. క్రమంగా అవికూడా నీటిలో కనుమరుగయేయి.

నదే మరిగిపోతోందా అనిపించేట్టుగా అయిదు నిముషాలసేపు బుడగలు ఉపరితలానికి వచ్చేయి. కోకాట్ నీటి అడుగున బురదలో గిలగిలకొట్టుకోవడం చూసినట్టనిపించి, ఆవేశమూ, నీరసమూ ఒక్కసారి ఆవహించిన ఫ్రాన్సిస్ గుండె జోరుగా కొట్టుకోవడం ప్రారంభించింది. గ్రామీణులకుండే సహజమైన అమాయకత్వంతో,”ఆ జీవం ఇప్పుడు నాగురించి ఏమని అనుకుంటుందో?” అని తనలో తాను విచారించసాగేడు.

*

అతనిప్పుడు ఒక పిచ్చివాడిలా తయారయ్యేడు. నెల్లాళ్ళపాటు ఆరోగ్యం దెబ్బతింది. ప్రతిరోజూ రాత్రి కుక్క కళ్ళకు కనిపించేది; అది తన చేతులు నాకుతున్నట్టూ, దాని అరుపులు విన్నట్లూ అనిపించేది.

వైద్యుడిని పిలిపించవలసిన పరిస్థితి ఏర్పడింది. చివరికి ఎలాగైతేనేం నయమయ్యింది. అతని యజమానీ, యజమానురాలూ పారిస్ కి వాయవ్యంగా రూవెన్ లో  ఉన్న తమ భూములు చూడడానికి అతన్ని తమతో తీసుకెళ్ళేరు.

రూవెన్ కూడా సియాన్ నదికి ఒడ్డునే ఉంది. అతనిప్పుడు స్నానం చెయ్యగలుగుతున్నాడు. ప్రతిరోజూ ఉదయం అతని దగ్గర పనిచేస్తున్న కుర్రాడితో నదిలో ఈదడానికి వెళ్తున్నాడు.

*

ఒకరోజు అలా స్నానానికి వెళ్ళి ఒకరిమీద ఒకరు నీళ్ళు చిమ్ముకుంటూ ఆనందిస్తున్న సమయమలో, ఉన్నట్టుండి తన మిత్రుడితో :

“అదిగో అటు చూడు, మనవైపు ఏదో కొట్టుకొస్తోంది. ఇవాళ నీ చే కట్ లెట్ తినిపిస్తాను,” అన్నాడు. కొట్టుకొస్తున్నదొక భారీ కళేబరం. బాగా ఉబ్బిపోయి, వెంట్రుకలన్నీ ఊడిపోయి, కాళ్ళు గాలిలో తేలుతూ ప్రవాహంతో పాటు వస్తోంది.

ఫ్రాన్సిస్ పరిహాసాలాడుతూనే దాన్ని సమీపించేడు:

” వావ్! ఏమదృష్టం రా నీది కుర్రాడా! కాకపోతే అది తాజా సరుకు కాదు. అయితే అది బక్కపలచనిది కాదన్న విషయం స్పష్టం,” అన్నాడు.

ఇపుడతను అటు తిరిగేడు. ఆ మురిగిపోయి కొట్టుకొస్తున్న కళేబరాన్నితగిన దూరంలో ఉండే గమనిస్తున్నాడు.

అలా చూస్తున్నవాడు ఒక్కసారి నిశ్శబ్దమైపోయి దాని వంకే చిత్రంగా చూడడం ప్రారంభించేడు. ఈ మాటు దాన్ని తాకగలిగినంత దగ్గరగా వెళ్ళేడు. దాని మెడపట్టీని ఒకసారి పరీక్షించి, కాలు పట్టుకుని, మెడ అందుకుని అటునించి ఇటు తిప్పి, తనవైపు లాక్కుని, రంగువెలిసిన తోలుపటకాకి ఇంకా అతుక్కునే ఉన్న కిలుం పట్టిన రాగిరేకు మీద ఉన్న అక్షరాలను చదివేడు: “కుమారి కోకాట్ కి ప్రేమతో, ఫ్రాన్సిస్, సారణి”

ఎలాగయితేనేం, ఆ చచ్చిపోయిన కుక్క ఇంటినుండి అరవై మైళ్ళదూరం లో మళ్ళీ తన యజమానిని కలుసుకో గలిగింది.

అతనొక భయంకరమైన కేకవేసి శక్తి కొద్దీ గట్టువైపు ఈదసాగేడు… దారిపొడుగునా అరుస్తూ…

ఒడ్డుకు చేరిన తర్వాత ఊర్లోంచి అలా దిశమొలతోనే పరిగెత్తసాగేడు.  అతనిప్పుడు పిచ్చివాడు!

*

Guy de Maupassant
Guy de Maupassant (Photo credit: Wikipedia)

గై ద మొపాసా

(5 ఆగష్టు 1850- 6 జులై 1893)

ఫ్రెంచి కథా రచయిత.

ప్రపంచ సాహిత్యం లో కథా రచన అంగానే ముందుగా గుర్తొచ్చే పేర్లలో మొపాసా ఒకటి. వస్తువు, శిల్పము, విషయంలో సోమర్ సెట్ మాం కీ, ఓ హెన్రీకి కూడ మార్గదర్శకుడిగా కీర్తి సంపాదించేడు. అసామాన్యమైన సునిశితదృష్టి కనబరుస్తూ, మానవనైజం లోని అన్ని పార్స్వాలూ స్పృశిస్తూ అద్భుతమైన సాహిత్య సృష్టి చేశాడు. అందులో Naturalism and Fantastic రెండూ ఉన్నాయి. అతని కథలని చిన్నచిన్నమార్పులతో చాలామంది అనుకరించేరుకూడా. మనోవిశ్లేషణాత్మక రచన అతని ముద్ర. లియో టాల్ స్టాయ్ అంతటివాడు కళా గురించి వ్రాసిన వ్యాసాలలో  మొపాసా సాహిత్యం లోని కళాత్మకత ఆవిష్కరించేడు.

అతని వచన రచన కొన్ని సందర్భాలలో పద్యరచనని మించిన కల్పనాశక్తితో, సందర్భానికి తగ్గట్టుగా ఉంటూ, దానికి విలువని జోడిస్తుంది. ఈ కథలో ఒక చోట “నదే మరిగిపోతోందా అనిపించేట్టుగా అయిదు నిముషాలసేపు బుడగలు ఉపరితలానికి వచ్చేయి” అన్న చోట కథలోని దాని ఔచిత్యమూ, అక్కడ ప్రకటించేభావనకి అది అందిచ్చే సౌందర్యమూ గమనించండి.

అతను Joseph Prunier, Guy de Valmont, and Maufrigneuse  అన్న మారు పేర్లతో రచనలు చేశాడు.

అతను ఏకాంతాన్ని ఎక్కువగా ఇష్టపడేవాడు.

I have coveted everything and taken pleasure in nothing (నేను అన్నిటినీ ఆకాంక్షించేను; దేనిలోనూ ఆనందం పొందలేకపోయాను) అని తన స్మృత్యుల్లేఖనాన్ని (epitaph) అతనే రాసుకున్నాడు.

15  కథా సంకలనాలు,  3 ట్రావెలోగ్ లూ, 6 నవలలు,1 కవితా సంకలనం అతని సాహిత్య సృష్టి.

.

Francis

We were going out of asylum when I perceived in one corner  of the courtyard  a tall thin man  who was forever calling  an imaginary dog. He would call out with a sweet tender voice: “Cocotte, my little  Cocotte; come here, Cocotte, come here, my beauty,” striking his leg, as one does  to attract the attention of an animal. I asked the doctor what the mater was with the man.

“Oh, that is an interesting case,” he said, “he is a coachman named Francis, and he became insane  from drowning his dog.”

I insisted upon telling me the story.  The most simple and humble things  sometimes strike most   to our hearts.

And here is the adventure  of this man which was known solely to a groom, his comrade.

In the suburbs of Paris lived a rich, middle-class family. Their villa was in the midst of a park, on the bank of Siene. their coachman was Francis., a country boy, a little awkward, but good of heart, simple and easily duped.

When he was returning  one evening to his master’s house a dog began to follow him. At first he took no notice of it, but the persistence of the beast  in walking on his heels  caused him finally to turn around.  He looked to see if he knew the dog. No, he had never seen it before.

The dog was frightfully thin and had great hanging dugs. She totted behind the man with a woeful, famished look, her tail between her legs and her ears close to her head, and stopped when he stopped, starting again when he started.

He tried to drive away this skeleton of a beast. “Get out! If you want to save yourself— Go, now! Hou! Hou!” She would run away a few steps and then sit down, waiting; then when the coachman started on again, she followed behind him.

He made believe to pick up stones.  The animal fled a little away with a great shaking of the flabby mammillae, but followed again as soon as the man turned his back.

Then the coachman Francis took pity and called her.  The dog approached timidly, her back  bent in a circle and all the ribs showing  under the skin. The man smoothed these projecting bones and, moved by the misery of the beast, said, “Come along then!”  immediately the tail began to move; she felt the welcome, the adoption, and instead of staying at her new master’s heels she began to run ahead of him.

He installed her on some straw in his stable, then ran to the kitchen in search of bread. When she had eaten her fill she went to sleep, curled up, ringlike.

The next day the coachman told his master  who allowed to keep the animal.  She was a good beast, intelligent and faithful, affectionate and gentle.

But immediately they discovered in her a terrible fault.  she was inflamed  with love from one end of the year to the other. In a short time she had made acquaintance of every dog about the country, and they roamed about the place day and night.  With the indifference of a girl, she shared  her favours with them, feigning to like each one best, dragging behind her a veritable  mob composed of many different models of the barking race, some as large as a fist, others as tall as an ass. She took them to walk  through routes with interminable  courses, and when she stopped  to rest in the shade  they made a circle about  her and looked at her  with tongues hanging out.

The people of the country considered her a phenomenon; they had never seen anything like it. The veterinary could not understand it.

When she returned to the stable  in the evening the crowd of dogs made siege for proprietorship. They wormed their way through every crevice in the hedge which inclosed the park, devastated the flower beds, broke down the flowers, dug holes in the urns, exasperating the gardener.   They would howl the whole night about the building where their friend lodged, and nothing could persuade them to go away.

In the daytime they even entered the house. It was an invasion, a plague, a calamity. The people of the house met at any  moment on the staircase, and even in the rooms, little yellow pug dogs with tails decorated, hunting  dogs, bulldogs, wolfhounds with filthy skin, vagabonds without life or home, besides some new-world enormities which frightened the children.

All unknown dogs for ten miles around came, from one knew not where, and lived, no one knew how, disappearing all together.

Nevertheless, Francis adored Cocotte. He had named her Cocotte , ‘without malice, sure that she merited her name.” And he repeated over and over again: “This beast is a person. It only lacks speech.”

He had a magnificent collar in red leather made for her, which bore these words. engraved on a copperplate: “Mlle Cocotte, from Francis, the coachman.”

She became enormous. She was as fat as she had been thin, her body puffed out, under which hung always  the long swaying mammallae.  She had fattened suddenly  and walked with difficulty, the paws wide apart, after  the fashion of the people that are too large, the mouth open for breath, wide open as soon as she tried to run.

She showed phenomenal fecundity, producing, four times a year, a litter of little animals, belonging to all varieties of the canine race. Francis, after having chosen the one he would leave her ‘to take the milk,”  would pick up the others in his stable apron and pitilessly throw them into the river.

Soon the cook joined her complaints to those of the gardener.  She found dogs under her kitchen range, in the cupboards and the coalbin, always fleeing whenever she encountered them.

The master becoming impatient, ordered Francis to get rid of Cocotte. The man, inconsolable, tried to place her somewhere. No one wanted her. Then he resolved to lose her  and put her in charge of a wagoner who was to leave  her in the country the other side of Paris, beyond De Joinville-le-pont.

That same evening Cocotte was back.

It became necessary to take measures. For the sum of five francs they persuaded a cook on the train to Havre to take her.  He was to let her lose when they arrived.

At the end of three days she appeared again in her stable, harassed, emaciated, exhausted.

The master was merciful and insisted on nothing further.

But the dogs soon returned in greater numbers than ever  and were more provoking.  And as they were giving a great dinner one evening a stuffed chicken  was carried off by a dog under the nose of the cook, who dared not dispute the right to it.

This time the master was angry and, calling Francis to him, said hotly:”if you don’t kick this beast into the water  tomorrow morning I will put you out, do you understand?”

The man was undone, but he went up to his room to pack his trunk, preferring to leave the place.  Then he reflected that he would not be  likely to get in anywhere else, dragging  this unwelcome beast behind him; he remembered he was in a good house , well paid and well fed,  and he said to himself  that it was not worthwhile giving up all this for a dog. He enumerated his own interests  and finished by resolving to get rid of Cocotte at dawn the next day.

However, he slept badly.  At daybreak he was up and, preparing a strong cord, he went in search of the dog.  She arose slowly, shook herself, stretched her limbs and came to greet her master.  Then his courage failed and he began to stroke her tenderly, smoothing her long ears, kissing her on the muzzle lavishing upon her  all the loving names that he knew.

A neighbouring clock struck; he could no longer hesitate. He opened the door. “Come,” he said. The beast wagged her tail, understanding only that she has to go out.

They reached the bank and chose a place where  the water  seemed deepest.  Then he tied one end of the cord to the beautiful leather collar and, taking a great stone, attached it to the other end. Then he seized   Cocotte in his arms and kissed her furiously, as one does when he is taking leave of a person. Then he held her around the neck , fondling her and calling her “My pretty Cocotte, my little Cocotte,” and she responded as best as she could, growling with pleasure.

Ten times  he tried to throw her in, and each time  his heart failed him. Then abruptly he decided to do it and, with all the force, hurled her as far as possible. She tried at first to swim, as she did when taking bath, but her head dragged by the stone, went under again and again. She threw her master a look of despair, a human look, battling, as  a person does when drowning. Then before the whole body sank, the hind paws moved swiftly in the water; then they disappeared also.

For five minutes bubbles of air came to the surface as if the river had begun to boil.  And Francis, haggard, excited, with heart palpitating, believed he saw Cocotte writhing in the slime.  And he said to himself  with the simplicity of a peasant : “What does she think of me by this time, that beast?”

He almost became idiotic.  He was sick for a month and each night saw the dog again . He felt her licking his hands; he heard her bark.

It was necessary to call a physician.  Finally he grew better, and his master and mistress  took him to their estate in Rouen.

There he was still on the bank of Siene.  He began to take baths.  Every morning he went down with the groom to swim across the river.

One day, as they were amusing  themselves splashing in the water, Francis suddenly cried out to his companion:

“Look at what is coming towards us. I am going to make you taste a cutlet.”

It was an enormous carcass, swelled and stripped of its hair, its paws moving forward in the air, following the current.

Francis approached it making his jokes:

“What a prize, my boy! My!  But it is not fresh! It is not thin, that is sure!”

And he turned about. Keeping  at a distance from the great putrefying body.

Then suddenly  he kept still  and looked at it in strange fashion.  He approached it again, this time near enough to touch.  He examined carefully the collar, took hold of the leg, seized the neck, made it turn over, drew it toward him, and read upon  the green copper that still adhered to the discoloured leather: ” Mlle  Cocotte, from Francis, the coachman.”

The dead dog had  found her master  sixty miles  from their home.

He uttered a fearful cry and began to swim  with all his might  toward the bank,  shouting all the way.  and when he reached  the land he ran, all bare through the country. He was mad!

.

Guy de Maupassant

French Shortstory Writer.

Further Reading: http://en.wikipedia.org/wiki/Guy_de_Maupassant

%d bloggers like this: