అనువాదలహరి

అది మారదు… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

ఇన్నిసంవత్సరాలు గడిచేక

అది ఇంకేం మారుతుంది? మారదు.

వియోగమూ, కన్నీళ్ళూ కూడా

జీవితాన్ని విఛ్ఛిన్నం చెయ్యలేకపోయాయి.

,

మృత్యువు దాన్ని ఇక మార్చలేదు.

నేను మరణించిన తర్వాత

నీకోసం రచించిన నా గీతాలన్నిటిలో

అది చిరస్థాయిగా మిగిలిపోతుంది.

.

English: Filsinger, Sara Teasdale, Mrs., portr...
English: Filsinger, Sara Teasdale, Mrs., portrait photograph. (Photo credit: Wikipedia)

సారా టీజ్డేల్

(August 8, 1884 – January 29, 1933)

అమెరికను కవయిత్రి

.

It Will Not Change

.

It will not change now

After so many years;

Life has not broken it

With parting or tears;

.

Death will not alter it,

It will live on

In all my songs for you

When I am gone.

.

Sara Teasdale

(August 8, 1884 – January 29, 1933)

American Poet

%d bloggers like this: