రోజు: సెప్టెంబర్ 9, 2012
-
సరోవరం జ్ఞాపకంలో … ఎడ్గార్ ఏలన్ పో, అమెరికను కవి
యౌవనం తొలినాళ్ళలో ఈ విశాలవిశ్వంలో అన్నిటికంటే ఇష్టమైన ప్రశాంతంగా ఉండే జాగా కోసం వెతుక్కోవడం నాకో అలవాటుగా ఉండేది. . చుట్టూ నల్లని రాళ్లతో, అంబరాన్ని తాకే పైన్(pine) చెట్లతో ఈ ప్రకృతిసిధ్ధమైన సరోవరపు ఏకాంతం ఎంత హాయిగా ఉండేదో చెప్పలేను. . కాని, చీకటిపడిన తర్వాత నిశాసుందరి మనఅందరిమీద కప్పినట్టే ఈ ప్రదేశం మీద కూడా తన నల్లని ముసుగుకప్పిన తర్వాత మార్మికపు పిల్లతెమ్మెర ఏవో రహస్యాలాలపిస్తూ పక్కనుండి పరిగెత్తుతున్నప్పుడు చూడాలి, అబ్బ! ఈ సరోవరపు…