అనువాదలహరి

జైలులో ఒక సాయంత్రం … ఫైజ్ అహ్మద్ ఫైజ్ ( ఒక కవిత – రెండు అనువాదాలు)

అనువాదం 1

.

సాయంసంధ్యా నక్షత్రాల

సర్పిలాకారపు మెట్లదారిని

చీకటి లోకం మీదకి దిగుతోంది.

ఎవరో ప్రేమగా చెవిలో ఊదినట్లు, పిల్లగాలి

పక్కనుండి పల్చగా పలకరించి పోతోంది.

.

జైలు ఆవరణలోని గుర్తుపట్టలేని చెట్లు

ఆకాసపుచొక్కామీద

ఏవో బొమ్మలూ, ఆకారాలూ గియ్యడంలో

నిమగ్నమైపోయి ఉన్నాయి.

.

ఆకాశం భుజం మీద

ఉదారమైన వెన్నెల హస్తం మెరుస్తూ,

వెలవెలబొతున్నచుక్కలవెలుగు ధూళిలో కలిపేసి,

అంతరిక్షపు నీలివర్ణాన్ని

నక్షత్రాలవెలుగుల్లో గిలకరిస్తోంది

.

ప్రేయసినుండి నా ఎడబాటు

దుఃఖపుతెరలుగా హృదయాన్ని తాకుతున్నట్టు

అక్కడక్కడ పచ్చని చివురులలోంచి

ఆకాశపు నీలినీడలు మిణుకుమంటున్నాయి.

.

నా మనసు హృదయానికి పదేపదే చెబుతోంది:

ఈ క్షణంలో జీవితం ఎంత తీయగా ఉందంటే

కరకు విష రసాయనం తయారుచేసేవాళ్ళు

ఇంతత్వరలో  విజయం సాధించలేరు.

.

ఒకవేళ వారు ప్రేమికుల

సంగమస్థలులలో కొవ్వొత్తులు ఆర్పితేనో;

సరే, చూద్దాం, చందమామనుగూడా

ఆర్పగల సమర్థత వాళ్లకి ఉందేమో!

.

ఫైజ్ అహ్మద్ ఫైజ్

(ఇది S అబ్బాస్ రజా గారి అక్షరాక్షర ఆంగ్ల అనువాదానికి తెలుగుసేత)

.

A PRISON EVENING

Night descends on a spiral
staircase of evening stars;
a breeze passes by
as tenderly as if
someone had said a loving thing.

The countryless trees
of the prison courtyard
are absorbed in drawing
pictures and patterns
on a shirtfront of sky.

On the shoulders of heaven
shines the lovely hand
of beneficent moonlight,
dissolving into dust the watery stars,
dissolving the blueness of sky in the starry light.

In greenish corners
shimmer sky-blue shadows
in the way that the waves
of the pain of separation
from my lover arrive in my heart.

My mind continually says to my heart:
so sweet is life at this very moment
that those who prepare
the poisons of cruelty
cannot be victorious today or tomorrow.

So what if they managed
to put out the candles
in the places where lovers meet;
let us see if they can ever
extinguish the moon.

.

(Literal Translation by S. Abbas Raza.)

—————————————————

అనువాదం 2

.

ప్రతి నక్షత్రమూ ఒక సోపానము

సాయంత్రమనేసర్పిలాకారపు మెట్లదారివెంబడి

రాత్రి క్రిందకు దిగుతుంది.

ఎవరో అప్పుడే ప్రేమగా ఏదో చెప్పినట్టు

చిరుగాలి ప్రక్కనుండి రాసుకునిపోతుంది

జైలు ఆవరణలోని కాందిశీకులైన వృక్షాలు

స్వదేశానికి పోవడానికి విహాయసవీధిలో

పథకాలు రచించుకుంటున్నాయి.

చూరుమీద చంద్రుడు  ప్రేమతో, ఔదార్యంతో

చుక్కలను మెరుగుధూళిగా మారుస్తున్నాడు

.

నాలుగుమూలనుండీ నల్లని నీడలు

తెరలుతెరలుగ నన్ను చేరుకుంటున్నయి.

నా ప్రేయసినుండి ఈ ఎడబాటు గుర్తుచేసుకున్నప్పుడల్లా

నా మీద విరిగిపడే దుఃఖపు కెరటాల్లా

అవి ఏ క్షణంలోనైనా నామీద ఎగిసిపడవచ్చు.

.

అయితే నాకు ఈ ఆలోచనే కొంత ఉపశాంతినిస్తుంటుంది:

ప్రేమికులు సమావేశమయే గదుల్లో

నియంతలు దీపాలను నాశనం చెయ్యమని ఆదేశించవచ్చు;

కానీ చంద్రుణ్ణి ఆర్పలేరుగదా, కనుక

ఇంతత్వరలో ఏ నియంతృత్వమూ గెలవదు.

భూమ్మీద ఏ మూలనైనా

గడపగలిగిన ఒక క్షణంపాటి మధురంగా

ఈ జైలులో ఏ ఒక్క సాయంత్రమైనా ఉంటే

ఎలాటి చిత్రహింసలనైనా అవలీలగా భరించవచ్చు.

.

ఫైజ్ అహ్మద్ ఫైజ్

(ఇది ఆగా షాహిద్ ఆలి గారి ఆంగ్ల అనువాదానికి తెలుగుసేత. )

ఈ కవితని పాకిస్తానుజైల్లో రాజకీయ ఖైదీగా ఉండగా ఫైజ్ అహ్మద్ ఫైజ్ రచించేరు. షాహిద్ ఆలి అనువాదాన్ని అతను మెచ్చుకున్నారు కూడా. అయితే ఈ రెండు అనువాదాలూ, అనువాదప్రక్రియ ఎలా ఉండాలి అన్న అంశం మీద చర్చకు మంచి మార్గదర్శకాలు.

Second Translation

A Prison Evening

.

Each star a rung

night comes down the spiral

stair case of the evening

The breeze passes by so very close

as if someone just happened to speak of love.

In the courtyard

trees are absorbed refugees

embroidering maps of return on the sky.

On the roof,

moon—lovingly, generously—

is turning the stars

into a dust of sheen.

From every corner, dark-green shadows,

in ripples, come towards me.

At any moment they break over me

like the waves of pain each time I remember

this separation from my lover.

.

This thought keeps consoling me:

though tyrants may command that lamps be smashed

in rooms where lovers are destined to meet,

they cannot stuff out the moon, so today,

nor tomorrow, no tyranny will succeed,

no poison of torture make me bitter

if just one evening in prison

can be so strangely sweet

if just any moment anywhere on the earth.

.

Faiz Ahmad Faiz

(Faiz Ahmad faiz composed this when he was a political prisoner in Pakisthan.)

(Translation by Agha Shahid Ali)

————————————————————————————————————— (Text Courtesy: http://www.3quarksdaily.com/3quarksdaily/2011/12/poetry-in-translation.html)

%d bloggers like this: