అనువాదలహరి

చరిత్ర పునరావృతం అవుతుందో లేదో నాకు తెలియదు… యెహుదా అమిఖాయ్, ఇజ్రేలీ కవి

చరిత్ర పునరావృతం అవుతుందో లేదో నాకు తెలియదు
కాని నాకు నువ్వు పునరావృతం అవవనిమాత్రం తెలుసు

నాకు గుర్తుంది… నగరం
యూదులూ అరబ్బులని రెండుగా చీలిపోవడమే కాదు
నీకూ నాకూ మధ్య కూడా చీలిపోయింది

మనిద్దరం అక్కడ కలిసిబ్రతుకుతున్నప్పుడు
మనిద్దరం ప్రమాదాల్లో ఒకతల్లిబిడ్డల్లా ఉండేవాళ్లం
ఉత్తరాన్న ఎక్కడో దూరంగా ధృవప్రాంతాల్లో ఉండేవాళ్ళు
మంచునుండికాపాడుకుందికి కట్టుకున్న ఇళ్ళలా
యుధ్ధాలనుండి రక్షించుకుందికి మనం ఇళ్ళుకట్టుకున్నాం

.

ఇప్పుడు నగరం మళ్ళీ ఏకమయ్యింది
మనం మాత్రం ఇప్పుడు ఏకం కాలేకపోయాం
నాకు నువ్వుపునరావృతం కావని ముందే తెలిసినట్టు
ఇప్పుడు నాకు అర్థమయ్యింది
చరిత్రకూడా పునరావృతం కాదని

.

యెహుదా అమిఖాయ్,

(మే 3, 1924 – సెప్టెంబరు 22, 2000)

ఇజ్రేలీ కవి .

.

I Don’t Know If History Repeats Itself

.

I don’t Know if history repeats itself
But I do know that you don’t.

I remember that city was divided
Not only between Jews and Arabs,
But Between me and you,
When we were there together.

We made ourselves a womb of dangers
We built ourselves a house of deadening wars
Like men of far north
Who build themselves a safe warm house of deadening ice.

The city has been reunited
But we haven’t been there together.
By now I know
That History doesn’t repeat itself,
As I always knew that you wouldn’t.
.
Yehuda Amichai

(3 May 1924 – 22 September 2000)

Israeli poet.

%d bloggers like this: