Man Without Face … Chintam Praveen
He does possess an anatomical heart,
but it shall never throb
Amidst embarrassing necessities
he shall always be weaving
a cobweb of relationships.
Occasionally,
we can hear him
and, also, see his actions.
The only thing that we cannot see
is his face.
In fact,
he was long dead
for goodness
and for humanity.
He is always in the look out
for excuses to hate
just as the village, for loving him.
Even when every minute that has passed
every word he has uttered
accost him;
Every path he crossed
and every step he put
follow him from a winking distance
Walking over concrete
he turns as hard-hearted as concrete;
And petrifies, after taking waters of civilization.
The man who took leave of the village once,
leaves it once for all.
.
(Dedicated to folks who lost love of their land)
.
Chintam Praveen
‘
Mr. Praveen is Research Scholar in the Department of Telugu, Kakateeya University, Warrangal, Andhra Pradesh, India.
మొఖంలేనోడు
వాడికీ
హృదయముంటుంది
దానికి స్పందన ఉండదు
వాడెప్పుడూ
అవసరాల అక్కసుల నడుమ
అనుబందాల సాలెగూడు అల్లుతుంటడు
అప్పుడప్పుడు
వాడి మాట వినపడుతుంది
వాని చేతలు కనపడుతాయ్
కనిపించనిదల్లా
వాని మొఖమే
నిజానికి
వాడెప్పుడో కాటకల్సిండు
మంచితనం నుండి
మనిషితనం నుండి
వాడెప్పుడూ
కారణాలు వెతుకుతుంటడు
ద్వేషించటానికి…
ఊరు వాణ్ణి ప్రేమించటానికి లాగా…
గడిచిన ప్రతీ నిమిషం
పలికిన ప్రతీ మాట
ఎదురుతిరిగి ప్రశ్నిస్తున్నా
నడిచిన ప్రతీ దారి
విడిచిన ప్రతీ అడుగు
రెప్పపాటు దూరంలో వెంబడిస్తున్నా
కాంక్రీట్ పై చరిస్తున్నవాడు
హృదయాన్ని కాంక్రీట్ లాగా మార్చుకుంటడు
నాగరికత నీళ్ళు తాగి బండబారిపోతాడు
ఊరిడ్సిన వాడు
ఊరును విడిచేస్తడు
(ఊరుతొ పాటు ఊరుపై మమకారాన్ని వదిలేసినోళ్ళ కోసం)
.
చింతం ప్రవీణ్
The Seedless … Afsar
The seed
Has become unviable.
1
You and I
are a desert each now
A Thar…
A Sahara…
2
The path lays there like a tired breath
our path … in that wild.
The course smothered under our steps
is like a lone cob glistening through your mantle…
it is a smile dashed against the shores of my lips…
3
That land is no more,
With fields bowing under heavy harvest
And our hands grazing over them.
There is no more that scaffolding
nor the dreams we once dreamt lying there.
4
There’s no river
or our feet dunked in it
neither the ripples they created there
nor the fish that kissed them.
5
No,
There is not a drop in the river
And in our eye that anxiously follows it.
6
Is this reticence?!
.
Afsar

Mr Afsar is a Lecturer in Department of Asian Studies at University of Texas at Austin.
Telugu Original:
The seedless
విత్తనం నిర్వీర్యమయిపోయింది.
1
నేనూ నువ్వూ ఇప్పుడొక ఎడారి
ఎడారి
ఎడారి .
2
అలసిపోయిన వూపిరిలా
పడి వుంది దారి-
అడవిలో మనిద్దరి ఈ దారి.
మనం నడిచెళ్లిన అడుగుల కింద మెత్తబడిన దారి
ఇప్పుడు నీ పైవస్త్రంలోంచి మెరుస్తున్నవొంటరి వెన్ను
నా పెదవి చివర్న చితికిపోయిన నవ్వు. …
3
నేల లేదు
విరగ్గాసి వొంగిపోయిన చేలు లేవు.
వాటి మీద వీచిన మన చేతులు లేవు.
మంచె లేదు
దాని మీద నిద్రించిన మన కలలు లేవు.
4
నది లేదు
అందులో తడిసిన మన పాదాలు లేవు
అవి కదిలించిన మెత్తని వలయాల్లేవు.
వాటిని ముద్దాడే చేపలూ లేవు.
5
లేదు
చుక్క నీరు లేదు నది వొంటి మీద.
దాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న మన కంటి కింద.
6
ఇది నిశ్శబ్దమా?!
An Earthen Pot … Ravi Verelly
Someone is walking away
sacking the clay
sedimented
on the banks
abraded and
shoved by Time.
*
Wetting the heap of argil
on the potter’s wheel occasionally,
The Moment is
Pressing it to shape.
Separating it from the wheel in a trice
like a midwife who snaps the umbilical,
Youth harmonizes it
tapping it with a spatula.
Manhood is the brittle,
shapely, unburnt pot
dried up in the sun.
It is time to burn it
in the kiln of life.
*
Sir !
Putting your ears to it
and tapping it with your knuckles
you test my quality.
Am I sound?
*
O, my dear son!
You circle around the pyre
With potful of water
Without looking back.
Child!
Hold the pot rather carefully!
.
Ravi Verelly.
Mr. Ravi Verelly is a Software Architect with TMEIC. Currently, he lives in Roanoke, Virginia. He went to US 15 years ago. He is very nostalgic about his village Amudalapalle and his childhood memories. He published his maiden collection of poems in Telugu … Doopa (Thirst) recently.
.
మట్టికుండ
తోసుకుంటూ
కోసుకుంటూ వెళ్తున్న
కాలం ఒరిపిడికి
వొడ్డు చేరిన
సన్నటి మట్టిని
మూటల్లో నింపుకుని
ఎవరో
నడుచుకుంటూ వెళ్తున్నారు.
*
దిమ్మె మీదున్న
లెలెత మట్టిముద్దకు
తడి అద్దుతూ
ఏదో ఆకారాన్నిస్తూ
సారె చక్రం తిప్పుతూ
సమయం.
మంత్రసానిలా
బొడ్డుపేగును కసుక్కున కత్తిరించి
సారెనుంచి వేరుచేసి
సవరింపుల కర్రతో
వీపంతాదబదబా బాదుతూ
కౌమార్యం.
ఎండలో ఆరబెట్టిన
అందమైన పచ్చి పెళుసు మట్టికుండ
యవ్వనం.
కష్టాల ఆవంలో జీవితాన్ని కల్చాలిక.
*
కుండ చెవికానించి కుడిచేయితిప్పి
వేళ్ళమెటికలతో కొడుతూ
నాణ్యతచూసే వో అయ్యా…
నే మోగుతున్నానా?
*
నిండిన నీళ్ళకుండెత్తుకుని
వెనక్కి తిరగకుండా
కట్టెలచుట్టూ తిరిగే
వో కొడుకా
కుండ జర పైలం.
.
రవి వీరెల్లి
(దూప కవితా సంకలనం నుండి)
మోడువారిన నారింజ … గార్సియా లోర్కా, స్పానిష్ కవి
ఓ కట్టెలుకొట్టేవాడా!
నా నీడని నా నుండి వేరు చెయ్యి.
ఒక్కపండూ లేకుండా ఉన్న నన్ను,
నేను చూడవలసిన దౌర్భాగ్యం నుండి తప్పించు.
.
నేనెందుకీ ఈ అందమైన చెట్లమధ్య పుట్టాలి?
పొద్దు నాచుట్టూ వృత్తంలా తిరుగుతుంటుంది,
నక్షత్ర మండలాలను అలంకరించుకుని రాత్రి
నన్ననుకరిస్తుంటుంది.
.
నా నీడచూసుకుని నేను బ్రతకలేను.
ఇకనుండి చీమలనీ, ఆకు ఎరువునీ కలగంటూ,
ఆ నిద్రలోనే
చివుర్లు తొడిగి పక్షినై పోతాను.
.
ఓ కట్టెలుకొట్టేవాడా!
నా నీడని నానుండి వేరు చెయ్యి.
ఒకపండూలేకుండా ఉన్న నన్ను
నేను చూడవలసిన దౌర్భాగ్యం నుండి తప్పించు.
.
గార్సియా లోర్కా
స్పానిష్ కవి
(ఈ కవిత చదువుతుంటే, పింగళి-కాటూరి గారల ఈ క్రింది పద్యం గుర్తొస్తుంది:
ఉ.|| కాలవశమ్మునన్ విసరుగాడ్పులకున్ ముదురాకుపుట్టముల్
రాలగ, బాటసారుల పరామరిశింపగలేక సంపదల్
దూలిన దాతవోలె జిగిదూలిన ఆ యెలమావిగున్న, యా
కాలవశమ్ముచేతనె సఖా! వికసించెడి సౌరుగంటివే!
కాకపోతే ఈ పద్యంలో మామిడి చెట్టు వసంతాగమనంతో మళ్ళీ వికసించడం గురించి చెబితే, లోర్కా మోడువారిన నారింజచెట్టు కలలోనే వికసించడం గురించి చెబుతున్నాడు. ఒకటి ఆశావాదాన్ని సూచిస్తే, రెండవది నిరాశావాదాన్ని సూచిస్తోంది.)

.
Song of the Barren Orange Tree
.
Woodcutter.
Cut out my shadow.
Free me from the torture
of seeing myself fruitless.
Why was I born among mirrors?
The daylight revolves around me.
And the night herself repeats me
in all her constellations.
I want to live not seeing self.
I shall dream the husks and insects
change inside my dreaming
into my birds and foliage.
Woodcutter.
Cut out my shadow.
Free me from the torture
of seeing myself fruitless
.
By Federico García Lorca
1898–1936
Translated By A S Kline
(Poem Courtesy: http://www.poetryintranslation.com/PITBR/Spanish/Lorca.htm#_Toc485030379)
It is not that easy to vacate the resident silence … Bobby Nee
It was long
Since my reflection in the mirror smiled;
And god knows when
The dismal prospects crossed
The thresholds of imagination last!
Deep inside
Failure peeps through nervously…
The word bandied from the lips
Ducks in some corner of the heart;
And the aborted thought splintered to smithereens
Aches and smarts within.
Sometimes, one has to explode the lips
With a claymore mines
To dig out the buried words.
In this compulsive living
I have to bear the burden of knowledge
Rolling up, I must hole myself up
Somewhere deep within.
Voice must break the walls of silence…
Yet,
It is not that easy to vacate the resident silence.
.
Bobby Nee (1985 -)
Indian Poet
He is a young journalist and a reporter for with ABN Andhra Jyothi, a popular Telugu News Channel. He is a young poet with leftist leanings.

Bobby Nee (1985-)
He is a young journalist and a reporter for with ABN Andhra Jyothi, a popular Telugu News Channel. He is a young poet with leftist leanings.
Telugu Original:
.
“మౌనంగదినిఖాళీచేయటంఅంతతేలికేంకాదు“
మాఇంట్లో…అద్దంలో…నాముఖంనవ్వి
చాన్నాళ్ళయ్యింది!
చూపులచీకట్లు
ఊహలగడపలుదాటిఎన్నాళ్ళయ్యింది!
అంతరాంతరాల్లో
ఓటమిఒదిగిఒదిగిచూస్తుంది
పెదాలమీంచివిసిరినమాట
గుండెమూలనెక్కడోపడుంది
ఆలోచనపగిలిముక్కలై
లోపల్లోపలేగుచ్చుకుంటుంది
అప్పుడప్పుడుపెదాల్ని
క్లొమోర్మైన్లతోపేల్చుకుని
మాటల్నిబయటకుతీయాలి
బలవంతపుబతుకులో
కొన్నిసంగతులసంకెళ్ళుతగిలించుకోవాలి
నన్నునేనేమడుచుకునినాలోపలలోలోపలదాచుకోవాలి!
నిశ్శబ్దపుగోడల్నిశబ్ధంబద్దలుచెయ్యాలి
అయినా…
“మౌనంగదిఖాళీచేయటంఅంతతేలికేంకాదు!”
…………………………….”నీ”
ప్రేమ… విస్టెన్ హ్యూ ఆడెన్, అమెరికను కవి
తలెత్తి నింగిలోని చుక్కలని చూసినపుడు,
పాపం, అవి అంతగా పట్టించుకుంటున్నా,
చివరకి నేనెందుకూ పనికిరాకుండా పోవచ్చు.
అదే నేలమీదైతే, మనిషైనా, మృగమైనా
అవి మనఊసెత్తకపోతే,అసలు వెరవనక్కరలేదు.
.
పాపం తారలు మనమీద ప్రేమతో రగిలిపోతుంటే
మనం తగినరీతిలో స్పందిచకపోతే ఎలా ఉంటుంది?
ఎవరూ సమానంగా ప్రేమించలేరనుకున్నప్పుడు,
ఇద్దరిలో ఎక్కువ ప్రేమించేది నేననవుతా.
.
మనం వాటిని గుర్తించేమో లేదో
ఖాతరుచెయ్యని నక్షత్రాలంటే ఇష్టమయిన నాకు,
అవి ఇప్పుడు కనిపిస్తున్నా,
పగలల్లా వాటిని చూడలేకపోయానన్న చింత లేదు.
.
అసలు నక్షత్రాలన్నీ అంతరించడమో, మాయమవడమో జరిగితే,
నేను శూన్య మైన ఆకాశాన్ని చూడడం నేర్చుకోవాలి.
దాని మహత్తరమైన నిశా సౌందర్యాన్ని,
కొంత సమయం పట్టినప్పటికీ, ఊహించుకోగలగాలి .
.
విస్టెన్ హ్యూ ఆడెన్
(21 February 1907 – 29 September 1973)
(ఇది ఒక రకంగా సంక్లిష్టమైన కవిత. దాని శిల్పం అలాంటిది. కవి చెబుతున్నది లేదా పరోక్షంగా నిరసిస్తున్నది మనకున్న కొన్ని మూఢనమ్మకాలనీ, వెలిబుచ్చుతున్నది మానవ జాతి మనుగడ శాశ్వతంగా ఉండాలన్న కోరికనీ.
ఇక్కడ “నేను” అన్నది విశ్వమానవుడికి పర్యాయపదం.
మనమీద నక్షత్రాలు ఎంతప్రభావం చూపించినా మనం ఎందుకూ కొరగాకుండా పోవచ్చు… అన్నది రెండింటికీ ఏమీ సంబంధం లేదని సూచించడానికి. కానీ, మనం నక్షత్రాలవల్ల ప్రేరణపొందుతాం. అవి మనల్నిప్రేమించకపోయినా, మనం వాటిని ప్రేమిస్తాం అన్న భావన అదే. ప్రేమలో తేడాని చెబుతున్న రెండు మూడు చరణాలభావం అదే. అసలు కవితలోని మలుపు 4 వ చరణం లో ఉంది. నక్షత్రాలు అంతరించడం జరగదు. కానీ, నక్షత్రాలు లేని (అంతరించిపోయినా, మాయమైనా) చీకటిరాత్రి మనిషి వినీఎలాకాశపు నిశాసౌందర్యం వీక్షించాలంటే, నక్షత్రాలు సమసిపోయినా మనిషి మిగిలి ఉండాలి కదా. ఆ మనిషే సవ్యంగా లేకపోతే, నక్షత్రాలు ఎంత ప్రభావం చూపించినా, ఎందుకూ కొరగాకుండాపోతాడని మొదట చెప్పిన భావానికి లంకె.)

.
The More Loving One
Looking up at the stars, I know quite well
That, for all they care, I can go to hell,
But on earth indifference is the least
We have to dread from man or beast.
How should we like it were stars to burn
With a passion for us we could not return?
If equal affection cannot be,
Let the more loving one be me.
Admirer as I think I am
Of stars that do not give a damn,
I cannot, now I see them, say
I missed one terribly all day.
Were all stars to disappear or die,
I should learn to look at an empty sky
And feel its total dark sublime,
Though this might take me a little time.
— W H Auden
Related articles
- W.H. Auden: “What, at this moment, am I meant to know?” (lifeondoverbeach.wordpress.com)
- Dark and dull is your distraction (Auden) (evelinanotenbuchlein.wordpress.com)
గంధర్వ బాలిక… మార్గరెట్ మాహీ, న్యూజిలాండు కవయిత్రి

.
నేను పుట్టిన ఉత్తరక్షణంలోనే,
ఖడ్గమృగమ్మీద స్వారీ చేశాను.
మగపిల్లలు కప్పపిల్లల్ని వాళ్ల పాత్రల్లోకి ఏరుకుంటుంటే,
నేను నా డబ్బాని నక్షత్రాలతో నింపేను.
నేను సూర్యుణ్ణి చూడ్డానికి కూనిరాగం తీస్తున్నానని
మిగతా పిల్లలు నన్ను వేలెత్తి చూపిస్తూ పారిపోతారు.
నేను పక్షులని పంజరాల్లోంచి విడిచిపెడతానని
ప్రజలు నన్ను చూస్తే తలుపేసుకుంటారు.
ఓ మగవాళ్ళ లోకమా!
నీ కిదే పదేపదే నా వీడ్కోలు
మళ్ళీ ఇక్కడికి మరోసారి రమ్మన్నా రాను
.
మార్గరెట్ మాహీ
న్యూజిలాండు కవయిత్రి

.
The Fairy Child
.
The very hour that I was born
I rode upon the unicorn.
When boys put tadpoles in their jars
I overflowed my tin with stars.
Because I sing to see the sun
The little children point and run.
Because I set the caged birds free
The people close their doors to me
Goodbye, goodbye, you world of men
I shall not visit you again.
.
Margaret Mahy
Poem Courtesy: http://booksellersnz.wordpress.com/2012/07/24/tuesday-poem-the-fairy-child-by-margaret-mahy/
Related articles
- Rest in Peace Margaret Mahy (sherievon.wordpress.com)
- Tributes to Margaret Mahy (sherievon.wordpress.com)
- Author Margaret Mahy dies (radionz.co.nz)
నన్నెంతగా ప్రేమిస్తున్నావు? … కార్ల్ సాండ్ బర్గ్, అమెరికను కవి
నువ్వు నన్నెంతగా ప్రేమిస్తున్నావు ఇవాళ? ఒక మిలియను బుషెల్స్ ఉంటుందా?
అంతకంటే ఎక్కువా? నిజంగా, అంతకంటే చాలా ఎక్కువ?
.
బహుశా, రేపు బుషెల్ లో సగం అయిపోతుందేమో?
లేక, బుషెల్ లో సగం కంటే కూడ తక్కువో.
.
ఇదేనా ప్రేమంటే నీ హృదయగణితం?
అచ్చం ఇలాగే, గాలికూడ, వాతావరణాన్ని కొలుస్తుంటుంది.
.
కార్ల్ సాండ్ బర్గ్
(January 6, 1878 – July 22, 1967)
అమెరికను కవి
(గాలికి ఎంత నిలకడ ఉండదో, కొందరి ప్రేమ కూడ అంత నిలకడలేనిదే అన్న భావాన్ని చెబుతోంది ఈ కవిత. నిజానికి ఇందులో ప్రేమ అన్న పదం వాడినా, అవతలివ్యక్తి దేనిని ప్రేమగా పొరబడుతున్నారో దాన్ని వ్యంగ్యంగా ఎత్తి చూపిస్తోంది ఈ కవిత. )

.
How Much?
.
How much do you love me, a million bushels?
Oh, a lot more than that, Oh, a lot more.
And to-morrow maybe only half a bushel?
To-morrow maybe not even a half a bushel.
And is this your heart arithmetic?
This is the way the wind measures the weather.
Carl Sandburg
(January 6, 1878 – July 22, 1967)
American Poet
(Note: strictly speaking, Bushel is a unit of dry volume measure of about 8 Gallons … or, equivalent to the volume of a cylinder with 18.5 inches diameter and 8 inches height. Here it is used not in that sense, but only as a rhetoric.)
(Poem Courtesy: http://www.poets.org/viewmedia.php/prmMID/21436)
ఎక్కడో ఒక చోట… క్రిస్టినా రోజెటి, ఆంగ్ల కవయిత్రి
ఎక్కడో ఒక చోట, నేను ఇప్పటివరకూ
చూడని వదనమూ, వినని స్వరమూ,
నా మాటకి ఇంకా స్పందించ వలసిన హృదయమూ
నా అదృష్టం ఎలా ఉందో — తప్పకుండా ఉంటాయి
.
ఎక్కడో ఒకచోట, దగ్గరో దూరమో
ఖండాలూ, సముద్రాలూ దాటి,
కంటికి కనిపించనంతదూరంలో, చంద్రుణ్ణి దాటి,
తనని ప్రతి రాత్రీ గమనించే నక్షత్రానికావల…
.
ఎక్కడో ఒక చోట, దూరమో దగ్గరో,
కేవలం ఒక గోడ, ఒక కంచె, మధ్యలో అడ్డుగా;
పచ్చగా పెరిగిన పచ్చికమీద
ఈ సంవత్సరాంతపు చివరి ఆకులు రాలుతూ…
.
క్రిస్టినా రోజెటి
(5 December 1830 – 29 December 1894)
ఆంగ్ల కవయిత్రి
Pre-Raphaelite Brotherhood (PRB)లో ఒకరిగా అధికారికంగా పరిగణించబడకపోయినా, క్రిస్టినా రొజెటి, అందులో ప్రముఖ సభ్యురాలే. ఒక రకంగా ఆమె విక్టోరియన్ యుగపు మధ్యతరగతి స్త్రీలకు ప్రతినిధి. 19వ శతాబ్దంలో విజ్ఞాన శస్త్రం అందుబాటులోకి తెచ్చిన రైలు ఇంజను, స్టీమరూ, ఎలక్ట్రిక్ బల్బు లవల్ల, సాంఘికంగా, ఆర్థికంగా ప్రజలజీవితాలలో పెనుమార్పులు వచ్చేయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో. అప్పట్లో ఉద్యోగాలు చేసి, డబ్బు సంపాదించే స్త్రీలకు, స్త్రీలుగా గుర్తింపు ఉండేది కాదు. ఇంటిపనులు చూసుకుని పిల్లల్నికనే వాళ్ళకి మాత్రమే ఆ గౌరవం దక్కేది. కాని, ఇతరమార్పులతో పాటు, మధ్యతరగతి యువతులకు ఆర్థిక స్వాతంత్ర్యం పై అభిలాష పెరిగింది. వాళ్ళిపుడు ఒంటరిగ ఉండడానికి వెనుకాడటం లేదు. స్కూలు టీచరుగానో, గవర్నెస్ గానో, పనిచెయ్యడానికి వెనుకాడ లేదు. ఆ రోజుల్లో వచ్చిన ఛార్లెట్ బ్రాంటే నవలలో హీరోయిన్ ఉన్నతవర్గ కుటుంబాలలో గవర్నెస్ గా పనిచేస్తున్నట్టు చిత్రించడం కేవలం కాకతాళీయం కాదు. క్రిస్టినా తన కవితలలో (ముఖ్యంగా Maude)ఆనాటి స్త్రీల అభిలాషలని ప్రతిబింబించింది.
PRB సభ్యులు, విజ్ఞాన శాస్త్ర ప్రగతి, ప్రజలు ప్రకృతిని చూడవలసిన రీతిలో చూడడం లేదన్న భావనతో ఏర్పడ్డ సంఘం. వాళ్ళ కవితలలో, చిత్రాలలో సంప్రదాయాన్ని ధిక్కరించి, ప్రకృతిని ఎంత దగ్గరగా ప్రతిఫలించగలిగితే అంతగా దగ్గరగా, ప్రతీకలతో నైనా, ప్రతిఫలించాలన్నది ఒక సూత్రం.
ఈ కవిత ఒక మధ్యతరగతి యువతి మనసులోని ఆలోచన ప్రతిబింబిస్తోంది. ఆఖరి చరణంలోని “సంవత్సరాంతపు చివరి ఆకులు” … జీవిత చరమాంకం లోనైనా అన్నదానికి ప్రతీకగా వాడింది ఆమె.

.
Somewhere or Other
.
Somewhere or other there must surely be
The face not seen, the voice not heard,
The heart that not yet—never yet—ah, me!
Made answer to my word.
.
Somewhere or other, maybe near or far;
Past land and sea, clean out of sight;
Beyond the wandering moon, beyond the star
That tracks her night by night.
.
Somewhere or other, maybe far or near;
With just a wall, a hedge, between;
With just the last leaves of the dying year
Fallen on a turf grown green.
.
Christina Rossetti
(5 December 1830 – 29 December 1894)
English Poet.
For further reading: http://en.wikipedia.org/wiki/Christina_Rossetti
http://www.victorianweb.org/authors/crossetti/rossettibio.html
http://wikis.lib.ncsu.edu/index.php/ENG_463_Christina_Rossetti
Related articles
-
Christina Rossetti’s ‘Goblin Market ‘ (cultureandanarchy.wordpress.com)
-
Featured Poem: Later Life: A Double Sonnet of Sonnets by Christina Rossetti (thereaderonline.co.uk)
- Selected Poems for Group Project (parlindunganpardede.wordpress.com)
నీకేగనక ఒక స్నేహితుడుంటే… రాబర్ట్ విలియం సెర్విస్, బ్రిటిషు కవి
నీకే గనక ఒక ఆప్త మిత్రుడు, శక్తిమంతుడూ, అహం లేనివాడూ,
నీ తప్పులు తెలిసి, నిన్ను బాగా అర్థం చేసుకున్నవాడూ;
నీ శక్తి యుక్తుల మీద అపారమైన నమ్మకం ఉన్నవాడూ
నిన్ను తండ్రిలా సంరక్షించేవాడూ;
చివరిదాకా నిన్ను విడిచిపెట్టక వెన్నంటి ఉండేవాడూ
ప్రపంచం నిన్నెంత పరిహసించినా,
నిన్నుచూసి ఎప్పుడూ ఆనందించేవాడూ,
అలాంటి స్నేహితుడుంటే, నువ్వు తప్పకుండా
అతన్ని సంతోషపెట్టడానికి ఎప్పుడూప్రయత్నం చేస్తూ,
స్నేహాన్ని వదులుకోవాలన్న ఆలోచనే రానీయవు.
.
అదే నీ స్నేహితుడు చాలా గొప్పవాడూ ఉన్నతుడూ అయి,
అతనొక పెద్ద అంతఃపురంలోనో, భవనంలోనో ఉంటూ
ఒక మహరాజులాగ వెలుగొందుతూ ఉంటే,
అందరి నాలుకలమీదా అతని
గుణగణాలే కీర్తింపబడుతుంటే;
అలాంటివాడు, ఒకసారి అశేషజనానీకం మధ్య,
నిన్ను గుర్తించి, నీ ఒక్కడి వంకే చూసి,
తనసింహాసనం దగ్గరకి రమ్మని పిలుస్తే
ఓహ్! నీకు అప్పుడు ఎంత గర్వంగా, ఆనందంగా ఉంటుంది?
.
నీకు ఇలాంటి మిత్రుడు, ప్రాణంలో ప్రాణం, మనస్వి,
శక్తిమంతుడు, నిన్ను విడవనివాడూ గనక ఉంటే
నువ్వతన్ని అన్నిరకాలుగా సంతోషపెట్టడానికి
తప్పకుండా ప్రయత్నిస్తావని ఖచ్చితంగా చెప్పగలను.
నువ్వు ఏ చింతాలేకుండా ధైర్యంగా జీవించగలవు, ఔనా?
నీ రచనల్లో అతని గొప్పదనం భాసిస్తుంది.
అతన్ని గొంతెత్తి కీర్తిస్తావు… కాని అదే విచిత్రం!
అడిగితే మాత్రం, అలాంటిమిత్రుడు “నాకెవరూ లేడ”ని అంటావు;
నిజంగా లేడూ? నాకు నవ్వొస్తుంది. మరి దేముడెవరంటావ్?
.

రాబర్ట్ విలియం సెర్విస్
(January 16, 1874 – September 11, 1958)
బ్రిటిషు కవి
.
If You Had a Friend
.
If you had a friend strong, simple, true,
Who knew your faults and who understood;
Who believed in the very best of you,
And who cared for you as a father would;
Who would stick by you to the very end,
Who would smile however the world might frown:
I’m sure you would try to please your friend,
You never would think to throw him down.
And supposing your friend was high and great,
And he lived in a palace rich and tall,
And sat like a King in shining state,
And his praise was loud on the lips of all;
Well then, when he turned to you alone,
And he singled you out from all the crowd,
And he called you up to his golden throne,
Oh, wouldn’t you just be jolly proud?
If you had a friend like this, I say,
So sweet and tender, so strong and true,
You’d try to please him in every way,
You’d live at your bravest — now, wouldn’t you?
His worth would shine in the words you penned;
You’d shout his praises . . . yet now it’s odd!
You tell me you haven’t got such a friend;
You haven’t? I wonder . . . What of God?
.
RW Service
(January 16, 1874 – September 11, 1958)
British Poet
Further Reading: http://en.wikipedia.org/wiki/Robert_W._Service
Related articles
- Sunday’s Poetry Corner: Robert William Service (davidmixner.com)