అనువాదలహరి

కవిత్వం పలకని రోజుల్లో … రిఛర్డ్ జోన్స్, అమెరికను కవి

కవిత్వం బాగా రాయగలిగే రోజుల్లో

నే నొక రాజకుమారుణ్ణి;

మరుభూమిలోని ఒక అంతఃపురంలో

పూతోటలో జలయంత్రాలు నీరుపైకిచిమ్ముతుంటే

విలాసంగా మఖ్మలు తలగడమీద చేయి ఆన్చి

రజతపాత్రలో మధుపానం సేవిస్తుంటాను;

ఎదురుగా కవితలన్నీ

గులాబీ రేకులు శృంగారంగా సజ్జీకరించిన

విందులోని భక్ష్యభోజ్యాల్లా

నా ముందు తివాసీలమీద రంగురంగుల్లో

పరచబడి ఉంటాయి.

.

కానీ, ఒకసారి అంతఃపురం నుండి దూరమైతే,

కాలుతున్న ఇసుకమీద డేకురుకుంటూ,

నిర్మానుష్యమైన ఇసుకతిన్నెలమీద

దాహంతో నాలుక పిడచగట్టుకొనిపోతూ,

ఆ హృదయంలేని ఎండమావులు

ఖర్జూరపుచెట్లూ చల్లని చలివేంద్రాలంత

నిజమని విశ్వసిస్తూ … భ్రమిస్తుంటాను

.

రిఛర్డ్  జోన్స్ (1953 -)

అమెరికను కవి

కవులకి మాటపలకకపోవడంకంటే శాపం లేదు. కవిత్వం రాయలేకపోయినప్పుడు కవి భావాలూ, ఆలోచనలూ, అతని సృజనశక్తీ ఎలా ఉంటాయో చాలా చక్కగా విశదీకరిస్తుందీ కవిత. ఎండమావుల వెంట పరిగెత్తడమన్న ప్రతీక, ఇక్కడ ఎంతో శక్తిమంతంగా ప్రయోగించాడు కవి. ఎండమావి ఉన్నట్టు ఊరిస్తుంది.  అలాగే భావం అందినట్టే ఉంటూ కవి చేతికి అందదు.

.

What Do You Do About Dry Periods In Your Writing?

When the writing is going well,
I am a prince in a desert palace,
fountains flowing in the garden.
I lean an elbow on a velvet pillow
and drink from a silver goblet,
poems like a banquet
spread before me on rugs
with rosettes the damask of blood.

But exiled
from the palace, I wander —
crawling on burning sand,
thirsting on barren dunes,
believing a heartless mirage no less true
than palms and pools of the cool oasis.

.

Richard Jones 

(1953 – )

Richard Jones is a professor of English at De paul University Chicago and is also editor of the literary journal Poetry East.  He has to his credit several books of poems, including Country Air, At last we Enter Paradise and  A Perfect Time. He received Midland Authors Award for poetry in 2000 for his book, The Blessing: New And Selected Poems.

Image Courtesy: http://www.americanpoems.com/poets/Richard-Jones

 

(Poem Courtesy:http://www.eliteskills.com/c/21534)

(Bio and Photo courtesy: http://www.americanpoems.com/poets/Richard-Jones)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: