Mr. Anil B Dani, an M.Com. MBA, feels Mr Puttaparthi Narayana Rao and his education at Ramakrishnasramam school had a great influence on him and they kindled the literary interest in him. SriSri and Tilak are his favorites. He is running his blog: http://anildanib.blogspot.in/
.
నేను నిశబ్దం లో
ష్ …………… నిశబ్దం నేను నా మౌనం తో మాట్లాడుతున్నాను
నా తప్పులన్నీ నా మౌనం లో వెతుక్కుని సరిదిద్దుకుంటున్నాను సవ్యమైన అంతరాత్మ దిశలో వెళుతూ
కఠిన నిర్ణయాల కలబోతకు సమయం ఆసన్నమైంది నన్ను నేను వెతుక్కుంటున్నాను నేను తప్పి పోయిన చోట
దేవుడో ,లోకమో ,స్నేహితులో పరిసరాలో, అవసరమో ఇంకోటో తప్పు చేయించినా చేసింది నేను అందుకే దిద్దుకుంటున్నా
విశ్వ అంతరాళం లో విసిరేయబడ్డ నా పాపాలన్నిటిని ఏరి ఒక చోట కూర్చి నిష్కృతి కోసం ఆచరణ సాద్యమైయిన అవకాశాన్ని అందుకుంటున్నాను నా మౌనం లో నన్ను నేను వెతుక్కుంటూ
అనిల్ డాని
23 /08 /2012
విజయవాడ వద్దగల కొండపల్లి వాస్తవ్యులైన ఆనిల్ బి డ్యాని, M.Com, M.B.A. చేసి ప్రస్తుతం ఒక పైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. పుట్టపర్తి నారాయణరావు గారి ప్రభావం, రామకృష్ణాశ్రమం చదువూ సాహిత్యాభిలాష కలిగించేయంటున్న అనిల్ డ్యాని, తిలక్ నీ, శ్రీశ్రీనీ బాగా ఇష్టపడతారు. అతను http://anildanib.blogspot.in/ అనే బ్లాగు నడుపుతున్నారు.
శ్రీశ్రీ చెప్పినట్టు కొందరు తమ వైఫల్యాల్ని దేముడికో, జాతకాలకో ఆపాదించి, తమ విజయాలను మాత్రం తమకే అంటగట్టుకుంటారు. అలా కాకుండ తప్పుచెయ్యడానికి కారకులెవరయినా, తప్పు చేసింది నేనే కాబట్టి దానికి నేనే బాధ్యుణ్ణి, దాన్ని సరిదిద్దుకునే పూచీకూడా నాదే అనే ఆత్మస్థైర్యాన్ని చాటుతున్నాడు కవి. నా దృష్టిలో, డ్యానీ నిశ్శబ్దంలో సింహావలోకనం చేసుకునే పరిపక్వమానసికస్థితిని చాలా బాగా ఆవిష్కరించేరు.