అనువాదలహరి

కలలు … జిస్వావా షింబోర్స్కా , పోలిష్ కవయిత్రి

ఏ భూగర్భశాస్త్రవిజ్ఞానమూ, నైపుణ్యమూ లేకున్నా
అయస్కాంతాల్నీ, రేఖా చిత్రాల్నీ,
ప్రపంచ పటాల్నీ త్రోసిరాజంటూ
బాహ్యప్రపంచంలో కనిపించేటంత కఠినమైన
మహాపర్వతాలని లిప్తపాటులో,
మనముందు కుప్పపోస్తుంది కల.

ఆక్కడినుండీ … ముందుగా కొండలూ,
తర్వాత లోయలూ, మైదానాలూ
వాటికి ఉండేహంగులన్నిటితోసహా కల్పిస్తుంది…
ఇంజనీర్లుగాని, కంట్రాక్టర్లుగాని, పనివాళ్లుగాని
బుల్డోజర్లు గాని, తవ్వేవాళ్లుగాని, ఏ వస్తు సరఫరాలూ లేకుండానే
సువిశాలమైన రాజమార్గాలు, తక్షణ వారధులు,
జనాలతో కిటకిటలాడే మహానగరాలు ప్రత్యక్షమౌతాయి

ఏ దర్శకుడూ చెప్పకుండానే,
మెగాఫోనులూ, ఛాయాగ్రాహకులూ లేకుండానే
ప్రజలందరికీ ఎలా తెలుస్తుందోగాని …తెలుస్తుంది
మనల్ని సరిగ్గా ఎప్పుడు భయపెట్టాలో
వాళ్లందరూ ఎప్పుడుమాయమైపోవాలో!

వృత్తి నిపుణులైన ఏ వాస్తుశిల్పుల అవసరమూ లేదు…
వండ్రంగులుగాని, గోడకట్టేవాళ్ళుగానిగాని,
కాంక్రీటుపోసేవాళ్ళుగాని లేకుండానే,
బొమ్మలాంటి ఒక ఇల్లు  దారిలో హఠాత్తుగా లేస్తుంది
గాలిలోంచే ఊడిపడతాయి ఆ భవనం గోడలు,
విశాలమైన అక్కడి చావడులలో
మన అడుగులని ప్రతిధ్వనిస్తుంటాయి…

వాటి కొలతలూ ప్రమాణాలేకాదు
వాటి కచ్చితత్వమూ ఆశ్చర్యం గొలుపుతుంది:
ఫలానా గడియారం, ఓ ఈగ,
పెనవేసుకున్న పువ్వులల్లి ఉన్న టేబిలుమీద పరిచిన వస్త్రమూ
పళ్లగాట్లు స్పష్టంగా కనిపిస్తూ కొరికివదిలేసిన ఆపిలుపండూ.

సర్కసులో విన్యాసాలు చేసే వాళ్ళూ,
మాంత్రికులూ, ఐంద్రజాలికులూ
కనికట్టు తెలిసినవాళ్ళలా కాకుండా
మనకి రెక్కలులేకపోయినా ఎగిరిపోగలం
కళ్లతో చీకటిజీబూతాల్లాంటి సొరంగాల్ని వెలిగించగలం
మనకు తెలియని భాషల్లో గడగడా మాటాడగలం
వీళ్ళూ వాళ్ళూ అనిలేదు,
చచ్చిపోయిన వాళ్లతోకూడా మాటాడగలం.

కొసమెరుపుగా, మనకి ఎంత స్వేచ్ఛా, ఎన్ని ఇష్టాలూ,
అభిరుచులూ ఉన్నా,
అవన్నీ కొన్ని మోహావేశాల్లో కొట్టుకుపోతుంటాయి…
ఇంతలో గంటగణగణ మోగుతుంది….

మరయితే కలల గురించి రాసేవాళ్ళూ,
కలలని విశ్లేషించి, భవిష్యత్తు చెప్పేవాళ్ళూ
దర్జగా కూర్చుని కలలమీద పరిశోధనచేసేవాళ్ళూ
ఏమిటిచెబుతారు?
ఏదైనా పొరపాటున నిజమైనా, అది కేవలం యాదృఛ్చికం.
ఎందుకంటే, దానికి కారణం ఒకటే…
మనం కలలు గనడంలో
కలల ఛాయల్లో, వాటి మసక వెలుగుల్లో
వాటి సమూహాల్లో, వాటి నమ్మలేనిదనంలో
వాటి కాకతాళీయతలో, వాటి  చెల్లాచెదరులో
ఒక్కోసారి నిజమైన అర్థం కూడా
జారిపోవచ్చు.

.

జిస్వావా షింబోర్స్కా , పోలిష్ కవయిత్రి

2012, Feb  1 వ తేదీన నిద్రలోనే ప్రశాంతంగా కన్నుమూసిన షింబోర్స్కా,  పోలండుకు చెందిన కవయిత్రీ, అనువాదకురాలూ, వ్యాసకర్తా. ఈమెకు 1996 లో సాహిత్యం లో నోబెలు పురస్కారంలభించింది. ఆమె కవిత్వం లో ప్రధాన విషయం యుధ్ధం, ఉగ్రవాదం (తీవ్రవాదం).  దానికి కారణం ఆమెను వెన్నాడిన రెండవ ప్రపంచ సంగ్రామపు భయంకర నీడలే. 16 ఏళ్ల వయసులో ఆమె చదువు చిత్రమైన పరిస్థితుల్లో రహస్య స్థలాల్లో, నిబధ్ధతగల విద్యా వాలంటీర్ల సహకరం వల్ల జరిగింది. వక్రోక్తి (Irony) ఆమె ప్రత్యేకత. ఆమె ఫ్రెంచి సాహిత్యాన్ని పోలిష్ లోకి అనువదించింది.

ఈ కవితలో మనసు కలల్లో ఎంత చిత్రంగా ప్రకృతిలో కనిపించే వస్తువులని యధాతథంగా కల్పించటంతోపాటు ఊహలకి ఎలా రెక్కలు తొడుగుతుందో చెబుతూనే, కలలనుండి భవిష్యత్తు చెప్పడం, లేదా చెప్పబూనడం ఎంత హాస్యాస్పదమో చెబుతోంది.  ఏ సమాధానమూ తెలియకపోయినా  Multiple choice questionsకి, అన్నీ ఏ గాని, బి గాని, సి గాని డి గాని టిక్కులుపెడితే ఏ కొన్నైనా కరెక్టు అయినట్టు, కొన్ని భవిష్యవాణులు కూడ అలాగే యాదృఛ్చికంగా నిజం అవుతాయితప్ప, ఆ చెప్పడం నిజం తెలిసి చెప్పడం కాదు అని ఆమె ప్రతిపాదన.

English: Wisława Szymborska
English: Wisława Szymborska (Photo credit: Wikipedia)

Dreams

Despite the geologists’ knowledge and craft,
mocking magnets, graphs, and maps—
in a split second the dream
piles before us mountains as stony
as real life.

And since mountains, then valleys, plains
with perfect infrastructures.
Without engineers, contractors, workers,
bulldozers, diggers, or supplies—
raging highways, instant bridges,
thickly populated pop-up cities.

Without directors, megaphones, and cameramen—
crowds knowing exactly when to frighten us
and when to vanish.

Without architects deft in their craft,
without carpenters, bricklayers, concrete pourers—
on the path a sudden house just like a toy,
and in it vast halls that echo with our steps
and walls constructed out of solid air.

Not just the scale, it’s also the precision—
a specific watch, an entire fly,
on the table a cloth with cross-stitched flowers,
a bitten apple with teeth marks.

And we—unlike circus acrobats,
conjurers, wizards, and hypnotists—
can fly unfledged,
we light dark tunnels with our eyes,
we wax eloquent in unknown tongues,
talking not with just anyone, but with the dead.

And as a bonus, despite our own freedom,
the choices of our heart, our tastes,
we’re swept away
by amorous yearnings for—
and the alarm clock rings.

So what can they tell us, the writers of dream books,
the scholars of oneiric signs and omens,
the doctors with couches for analyses—
if anything fits,
it’s accidental,
and for one reason only,
that in our dreamings,
in their shadowings and gleamings,
in their multiplings, inconceivablings,
in their haphazardings and widescatterings
at times even a clear-cut meaning
may slip through.

Wislawa Szymborska .

(2 July 1923 – 1 February 2012)

Polish Poet Essayist, Translator and Nobel Laureate in Literature for 1996.

Szymborska has a sobriquet “Mozart of Poetry”.  she published in March 1945  her first poem “Looking for words” in the daily newspaper, Dziennik Polski. She quit her studies without a degree in 1948 due to her poor financial circumstances. That is what we are living for… is her first collection of poetry.  Her early work supported socialist themes and  for sometime she was member of the ruling Polish United Workers’ Party. Like many communist intellectuals she gradually estranged from party and in 1964 she even opposed the Communist-backed protest and she demanded freedom of speech.

She also translated French Literature into Polish, particularly, Baroque poetry and the works of Agrippa. She died peacefully in her sleep on 1st February this year.

%d bloggers like this: