అనువాదలహరి

మోచాత్ విళంబిత నృత్యగీతం … Sara Teasdale, American Poet

మసకవెలుతురు పడుగులా పరుచుకున్న గదిలో

వాయులీనపు స్వరాలు పేక నేస్తున్నాయి

గాలిలో అల్లుకుంటూ, పెనవేసుకుంటూ,

చిమ్మచీకటిలో పసిడి మెరుగులు చిమ్ముతున్నై

సంగీతం వెలుగుగా మారడం నేను గమనించాను.

కానీ, ఒకసారి కమాను ఆగగానే

ఆ కలనేత చెదిరిపోయి ఆ మెరుపు

ముంచెత్తుతున్న రాత్రి కెరటంలో మునకేసింది.

.

సారా టీజ్డేల్

(August 8, 1884 – January 29, 1933)

ఆధునిక అమెరికను సాహిత్యం లో సారా టీజ్డేల్ ది ఒక ప్రత్యేక స్థానం. పదాల వాడుకలో అపురూపమైన నైపుణ్యం తో పాటు, వాటి మధ్య సంగీత రహస్యాన్ని తెలిసి ప్రయోగించగల దిట్ట సారా టీజ్డేల్. తన 23వ ఏట మొదటి కవిత ప్రచురణతో ప్రారంభమైన ఆమె కవితా ప్రస్థానం సుమారు 20 సంవత్సరాలు కొనసాగింది. 4 కవిత్వ సంపుటాలు వెలయించి (అందులో ఒకటి అనేక పునర్ముద్రణలుకూడ నోచుకుంది),  1918లో పులిట్జరు ప్రైజుతోపాటు కొలంబియా యూనివర్శిటీ పోయెట్రీ సొసైటీ ప్రైజూ, పోయెట్రీ సొసైటీ ఆఫ్ అమెరికా ప్రైజుకూడ గెలుచుకుంది.

ప్రేమ, నిరాదరణ, మృత్యువూ ఆమె కవిత్వం లో పదే పదే కనిపిస్తాయి.

ఈ కవిత మోచాత్ వాయులీన ప్రావీణ్యాన్ని ప్రశంసిస్తూ వ్రాసినది. నెమ్మదిగ సాగే ఈ విళంబిత నృత్యగీతం 17, 18 వ శతాబ్దాల్లో యూరొపులో బహుళప్రచారం లో ఉండేది.

English: Filsinger, Sara Teasdale, Mrs., portr...
English: Sara Teasdale, portrait photograph. (Photo credit: Wikipedia)

.

A Minuet of Mozart’s

Across the dimly lighted room
The violin drew wefts of sound,
Airily they wove and wound
And glimmered gold against the gloom.

I watched the music turn to light,
But at the pausing of the bow,
The web was broken and the glow
Was drowned within the wave of night.

— Sara Teasdale

American Lyrical Poet

(August 8, 1884 – January 29, 1933)

Teasdale’s first poem was published in Reedy’s Mirror when she was just 23.  Sonnets to Duse and other Poems (1907) was her first collection of poems and it was also published the same year. By 1911 she mastered lyrical poetry and her second collection of poems Helen of Troy and Other Poems (1911) was well received. Her best seller, however, was her third collection of poems Rivers to the Sea (1915) which went into several reprints. Her fourth collection of poems  Love Songs (1917) won the prestigious Pulitzer Prize in 1918 as also the Colombia University Poetry Society Prize and the annual prize of Poetry Society of America. She committed suicide in 1933.

Love, abandonment, bitterness and contemplation of death were her recurring themes. “I shall not care” is still a popular poem of hers and has a legend surrounding it.

The present poem, however, was written in appreciation of Mozart’s skill at playing violin. A Minuet is a piece of music  for a slow stately dance in triple meter, which was very popular during 17th and 18th centuries.

%d bloggers like this: