అనువాదలహరి

కుర్చీ వెనక నుండి … మార్గరెట్ మాహీ, న్యూజిలాండ్ కవయిత్రి

.

మా కారు చాలా నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది, నెమ్మదిగా పోతుంది

మాకు కొత్త కారు కొనుక్కునే తాహతు లేదు.

దానికితోడు  నాన్న దాని తాళాలు పారేసుకున్నారు.

కారు లేకపోతే పని లేదు.

పనిలేకపోతే జీతం రాదు.

రోజు రోజుకీ మా పరిస్థితి దయనీయంగా మారుతోంది.

నాన్నకి జుత్తు తెల్లబడిపోతోందంటే ఆశ్చర్యం లేదు.

ఈ ఉదయం  మరీ నిరాశాజనకంగా ఉంది

.

జేబులో  బాకీల  చిఠ్ఠాతప్ప చేతిలో చిల్లిగవ్వలేదు.

కోపమూ నిస్పృహతో నాన్న చాలా చిత్రంగా ప్రవర్తిస్తున్నారు!

ఇప్పటికే బట్టతలైపోయినా, ఇంకా జుట్టుపీక్కుంటున్నారు.

రెండేళ్లైనా నిండని మేరీ అంది గదా

నేను చేసే పనే డాడీ చేస్తే ఎంత బాగుంటుంది!

నేను కూడ చాలా వస్తువులు పోగొట్టుకుంటుంటాను.

కానీ, కొన్ని ఆ కుర్చీ వెనకాతల దొరుకుతుంటాయి

.

ఏదో గుర్తొచ్చి, తన్ను తానే అభినందించుకుని షెల్ఫ్ లో వెతికేరు

ఇక్కడా అక్కడా వెతికేరు.

ఇప్పుడు మోకాళ్ళమీద పడుక్కుని

కుర్చీ క్రింద వెదకడం ప్రారంభించేరు.

అతని చెయ్యి క్రిందకి వెళ్లగానే ఏదో తగిలినట్టుంది

చిన్న చిరునవ్వు కనిపించింది

అతని శరీరానికి ఏదో పులకరింత వచ్చింది.

ఈ కుర్చీ వెనక, పాపం కష్టాల్లో ఉన్న

మా నాయన చేతికి ఏమిటి తగిలుంటుంది అబ్బా!

.

ఏదో ఒక సన్నని తీగ, వజ్రపు ఉంగరం

కుర్చీ వెనక దొరికేయి

అనాసపండు తొన, పదడుగుల సముద్రపు చేప

కుర్చీ వెనక దొరికేయి

ఒక సిగరెట్టూ, ఒక కప్పూ, ఒక నానిన రొట్టిముక్క, ఒక పాట

ఏడంగుళాల సాలీడు దొరికేయి.

కుర్చీ వెనక అంత కంపు కొడుతోందంటే

కొట్టదూ మరి!

.

ఓ పిన్నుల పేకెట్టూ, కలవల్లో ఒకరూ

దొరికారు కుర్చీ వెనక నుండి

ఒక కిళ్ళీ, మా అవ్వతాలూకు ఒక విసనికర్రా,

దొరికాయి కుర్చీ వెనకనుండి

ఒక ముక్క, ఒక దువ్వెనా, ఒక జోకరూ, ఒక టోపీ

గుప్తనిధి ఆచూకీగల పటంతో ఒక సముద్రపు దొంగా,

నిద్రపోడానికి ప్రయత్నిస్తున్న ఒక రెక్కల సర్పమూ

దొరికాయి కుర్చీ వెనకనుండి

.

ఒక కేకుముక్క, ఒక మగబాతూ, ఒక నవ్వుతున్న పామూ,

కుర్చీ వెనక దొరికేయి

ఒకముత్యాల దండా, ఉంగరాల జూలున్న సింహమూ

కుర్చీ వెనక దొరికేయి

ఒక ఊసరవెల్లీ, ఒక ఉడుమూ, చక్రాల జోడూ, జారుడు చెక్కా

టీ తాగుతున్న రెండు ఏనుగులూ

ఒక భీకరమైన పక్షీ, ఒక తుమ్మెదా

కుర్చీ వెనక దొరికేయి

.

కానీ, ఇదేమిటిది? వావ్! అదృష్టమే అదృష్టం!

(కుర్చీ వెనుకభాగం పుణ్యమా అని)

ఎప్పుడో పోగొట్టుకున్న అంకుల్ బిల్ వీలునామా!

(కుర్చీ వెనుకభాగం పుణ్యమా అని)

అతని డబ్బుల డబ్బీ నోట్లు కుక్కి

ఎర్రని దట్టీలో చుట్టిమరీ.

సంతోషం, సంపదా, ఆటబొమ్మలూ, పాతవస్తువులూ

అన్నీ కుర్చీ వెనుక దొరికేయి

.

“ఇన్నాళ్ళకి నా కలలు ఫలించాయి” నవ్వుతూ అన్నారు నాన్న.

(కుర్చీ వెనుకభాగం పుణ్యమా అని)

“జీవితమంటే ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది

(కుర్చీ వెనుకభాగం పుణ్యమా అని)

పిల్లలూ! కారుతాళాలసంగతి మరిచిపొండి.

ఇక మనం ఎంతమాత్రం బీదవాళ్ళం కాదు.

టాక్సీకి కబురుచెయ్యండి మన ఇంటికి రమ్మనమని.”

ఇంతలో ఒక టాక్సీ చప్పుడు చేసుకుంటూ

కుర్చీ వెనకనుండి బయటపడింది.

.

ఓ కుర్చీ! నా కుర్చీ! సవాళ్ళు విసిరే కుర్చీ!

నిరుపమానమైన కుర్చీ, సంతోషం నింపే కుర్చీ

మనసు దోచే కుర్చీ, పిల్లగాళ్ల కుర్చీ

పెచ్చులూడినా, పాడుచేసినా అందరూ ఎన్నుకునే కుర్చీ

కుర్చీ వెనుక ఇన్నాళ్ళూ మా భాగ్యం

మా కోసం ఎదురుచూస్తోందంటే ఆశ్చర్యం వేస్తుంది.

.

మార్గరెట్ మాహీ,

న్యూజిలాండ్ కవయిత్రి

(21 March 1936 – 23 July 2012)

న్యూజిలాండ్ కవయిత్రి మార్గరెట్ మాహీ బాలసాహిత్యానికి అనుపమానమైన సేవ చేశారు. ఆమె కవితల్లో ఇది బహుళ జనాదరణ పొందటమేగాక ఆమెకి మంచిపేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది.

Margaret Mahy: Christchurch children's librari...

.

Down the back of the chair

.

Our car is slow to start and go.

We can’t afford a new one.
Now if you please, Dad’s lost the keys.

We’re facing rack and ruin.
No car, no work! No work no pay!
We’re getting poorer day by day.
No wonder Dad is turning grey.
The morning is a blue one.

Nothing but dockets in his pockets.
Raging with despair
Dad acts appalled! Though nearly bald
He tries to tear his hair.
But Mary who is barely two
Said ‘Dad should do what I would do
I lose a lot, but I find a few
Down the back of the chair.’

He’s patted himself, and searched the shelf.

He’s hunted here and there,
So now he’ll kneel and try to feel

right down the back of the chair.
Oh it seemed to grin as his hand went in.
He felt a tingling in his skin.
What will a troubled father win
From down the back of the chair?

Some hairy string and a diamond ring
Were down the back of the chair,
Pineapple peel and a conger eel
Were down the back of the chair
A sip, a sup, a sop, a song.

A spider seven inches long,
No wonder that it smells so strong
Down the back of the chair.

A packet of pins and one of the twins
Down the back of the chair.
A pan, a fan that belonged to Gran
Down the back of the chair . . .
A crumb, a comb, a clown, a cap
A pirate with a treasure map,
A dragon trying to take a nap
Down the back of the chair.

A cake, a drake, a smiling snake,
Down the back of the chair
A string of pearls, a lion with curls
Down the back of the chair
A skink, a skunk, a skate, a ski,
A couple of elephants drinking tea
The bandersnatch and the bumblebee
Down the back of the chair.

But what is this? Oh bliss! Oh bliss!
(Down the back of the chair).
The long lost will of Uncle Bill
(Down the back of the chair).
His money box all crammed with cash
Tangled up in a scarlet sash
There’s pleasure, treasure, toys and trash
Down the back of the chair.

‘I’ve found my dreams,’ our father beams.
(Down the back of the chair).
‘At last I see how life can be.
(Down the back of the chair).
Forget the keys! We’re poor no more
Just call a taxi to the door.’
A taxi shot out with a roar
From down the back of the chair.

The chair, the chair, the challenging chair,
The champion chair, the cheerful chair,
The charming chair, the children’s chair,
The chopped and chipped but chosen chair
To think our fortune waited there
Down the back of the chair.

.

Margaret Mahy

(21 March 1936 – 23 July 2012)

(Poem Courtesy: http://christchurchcitylibraries.com/MargaretMahy/DownTheBackOfTheChair/)

Chair

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: