పారూ శకునాలు… బిందు కృష్ణన్, మలయాళ కవయిత్రి
గంజి వారుస్తూంటే,
పట్టుతప్పి, గంజి వొలికి చెయ్యి కాలింది.
“అంటే అదృష్టం తప్పుకుందన్నమాట” విచారించింది అమ్మ.
చేతిలోని అద్దం లో
నా ప్రతిబింబాన్ని ఛూసుకుని మురుస్తుంటే
చేతిలోంచి అద్దం జారి తునాతునకలయిపోయింది…
“ఓహో! రాబోయేది గడ్డుకాలం” వాపోయింది అమ్మ.
అతనికి వడ్దిస్తుంటే,
ఉప్పు వొలికిపొయింది
“దెబ్బలాటలు తప్పవు” అని బాధపడింది అమ్మ.
తప్పతాగి, కోపంతో బండబూతులు తిడుతూ
నన్నూ, నా కూతుర్నీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు
“అబ్బ! ఎంత అదృష్టమో!” అని సంబరపడ్డాను నేను.
.
మలయాళ మూలం: బిందు కృష్ణన్
ఆంగ్ల అనువాదం: గిరిజా చంద్రన్
.

Bindu Krishnan
Poem & Image Courtesy: Poetrans.wordpress.com
.
Paru’s Premonitions
Draining the boiled rice, the pot slipped,
hot gruel scalding my hand…
“luck has gone” – lamented mother.
Admiring my reflection, the mirror in hand
slipped, broke to smithereens…
“hard times ahead” – lamented mother.
As he was being served, the salt
spilled out…
“quarrel assured” – lamented mother .
Pissed drunk, mumbling profanities,
He left, leaving me and my daughter…
“Great luck” – I rejoiced.
Malayalam Original: Bindu Krishnan
Translation: Girija Chandran
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
ఇలాంటివే