అనువాదలహరి

మహా నగం …Jayant Mahapatra,Indo-Anglian Poet

మహానగం
దాని తనుభారమంతటితో
నేలకు బందీ అయి నిలుచున్నది
అగాధ మనః తీరాలలో
ఈ సాంధ్య చీకటివేళ
నిశ్శబ్దాన్నీ, ఒత్తిడినీ
అధికంచేస్తూ, తగ్గిస్తూ, పెంచుతూ.

ప్రతి రోజూ
పెద్ద అంగలేసుకుని నడిచే సూర్యరశ్మిక్రింద
తునాతునకలైన నీడతో
అది ఎవరైనా తమజీవితాన్ని
పునర్నిర్మించుకుందికి అవకాశముందనడానికి
ఉదాహరణగా నిలుస్తోంది.

ధృఢంగా ఉన్నప్పటికీ
నిర్వీర్యమై పోయి
బహుశా, ప్రపంచం మాట్లాడాలని నిరీక్షిస్తోందేమో
ఆగిన కాలం మళ్ళీ కదలాలనీ
ద్వేషం శిధిలాలనుండి కొత్త సమాజం ఆవిర్భవించాలనీ.

రోజల్లా
ఎంతకీ తరగని ఆ కొండ ఎగుడు ఎక్కుతూనే ఉంటాము,
ఇంకా ఎక్కడానికి కావలసిన కాలం మాలోని విభేదాలన్నీ చెరిపి
శిఖరం మీద తిరుగులేకుండా తిష్ఠవేసుకుని కూర్చుంటుంది.

ఈ జీవిత చరమ సంధ్యలో
ఒక సంకటస్థితి ప్రపంచాన్ని మాటాడనీదు
ఈ దిగువన కనిపిస్తున్న విశాలమైన లోయ
ఈ మహాపర్వతపు బరువును కొంతైనా తగ్గించగలదా?

ఇక్కడ
మాలో మాకే భయమేస్తున్న చోట
భూమి పలచబడి లేమితో దుఃఖిస్తున్న చోట
మాకు పట్టిన దయ్యాలను వదలగొట్టే క్రమంలో
మా హక్కుల మాగాణాలను సుడిగాలి నాశనం చేసి
మా అంతరాత్మలని ఒక కుదుపు కుదిపింది.

.

జయంత్ మహాపాత్రా

జీవితాన్ని ఒక కొండ ఎక్కడంతో పోలుస్తున్నాడు కవి. జీవిత చరమాంకం లో మిగిలిన జీవితమే  ఇంకా ఎక్కడానికి మిగిలి ఉన్న కొండ, దిగువకనిపిస్తున్న లోయలే గతం.  గతం భవిష్యత్తుని ఏమాత్రమైనా సుఖమయం చెయ్యగలదా అని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ మాగాణాలు మధురమైన స్మృతులు. ధ్వంశం చేసిన సుడిగాలి మృత్యుభయం.

Image Courtesy: http://www.jayantamahapatra.com/images/biobanner.jpg

.

The Mountain

.

Shackled to the earth it stands, all its dead weight

In the darkness of evening

silence and pressure only,

multiplying, adding, subtracting,

In the abyssal heart.

Each day,

falling to pieces under the straddling sunlight,

it gives clear proof that one

might still reconstruct one’s life. Rigid,

yet strangely impotent,

perhaps it eagerly waits for the world to speak,

for the mute clock to strike again,

for a new kind of society to form from the ruins of hate.

And all day

we climb those slopes which do not ease at all,

where unfinished time blots out the differences

among us, as it sets itself irremediably on the peak.

Late in the evening of life

an embarrassment prevents the world from speaking.

Can the wide valley here down below

lessen the mountain’s weight? Here,

where we are afraid within ourselves,

and the earth is thin and sad with insufficiency;

the wind razes the fields of our rights

and the great bulk of conscience stirs,

moving in its process of exorcism.

.

JAYANTA MAHAPATRA

Indo-Anglian Poet

(b. 1928)

Jayanta Mahapatra was born in 1928 in Cuttack. He teaches Physics at Ravenshaw College. His poems have appeared in several Indian and foreign journals. Svayamvara and Other Poems appeared in 1971. His other earlier publications were Close the Sky (1971) and Countermeasures (1973). In 1975 Mahapatra was awarded the Jacob Glatstein Memorial Prize instituted by the Modern Poetry Association, Chicago. In 1976 he toured the USA as a visiting writer. Since 1976 Mahapatra has brought out five collections of poems A Rain of Nights (1976), Waiting (1979), The False Start (1980), Relationship (1980) and Life Signs (1983). He won the Sahitya Akademi Award in 1981.

 Mahapatra is deeply steeped in Indian tradition. He is a poet with great fidelity to his native environment and region. His poems reveal a mythic consciousness of the Orissa landscape and the ancient culture of that region combined with a deeply reflective vision of life. There is an abundance of local details in his poetry. He is a significant ‘private lyric voice’ meditating over the way of life and experiences of a region, yet reflecting the ramifications of the national culture. Mahapatra’s sensibility seeks out images from the world of decay and pain and subtle ironies impart a certain permanence to his vision. His experiments in Indian English poetry have helped evolve a language eminently evocative and truly adapted to the Indian ethos.

 Mahapatra says that his attempt has been to “return to my roots so that they reveal who I am”.

Poem and Biographical text Courtesy:  “Gathered Grace” Indian writing in English, Project Gutenberg

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: