ప్రేమికులు… వీరన్ కుట్టీ, Malayali Poet
రెండు చేపలు
వంతెన దాటుతున్న రైలు
ప్రతిబింబం నీటిలో చూస్తూ
పెట్టెలోకి ఎక్కిపోయాయి
.
పాపం! వాటికి తెలీదు
ఒక సారి రైలు నది దాటి
నేలమీద అడుగుపెట్టిన తర్వాత
అవి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి
అవుతాయని!
.
వీరన్ కుట్టీ
Infatuation (మోహాన్ని) నీటిలోని ప్రతిబింబంతో, అదికూడ వంతెనమీద నుండి పరిగెత్తుతున్న క్షణికమైన రైలు నీడతో, పోలుస్తూ ఎంత భావుకతతో కూడిన కవిత చెప్పాడో గమనించండి. వయసులో ఉన్న యువతీ యువకులకి పరస్పరం కలిగే ఆకర్షణని ప్రేమగా ఎలా భ్రమిస్తారో సమకాలీనమైన ప్రతీకలు తీసుకుని సున్నితంగా చెప్పవచ్చుననడానికి ఇది చక్కని ఉదాహరణ.

.