అనువాదలహరి

ప్రేమికుడా!… సర్ జాన్ సక్లింగ్, (1609 – 1642)

.

ఓ పిచ్చి ప్రేమికుడా, ఎందుకంత కళ తప్పి, నీరసంగా ఉన్నావు?
చెప్పుమీ, ఎందుకు అంత కళతప్పి ఉన్నావో?
నువ్వు కళకళలాడినపుడే ఆమె నిను మెచ్చనపుడు
కళతప్పి ఉంటే మెచ్చుతుందా?
చెప్పుమీ ఎందుకంత కళతప్పి ఉన్నావో?

.

ఓ వెర్రి వాడా ఎందుకంత మౌనంగా, అచేతనంగా ఉన్నావు?
చెప్పుమీ, ఎందుకంత మౌనమో?
అరే, అంత చక్కగా మాటాడినపుడే ఆమెని నువ్వు గెలవలేకపోతే
మౌనంతో గెలవగలవా?
చెప్పుమీ ఈ మౌనమెందుకో?

.

ఛ!ఛ! సిగ్గుచేటు. ఇలా ఆమెని మెప్పించలేవు.
ఇవేవీ ఆమెను గెలవలేవు.
ఆమె తనంత తానుగా నిన్ను ప్రేమించాలితప్ప
ఏదీ ఆమె నిను ప్రేమించేలా చెయ్యలేదు.
ఆమెని మరచి, నీ సంగతి నువ్వు చూసుకో!

.

సర్ జాన్ సక్లింగ్

(10 February 1609 – 1 June 1642)

Sir John Suckling, by Sir Anthony Van Dyck (di...
Sir John Suckling, by Sir Anthony Van Dyck (died 1641).  (Photo credit: Wikipedia)

.

Why so pale and wan, fond lover?

.

Why so pale and wan, fond lover?

Prithee, why so pale?

Will, when looking well can’t move her.

Looking ill will prevail?

Prithee, why so pale?

.

Why so dull and mute, young sinner?

Prithee, why so mute?

Will , when speaking well can’t win her,

Saying nothing do ‘t?

Prithee, why so mute?

.

Quit, quit, for shame! This will not move;

This cannot take her.

If of herself she will not love,

Nothing can make her;

The devil take her!

.

John Suckling.

(10 February 1609 – 1 June 1642)

English Poet and Noble.

For Further reading: http://en.wikipedia.org/wiki/John_Suckling_(poet)

%d bloggers like this: