అవతారం… శ్రీజిత్ అరియల్లూర్, Malayali Poet

.

పడావు భూముల్లో
ఆడుకుందికి ఒక్కడూ వెళ్ళిన కుర్రాడు
రక్షణలేని నేలనూతిలోపడి
ములిగిపోయాడు.

ఊరల్లా
ఆ కుర్రాడిగురించి వెది వెదికి
కాళ్లు పుళ్లయిపోయి తిరిగొచ్చింది గాని
ఏమీ లాభం లేకపోయింది.
అహ్! వాడే వస్తాడులే ఏదో ఒక రోజు
ఏ పెద్దూర్లోనో బాగా డబ్బుగడించి
మారుతీ కారులో,
అని ఆశించారంతా.

తర్వాత వర్షాలొచ్చినప్పుడు
ఇళ్ళూ వాకిళ్ళూ, నూతులూ
కుప్పలుతెప్పలుగా నిండిపోయి
వరదైపోయినపుడు
ఆ కుర్రాడు తిరిగొచ్చేడు ఇంటికి
మరు జన్మలో… చేపపిల్లగా.
అయితే అతన్ని ఎవరూ గుర్తుపట్టలా.

వాళ్లమ్మానాన్నా
వాళ్ళ కన్నీళ్ళలాగే
స్వఛ్ఛమైన వాననీటిలో
వాడికి తలతుడిచే తువ్వాలుతోనే
వాడిని పట్టుకున్నారు
వాడి తమ్ముడు ఆడుకుందికి.

అరోజునుండీ గాజుకుప్పెఆక్వేరియంలో
వాళ్ళ తమ్ముడికి
ముద్దులివ్వడానికి ప్రతిరోజూ
ఆ చేపపిల్ల ఎంతో ప్రయత్నిస్తూనే ఉంది.

అయితే ఏం లాభం! వాళ్ళిద్దరివీ ఇప్పుడు
రెండులోకాలవడం వల్ల గాబోలు
పాపం! ఆ పాకిరే కుర్రాడు
వాళ్ళన్నని గుర్తుపట్టలేకున్నాడు.
.

(మలయాళ  మూలం: శ్రీజిత్ అరియల్లూర్; English translation: Sri Babu Ramachandran)

Sreejit Ariyallur
Image Courtesy: https://www.facebook.com/sreejith.ariyallur

Avatharam – Sreejith Ariyallur, Malayalam Poetry.

by Babu Ramachandran

The boy

.

Who went out alone

To play in the barren lands,

drowned in an unguarded

Bore well..

The whole village

set out  in search of

The boy, only to

return with sore feet,

And hopes that he would

make a fortune in some city

and return to the village one day.

In a Maruti Car..

Later, during the rains

When the wells, the fields

and the compounds were flooded,

The boy returned home

in the rebirth,  as a fish..

But none could identify him..

From the rainwater

as clear as tears,

Amma and Appa

Caught the fish

For his younger brother,

with the same towel

they used to dry his hair with.

And,  then onwards

From the glass bowl

The fish kept on offering

Kisses to his little brother..

But, may be because

They belonged to

different worlds by now

The toddler never recognized

His elder brother.

“అవతారం… శ్రీజిత్ అరియల్లూర్, Malayali Poet” కి 4 స్పందనలు

  1. పూర్తిగా మన తెలుగు కవులకు కొత్తదయిన భావం ఇది.బాగుంది ముర్తి గారూ!

    మెచ్చుకోండి

    1. GVS నాగేశ్వర రావు గారూ,

      నా బ్లాగుకి స్వాగతం. మీరు చెప్పినది నిజం కావొచ్చు. కొత్తతరం రచయితల్లో ఈ రకమైన సబ్జెక్ట్ నేను చదివినట్టు గుర్తులేదు.
      అభివాదములతో

      మెచ్చుకోండి

  2. ఒక దయనీయమైన పరిస్థితిని, విభిన్నపద్దతిలో ఇలా చెప్పడం, కవి గొప్పతనాన్ని తెలియచేస్తుంది. thank you sir.

    మెచ్చుకోండి

  3. భాస్కర్ గారూ,

    నాకు ఇది చదివినతర్వాత, చిన్నప్పుడెప్పుడొ చదివిన తెనాలి రామలింగడు- తాతాచార్యుల కథ గుర్తుకొచ్చ్చింది. ఇవన్నీ కల్పనలేననుకొండి. నిజానికి మన అభిప్రాయాన్ని చాటుకుందికి ఒక కథను సృష్టించడం మనం చాలా సార్లు చూస్తుంటాం. ఇది కాకపోతే కొంచెం వ్యగ్యంగా మరోజన్మలేదని చెప్పడానికైనా కావచ్చు,(ఇది చెప్పాలంటే కవి గురించి అతని ఆలోచనా సరళి గురించీ మనకు కొంత విషయం తెలిసి ఉండాలి), లేదా మీరు చెప్పిన అసహాయస్థితి కానూవొచ్చు.
    అభివాదములతో

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: