అనువాదలహరి

‘Mother’ is not Singular… Anisetti Rajita

It’s the mother earth, overflowing with oceans,
that has breathed the idea of love at epochal time,
and still, replicates life in every inch of this creation.
She is an eternal spring that embraces all waters.

Mother is a ceaseless source of monumental love
And she is the beauty incarnate…
And, the survival of humanity solely rests on her.

If one can still breathe and life beats, it is thanks to
her varietal roles and intellectual essence.
It is because of this wonderful Mother
Sun rises or sinks each day.

If the wheel of seasons rolls down
or, limits of time are expanding;

If the deciduous trees dress themselves up
with delicate shoots flaunting daintiness of Spring;

If the cuckoos continue to coo
and we could witness full- and new-moons

it’s only courtesy omnipresence of Mother.

A Mother is not a mother to only one, or to only few;
A Mother is not just a lone and singular being,
Mother means many,  Mother is plural.

She is the primal natural force,
that set this universe into motion
She is a manifestation of humanity itself.

Mother is not singular, but plural
She is a veritable definition of plurality.

.

(This poem is taken from her collection of poetry “Usuru”)

Anisetti Rajita

Anisetti Rajita started writing poetry from school days. Discrimination of women, exploitation of the Dalit and downtrodden, Globalization and Urbanization are some of  her recurring themes.  Besides possessing wonderful command over language and idiom, she has great flair for drawing images from the very ambience she creates for her poem.  She has to her credit 5 collections of her poetry so far.

.

అమ్మ బహువచనం

.

ఆదినుండీ ప్రేమ భావనకు ఊపిరి పోసిన అమ్మ
సృష్టికి అణువణువునా ప్రతిసృష్టిచేసిన అమ్మ
అనేక సముద్రాలు పొంగే భూమండలం.
నదులనెన్నో పొదువుకున్న ఝరాఝరి
అనురాగపు అంతులేని సంపదా ఆమే
సౌందర్యపు అస్తిత్వం ఆమే
మనుష్యజాతికి మనుగడున్నది ఆమెవల్లనే
ఇంకా ప్రాణవాయువున్నదంటే
జీవ చేతనమున్నదంటే
ఆమె శ్రమరూపాలూ, మేధోసారం వల్లనే
తెల్లవారుతున్నదీ పొద్దుగూకుతున్నదీ
అద్భుతమైన అమ్మవల్లనే
రుతుచక్రం తిరిగి తిరిగి
కాలసీమలు కదులుతున్నాయంటే
ఆకులు రాల్చేచెట్లు చివుళ్లు తొడుక్కుని
వసంతశోభతో ముస్తాబవుతున్నాయంటే
కోకిలలు క్రమం తప్పకుండా ఇంకా
కుహుకుహులు వినిపిస్తున్నాయంటే
పౌర్ణమినీ అమావాశ్యనూ చూస్తున్నామంటే
అమ్మ ఉన్నందునే
అమ్మ ఒక్కరికో కొందరికో తల్లి కాదు.
అమ్మ ఒకే ఒక వ్యక్తీ కాదు.
అమ్మ ఏకవచనం కాదు
ప్రకృతి మూలశక్తి
జగఛ్ఛోదక శక్తి
మానవత్వపు అభివ్యక్తి అమ్మ
అమ్మ బహువచనం
బహువచనానికి నిండు నిర్వచనం.

31.3.99

ఆనిశెట్టి రజిత

బడిచదువులనాటినుండీ  కవిత్వం వ్రాస్తున్న రజిత కవితా వస్తువులు స్త్రీ వివక్ష, అన్యాయాలు, పీడితులూ, దళితులమీద జరిగే అత్యాచారాలు,  తెలంగాణామీద ఆధిపత్యాలు, ప్రపంచీకరణ, నగరీకరణ మొదలైనవి. ఆమె “గులాబీలు జ్వలిస్తున్నాయి” (1984), “నేనొక నల్లమబ్బునౌతా” (1997), “చెమట చెట్టు” (1998), “ఓ లచ్చవ్వ” (2000), “అనగనగా ఒక  కాలం”  (2005) కవితా సంపుటాలు వెలయించారు. భాష మీద నుడికారం మీద పట్టు కలిగి ఉండడమేగాక, వస్తువుని కవిత్వీకరించడంలో తన మేధను గాక, అనుభవాన్నీ, స్పందననీ ఈమె ఉపయోగిస్తారు. ఉపమానాలు చాలా సరళంగా సహజంగా ఉంటాయి.

%d bloggers like this: