అనువాదలహరి

జీవన శాఖి … తోరు దత్, భారతీయ కవయిత్రి.

పట్ట పగలే. కానీ, ఏదో తెలియని అలసట!
నా కళ్ళు మూసుకునే ఉన్నాను గాని నిద్రపోలేదు,
నా చెయ్యి మా నాన్నగారి చేతిలో ఉంది, నాకు
అతను నా దగ్గరే కూర్చున్నట్టు తెలుస్తోంది.
అలా గంటలకి గంటలు మేమిద్దరం మౌనంగా
ఎన్నిసార్లు గడిపామో లెక్కలేదు.
ఒకరి మనసులో కలిగిన భావాలు రెండో వాళ్ళకి తెలుస్తూ,
ప్రతి గుండెచప్పుడూ కాలాన్ని కొలుస్తున్నప్పుడు
అసలు మాటాడవలసిన పనేముంది?

నేను మేలుకునే ఉన్నాను: ఎదురుగా విశాలమైన మైదానం
అబ్బ! కనుచూపుమేర అనంతంగా ఎటుచూస్తే అటు సాగుతూ.
దాని నిండా పరుచుకుని ఒక వింత వెలుగు, అద్భుతమైన కాంతి,
మబ్బులులేని, మంచుకురుస్తున్న శీతకాలపు నిర్మలరాత్రిలో
మంచుబిందువులపై నక్షత్రాలు విరజిమ్మే వెలుతురు లాంటిదది.
అంతకంటే సాంద్ర ప్రశాంత సుందరంగా ఉంది…
అది కల కదు, నేను కళ్ళు పూర్తిగా తెరిచే ఉన్నాను,
అలాంటి మైదానం మధ్యలో నేను చూసాను,
ఒక చెట్టుని… తన కొమ్మలు అన్ని దిక్కులా చాచుతూ
రకరకాల ఆకులతో; వెలిసిపోయిన వెండీ, మెరిసే బంగారు రంగుల్లో,
మాటల్లో చెప్పలేని తళతళలని ప్రతిబింబిస్తూ.

ఆ చెట్టు సమీపంలోనే ఒక దేవదూత నిలబడి ఉన్నాడు;
అతను కొన్ని చివురుకొమ్మలు త్రుంచి నా తలచుట్టూ అలంకరించాడు
ఓహ్! ఏంత రమ్యంగా ఉందో,  ఆ వింత ఆకుల స్పర్శ!
నా కనుబొమలలో నొప్పి మాయమైపోయింది. నా శరీరంలో
జ్వరం జాడే లేదు. “ఓహ్” అని ఆనందంతో కేరింతలు కొడుతూ,
“మా నాన్నగారి తలకి కూడా ఇలా ఆకులు చుట్టవూ” అని అడిగాను.
దేవదూత ఒక ఆకుని తీసుకుని దానితో
తనతలని తాకి “అప్పుడే కాదు” అని పలికేడు మంద్రంగా.
ఎన్నడూ, మునుపెన్నడూ అలాటి ముఖం చూడలేదు,
ఆ దేవదూత ముఖంకంటే అందమైనదీ
కరుణార్ద్రమూ, దివ్యప్రేమామృతముతో నిండినదీ.

ఆశ్చర్యంతో కొన్ని క్షణాలు అలా ఉండిపోయాను.
కన్నీటితో మసకబారిన నా కళ్ళు ఒక్కసారి విప్పి చూద్దును
ఏమయ్యాయో వింతకాంతులు మరి కనిపించలేదు.
అలాగే, నేలమీద మంచు దట్టంగ కురిసినప్పటి
నక్షత్రాల పూర్వపు వెలుగు వెల్లువా లేదు.  ఆ దేవదూత ముఖం
మరి కనిపించమన్నా కనిపించ లేదు. ఒక్క నాన్నగారు
కనిపించారు, ప్రక్కమీద కూర్చుని నన్ను గమనిస్తూ
తన చేతిలోని నా చేతిని ఆత్మీయంగా ఒత్తిపట్టుకుంటూ…

.

తోరు దత్

(1856-1877)

భారతీయ కవయిత్రి.

తోరుదత్ అతి పిన్నవయసులోనే (21) మరణించినా, అద్భుతమైన ప్రతిభా పాటవాల్ని ప్రదర్శించిన కవయిత్రి. ఆమె చిన్నప్పుడు కలిసి ఆడిపాడిన తన తోబుట్టువుల మరణం ఆమెని బాగా కృంగదీసింది. ఆరోజుల్లో క్షయవ్యాధికి తగిన మందు దొరికేది కాదు. ఆమెకి క్షయ సొకిందని తెలిసి, మృత్యుముఖంలో తానున్నా తెలిసినపుడు వ్రాసిన కవిత ఇది. తన తండ్రి కంటే తనే ముందు చనిపోవడం విధిలిఖితమని చెబుతోంది కవయిత్రి… దేవదూత అతన్ని తలచుట్టూ ఆకులతో అలంకరించడానికి నిరాకరించడాన్ని ప్రతీకాత్మకంగా చెబుతూ. ఆ వెలుగూ, వెన్నెలా స్వర్గానికి ప్రతీకలు.

బాగా ప్రఖ్యాతి వహించిన ఆమె Our Casuarina Tree కవిత కూడా ఈ నేపధ్యం లోనిదే.

English: Toru Dutt (1856-1877), the Indian poe...
English: Toru Dutt (1856-1877), the Indian poetess who travelled to Europe. (Photo credit: Wikipedia)

.

The Tree of Life

.

Broad daylight, with a sense of weariness!

Mine eyes were closed, but I was not asleep,

My hand was in my father’s, and I felt

His presence near me. Thus we often past

In silence, hour by hour. What was the need

Of interchanging words when every thought

That in our hearts arose, was known to each,

And every pulse kept time? Suddenly there shone

A strange light, and the scene has sudden changed.

I was awake: It was an open plain

Illimitable, stretching, stretching oh, so far!

And o’er it that strange light, a glorious light

Like that the stars shed over fields of snow

In a clear, cloudless, frosty winter night,

Only intenser in its brilliance calm

And in the midst of that vast plain, I saw.

For I was wide awake, it was no dream.

A tree with spreading branches and with leaves

Of diverse kinds, dead silver and live gold,

Shimmering in radiance that no words may tell!

Beside the tree an angel stood; he plucked

A few small sprays, and bound them round my head.

Oh, the delicious touch of those strange leaves!

No longer throbbed my brows, no more I felt

The fever in my limbs “And oh” I cried,

“Bind too my father’s forehead with these leaves”.

One leaf the angel took and therewith touched

His forehead, and then gently whispered “Nay”

Never, oh never had I seen a face

More beautiful than that Angel’s, or more full

Of holy pity and of love divine.

Wondering I looked awhile, then, all at once

Opened my tear-dimmed eyes When lo! the light

Was gone the light as of the stars when snow

Lies deep upon the ground. No more, no more,

Was seen the Angel’s face. I only found

My father watching patient by my bed,

And holding in his own, close-prest, my hand.

.

Toru Dutt

(1856-1877)

Indian Poetess

Toru Dutt, one of the earliest of Indo-Anglian poets, led a life of tragedy and beauty. She died young leaving behind a modest corpus of poetry of which the poems included in Ancient Ballads and Legends of Hindustan (1882) are the most enduring. The Ancient Ballads consists of nine legends, most of them chosen from the Mahabharata, the Ramayana and the Vishnu Purana. They are Savitri, Lakshman, Jogadhya Uma, The Royal Ascetic and the Hind, Dhruva, Buttoo, Sindhu, Prahlad and Sita.

Toru Dutt’s fame rests mainly on these ballads and a few other poems of which Our Casuarina Tree is the most well-known. Most of her poems are narrative and her poetry as a whole exhibits a sophisticated poetic mind saturated with Hindu ethos and tempered by European cultural influences. Toru was the first Indo-Anglian poet to interpret the spirit of India to the West.

She was the first woman writer in Indo-Anglian literature. She left behind such a glory and legacy that even today we think of her as the marvellous young girl who died before her prime after blazing an immortal trail in Indo-Anglian poetry.

(Poem and Biography Courtesy: http://archive.org/stream/gatheredgrace029041mbp/gatheredgrace029041mbp_djvu.txt) of Project Gutenberg.

Michael Stern Hart and Gregory Newby, founders...
Michael Stern Hart and Gregory Newby, founders of Project Gutenberg, project to digitize public domain books as e-texts. (Photo credit: Wikipedia)
%d bloggers like this: