రోజు: జూలై 23, 2012
-
తేలుకుట్టిన రాత్రి… నిస్సిం ఎజకీల్, భారతీయ కవి
. మా అమ్మని తేలు కుట్టిన ఆ రాత్రి నాకు బాగా గుర్తుంది. పది గంటలపాటు ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షం తేలుని బియ్యపుబస్తా క్రిందకి వెళ్ళేలా చేసింది. చీకటిగదిలో ఒక్కసారి తోక జాడించి, తోకకున్న విషం ఎక్కించి మళ్ళీ వర్షంలోకి పారిపోయింది. రైతులందరూ ఈగల్లా మూగిపోయేరు వందసార్లు భగవన్నామ జపం చేసేరు ఆ తేలు ఎక్కడుంటే అక్కడ ఆగిపోడానికి. కొవ్వొత్తులూ, లాంతర్లూ మన్ను మెత్తిన గోడలమీద పేద్ద తేలులాంటి నీడలు కదులుతుండగా దానికోసం వెతికేరు గాని, లాభం […]