నాన్నంటే… అజ్ఞాత కవి.

sky
sky (Photo credit: Wikipedia)

.

భగవంతుడు

మహా పర్వతాల పటుత్వాన్నీ

మహా వృక్షాల ఔన్నత్యాన్నీ

వేసవి సూర్యుడి వేడిమినీ

మహాసముద్రాల ప్రశాంతతనీ

విశ్వాత్మ ఔదార్యశీలతనీ

నిర్భీతిగా నిదురపుచ్చే రేయి నెమ్మి హస్తాన్నీ

గతకాలాల విజ్ఞతనీ

గరుడుడి వియద్విహార శక్తినీ

వాసంత ప్రభాతపు ఆనంద హేలనీ

ఆవగింజ మొక్కవోని ఆత్మస్థైర్యాన్ని

అనంతమైన సహనాన్నీ

సంసారమంత గంభీరమైన అవసరాల్నీ ఎంచెంచి ఏర్చి

ఈ లక్షణాలన్నీ కలగలిపి

ఇంకేమీ అవసరంలేకపోవడంతో

తను ఊహించిన అత్యుత్తమ ఆకృతి అతనికి పూర్తయిందని

దానికి తండ్రి అని నామకరణం చేశాడు.

అజ్ఞాత కవి.

.

What Makes A Dad

God took the strength of a mountain,
The majesty of a tree,
The warmth of a summer sun,
The calm of a quiet sea,
The generous soul of nature,
The comforting arm of night,
he wisdom of the ages,
The power of the eagle’s flight,
The joy of a morning in spring,
The faith of a mustard seed,
The patience of eternity,
The depth of a family need,
Then God combined these qualities,
When there was nothing more to add,
He knew His masterpiece was complete,
And so,

He called it … Dad
– Author Unknown

Poem Courtesy: http://www.indobase.com/fathersday/fathers-day-poems/whats-a-dad.html

“నాన్నంటే… అజ్ఞాత కవి.” కి 9 స్పందనలు

  1. చాలా బావుంది. ఎస్,తండ్రి అంటే అలాగే ఉండాలి అనిపించేలా!!

    మెచ్చుకోండి

    1. వనజగారూ,
      నిజం. తల్లిని భూమితోటీ, తండ్రిని ఆకాశం తోనూ పోలుస్తారు అందుకనే. పిల్లల్ని సాకడం లో తల్లికున్నంత సహనం తండ్రికి ఉండదు. ఆమెకి ఆప్యాయత అనురాగం, తండ్రికి విజ్ఞత, లోకానుభవం, సమస్యలొస్తే ఎదుర్కోడానికి వలసిన ప్రశాంతత కవాలి. వ్యక్తిత్వాల్లో ఒకరు హిమోత్తుంగం అయితే రెండోవారు సాంద్రగంభీరంగా ఉండాలి. అటువంటి శిక్షణ ఇచ్చినతర్వాతే వాళ్లకి వివాహం చెయ్యాలేమో కూడా.
      అభివాదములతో

      మెచ్చుకోండి

  2. ఇన్ని లక్షణాలు వుండాలంటే కష్టమేనండీ, స్ఫూర్తినిచ్చే కవిత.

    మెచ్చుకోండి

    1. భాస్కర్ గారూ,
      “అరయన్ వంశము నిల్పనే గద వివాహము” అని హరిశ్చంద్ర నాటకం లో హరిశ్చంద్రుడు చెబుతాడు. వివాహము భార్యాభర్తల మధ్య ప్రేమానుబంధమే కాదు, భావి తరాలకి ఒక వాగ్దానం కూడా. అందుకే పిల్లల్ని కనేముందు కొన్ని త్యాగాలకి సిద్ధం కావాలి. దంపతులు కొన్ని స్వసుఖాలనీ, కాలాన్నీ కూడా వాళ్ళకి త్యాగం చెయ్యగలగాలి. అర్థరాత్రి అపరాత్రి అనకుండా, కళ్లమీద నిద్రముంచుకొస్తున్నా, అధిగమించి మరీ పిల్లలకి సేవచెయ్యగల మానసిక పరిణతిని సాధించాలి. మీరన్నట్టు అది Demanding. కాకపోతే అసాధ్యం మాత్రం కాదు. దానికి క్రమశిక్షణతో కూడిన మనో నిశ్చయం కావాలి. అంతే.
      అభివాదములతో

      మెచ్చుకోండి

  3. good one and well said..chala baagundi…@sri

    మెచ్చుకోండి

  4. కర్లపాలెం హనుమంత రావు Avatar
    కర్లపాలెం హనుమంత రావు

    నాన్న మీద అమ్మ మీద వచ్చినన్ని కవితలు రాలేదు అనుకుంటాను మన తెలుగులో(ప్రపంచ సాహిత్యంలో కూడా అంతేనా సార్?)నేను చదివిన నాన్న కవితలలో ఈ మధ్య గజల్ శ్రీనివాస్ ఆటా తెలుగు మహాసభలలో పాడిన రెంటాలవారి కవిత తరువాత అంత బాగా ఉన్నది ఈ కవితే!పదిలంగా దాచుకోదగిన గొప్ప కవితను సరళమైన భాషలో అందించినందుకు ధన్యవాదాలు

    మెచ్చుకోండి

    1. హనుమంత రావు గారూ,
      మీ రన్న మాట నిజం. నాకు తెలిసి కూడ అమ్మ మీద వచ్చినన్ని కవితలు నాన్న మీద రాలేదు. ఇంగ్లీషు సాహిత్యం లో మనలాగ వ్యక్తిత్వాల్ని రొమాంటిసైజ్ చెయ్యడం ఉంటుంది. ఒక రకంగా అవి ‘matter of fact గా ఉంటాయి. కనుక ఒక్కొక్కసారి పేలవంగా ఉన్నట్టు అనిపిస్తాయి కూడా.
      తెలుగులో మరీ చొద్యం. అమ్మమీద అనర్గళంగా కవితలు రాసేస్తారు గాని, తల్లిని మాత్రం ఎంతచులకనగా చూడగలరో అంత చులకనగానూ చూడగల స్థితి (వీలయితే ఏ ఆశ్రమంలొనో కూడ చేర్చెస్తారు) మనవాళ్ళకే చెల్లింది. కవిత్వానికీ నిజజీవితానికీ అంతవ్యత్యాసం ఉండగలిగింది మనకేనేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. అమ్మ మీద తెలుగులో చాలా కవితా సంకలనాలు వచ్చేయి కూడా.

      కాకపోతే, నాకు తెలిసి ఒకే వ్యక్తి అమ్మ మీద, రాసిన విషయం రాయకుండ అటు తెలంగాణా మాండలికం లోనూ, ఇటు అద్భుతమైన వ్యావహారిక భాషలోనూ ఎంతో రసవత్తరంగా రాసినది ఒక్క అనిశెట్టి రజిత గారే . అమ్మపదం పుస్తకానికి వచ్చిన కవితల్లో ఆవిడ కవితల్లో ఏది ఎంచుకోవాలో కష్టమయిపోయింది. సుమారు పది పన్నెండు కవితలు రాసేరామె అమ్మ మీద. ఒక్కొక్కటీ నా దృష్టిలో ఒక ఆణిముత్యం.
      అభివాదములతో

      మెచ్చుకోండి

  5. కర్లపాలెం హనుమంత రావు Avatar
    కర్లపాలెం హనుమంత రావు

    అవును..నేను తెలుగు వరకూ మీతో ఏకీభవిస్తాను.(ఆంగ్ల సాహిత్యం లో అంత అవగాహన లేదు) అమ్మపదం నేనూ చూసాను.నాన్నపథం…మీరు అన్నట్లు మనం ఊహించుకోలేమేమో తెలుగులో.అమ్మల మీద కవితలకే పరిమితమా మన ప్రేమ!అమ్మ నాన్నకన్నా మరీ ఎక్కువ ఆశిస్తుందేమో..ఆ మేరకు నిరాశా అధికంగా తప్పడం లేదు.బిడ్డల్ని డబ్బు సంపాదించే యంత్రాలుగా తయారుచెయాలనుకునే తల్లిదండ్రుల మితిమీరిన తపనే చాలా అనర్థాలకు కారణమవుతున్నదని నా అభిప్రాయం.ఎమైనా ఇది ఒక పెద్ద చర్చనీయమైన అంశం కదా సార్!

    మెచ్చుకోండి

  6. రావు గారూ,
    మీరన్నది చాలా నిజం. యంత్రాలు నాటితే యంత్రాలే మొలుస్తాయి… మనసులు మొలవవు. ఇది చాలా చర్చనీయాంశమే. ఇప్పుడు కవిత్వం కూడా అనుభూతికంటే, ఆశతోకూడిన కోరిక (నాస్టాల్జిక్)గా తయారైపోయింది.
    అభివాదములతో

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: