పిచ్చుకలు… K A Abbas

Group of sparrows.
Group of sparrows. (Photo credit: Wikipedia)

.

రహీం ఖాన్ పొలం నుండి ఇంటికి తిరిగుముఖంపట్టే వేళకి ఊరికి పడమర పొలిమేరలోనున్న మామిడి తోటలో సూర్యుడు అస్తమిస్తున్నాడు. యాభయ్యవపడిలో పడినప్పటికీ విశాలమైనఛాతీతో బలంగా, ధృడంగా ఉండి, భుజంమీద నాగలి వేసుకుని, తన రెండెడ్లనూ తోలుకుంటూ గ్రామం ప్రధానవీధిలోంచి నడుస్తున్నాడు. అతని వాలకం చూస్తే చాలా కోపంతో ఆవేశంతో ఉన్నట్టు తోస్తుంది. అతను నాలుగురోడ్ల కూడలికి వచ్చేసరికి, అంతవరకూ రోజూ సాయంకాలం తమ దమ్ము వేసుకోడానికి అక్కడికివచ్చే పది, పదిహేనుమంది రైతుల పరాచికాలతో ఆహ్లాదంగాఉన్న వాతావరణం ఒక్కసారి ఎందుకైనా మంచిదన్నట్టు గుసగుసలలోకి దిగిపోయింది. అతను సందు తిరిగి, అతని బరువైన అడుగుల చప్పుడు ఇక వినిపించటంలేదు అనుకున్న తర్వాతే, సమిష్టిగా తాగే హుక్కాని మరొకడికి అందిస్తూ కల్లూ అన్నాడు “చూడండి ఎలా వెళుతున్నాడో ఆ రాతిగుండె మనిషి,”. దానికి మిఠాయిలమ్ముకునే నన్హా వంత పాడుతూ, “వాడి వాలకం రోజు రోజుకీ ముదిరిపోతోంది. నిన్న వాడు పాపం, రామూ వాళ్ళ పిల్లాడిని ఎద్దుమీద రాయి విసిరేడని చితకబాదేడు.” అందరి వ్యవహారాల్లోనూ అనవసరంగా తలదూర్చే రామనాథం రహీంఖాన్ చేసే దుర్మార్గాలని ఇంకా ఏకరేవు పెట్టడానికా అన్నట్టు ముందుకువచ్చి, “మొన్న అతని చేలో పొరపాటున ప్రవేశించిన నా గుర్రాన్నయితే చంపీసినంత పనిచేశాడు.” ఇక్కడ అతని ఆకతాయి కుర్రాళ్ళిద్దరూ ఖాన్ చేనులోకి కోరుండే దాన్ని తోలేరన్నది అప్రస్తుతం గనక,  అతను ఆ ఊసు ఎత్తలేదు.  యధాప్రకారం అందరికంటే ఆఖర్న మాటాడుతూ “హరే రాం” అనకుండా ఏ సంభాషణా జరపని తలనెరిసిన పటేలు, ఒకసారి భగవన్నామస్మరణ చేసి తనబోసి నోటితో ఇలా అన్నాడు, “నా జీవితంలో ఇంతవరకు అంత క్రూరమైన మనిషిని ఎన్నడూ చూడలేదు. అతనికి అమాయక పశువని జాలీ లేదు, పిల్లాడని దయాలేదు. అందరూ ఒక్కటే.  అతని పిల్లలు ఇంట్లోంచి పారిపోయేరంటే ఆశ్చర్యం ఏముంది?”

ఈ లోగా వాళ్ళ సంభాషణకి హేతువైన మనిషి తన గుడిసె చేరుకున్నాడు…అది ప్రతీకాత్మకంగా ఉందా అన్నట్టు మిగతా గుడిసెలకన్నా భిన్నంగా, దూరంగా నీరసంగా కనిపిస్తోంది. నాగలిని ఇంటి పిట్టగోడకు చేరవేసి, ద్వారానికి ఎదురుగా నేలలో పాతిన గుంజలకి తన రెండెడ్లనూ కట్టడానికి అతను అటు తిరిగేడు.

ఇంట్లోకి వెళ్ళబోతుండగా, వెనకనుండి,  “రహీం భాయ్,” అన్న గొంతు చాలా వినయంగా వినిపించింది.

“ఏమిటి సంగతి?”

వెనక్కి తిరిగి,  తన ఇంటికి దగ్గరగా ఉన్న ఇంటినుండి వచ్చిన ముసలామెను చూసి కసురుకుంటున్నట్టుగానే అడిగాడు. ఆమె చెప్పాలా వద్దా అని సందేహిస్తూంటే, ఒక ప్రశ్నల పరంపర గుప్పించేడు: ” ఏమైంది? నిన్నేం తినీనులే చెప్పు. ముసిలిదానా, మాటాడవేం? ప్రభుత్వపు బకాయిలు చెల్లించలేదని మళ్ళీ నీ కొడుకుని అరెస్టు చేశారా? లేక, నీ కోడలు మళ్ళీ మరో బిడ్డను ప్రసవించిందా?”

ఊపిరి గట్టిగా బిగించి, ధైర్యాన్నంతా కూడగట్టుకుని ఆమె రెండు మాటలు అనగలిగింది, “మీ ఆవిడ…”

“…. ఇంట్లోంచి పారిపోయిందా?

ఆమె మాటను పూర్తిచేశాడు, తను సరిగానే ఊహించేనన్న అనందంతో ఓ కనీ కనపడని చిరునవ్వు  నవ్వుతూ.

“అహా, అది కాదు,” అతని భార్య వెళిపోడానికి ఆమే బాధ్యురాలైనంత విచారంగా చూస్తూ “తను నూర్ పుర్ లో ఉన్న వాళ్ళ అన్న దగ్గరకి ఓ రెండు రోజులుండడానికి వెళ్ళింది,”అని వివరించింది.

 “బా!”, అసహనంగా ఆమె వంక చూశాడు తలుపు తెరుస్తూ.   అతనికి తెలుసు, ఆమె ఇంక వెనక్కి రాదని.

లోపల కోపంతో ఉడికిపోతూ, చీకటిగా ఉన్న పాకలోకి దూరి నులక మంచం మీద కూలబడ్డాడు.  గోడమూలని ఒక పిల్లి మ్యావ్ మంటూ అరిచింది. తనకోపాన్ని తీర్చుకుందికి ఎవ్వరూ లేక, దాని బయటకు తోలి, తలుపు దభీమని వేశాడు.

తనకిపుడు మట్టికొట్టుకుపోయిన చేతులూ కాళ్ళూ కడుక్కుందికి నీళ్ళిచ్చేవారు గాని, రాత్రి భోజనం పెట్టేవాళ్లుగాని, తను తిట్టి, కొట్టగలినవాళ్ళు గాని లేరు. రహీంఖాన్ కి ఇప్పుడు చికాకుగా, బాధగా ఉంది. అతని భార్య ఎదురుగా ఉన్నంతసేపూ కోపంగానే ఉండే వాడు, ఆమె ఇప్పుడు ఎదురుగా లేకపోవడం మరింత కోపాన్ని తెప్పిస్తోంది.

“అయితే, ఆమె వెళ్ళిపోయిందన్న మాట,” అని మనసులో అనుకున్నాడు, నులకమంచమ్మీద కాళ్లు బారజాపుకు పడుక్కుని, రాత్రి ఏమీ తినకుండానే నిద్రపోవాలని నిశ్చయించుకుంటూ.  తన ముప్ఫై ఏళ్ళ వైవాహిక జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఆమె తననివదిలేసి వెళిపోతుందని అనుకునే వాడు. ఒకసారయితే, ఆమె వెళిపోవాలని కోరుకున్నాడు కూడా. ఆరేళ్ళ క్రిందట తన పెద్ద కొడుకు బుండూ మామూలుగాకంటే కొంచెం ఎక్కువ కొట్టినందుకు ఇంట్లోంచి పారిపోయాడు.  మరో మూడేళ్ళ తర్వాత తన చిన్న కొడుకు అన్నతో జతకలిసాడు.  ఆరోజునుండీ అతనిభార్య వాళ్ళ అన్న ఇంటికి ఖచ్చితంగా వెళ్ళిపోతుందని అనుకున్నాడు. ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది గనక తనకి అసంతుష్టిగా ఉంది… విచారంగా లేదు, ఎందుకంటే, అతను ఆమెను ఎన్నడూ ప్రేమించలేదు. కేవలం ఇంట్లో ఉండవలసిన సామాన్లలో ఒకటి తీసేసిన అసంతృప్తిలాంటిది ఉంది. అంతే. ఇప్పుడామె వెళిపోయిన తర్వాత, తన కోపాన్నీ బాధనీ ఎవరిమీద వెళ్ళగక్కగలడు?

ముఫ్ఫై ఏళ్ళపాటు, తనకుటుంబం మీద, సమాజం మీద, జీవితం మీదా తనకున్న దుఃఖాన్నీ, కోపాన్నీ వెలిగక్కడానికి లక్ష్యంగానూ, ప్రతీకగానూ నిలిచింది.

వయసులో ఉన్నపుడు మల్ల యుద్ధం, కబడ్డీ, పంటకాలవ వంతెనమీదనుండి నీట్లో దూకడం లాంటి విద్యలలో ఊర్లో తనకి సాటి రాగలిగిన వాళ్ళు ఎవరూ ఉండేవారుకాదు. తనో అమ్మాయిని ప్రేమించాడు. ఒకసారి వాళ్ళ ఊర్లో విడిది చేసిన సర్కసు కంపెనీలో చేరాలనుకున్నాడు.  ఆ సర్కసులోనే తన జీవిత లక్ష్యం ఉందనుకున్నాడు. దేశాలు తిరిగే అవకాశమూ కీర్తిప్రతిష్ఠలతో పాటు, అది తన మనసుకి బాగా నచ్చింది  కూడా. గ్రామకోమటి రాం చరణ్ కూతురు రాధలో తన ఆత్మసఖి దొరికిందనుకున్నాడు. మొదటిసారి తను ఆమెని ఒక కుస్తీ పోటీలో గమనించాడు; తను ప్రత్యర్థిని ఓడించి నిలబడినపుడు ఆమె తనని ప్రేమగా చూసిన క్షణం జీవితంలో అత్యంత మధురమైన క్షణం. ఆ తర్వాత కొన్నిసార్లు దొంగచాటుగా క్షణకాలం కలుసుకున్న సందర్భాలున్నై.  మాటలకోసం వెదుక్కుంటూ ఈ చదువులేని పిచ్చి ప్రేమికుడు తనప్రేమని వ్యక్తం చేశాడు కూడా. అయితే అతని రెండు ఆశల్నీ తన తల్లిదండ్రులు త్రుంచేశారు. సర్కసులో పనిచెయ్యడం గౌరవంగా బ్రతికే రైతు బిడ్డకి నీచవృత్తీ, నీతిమాలిన పనీని. తన తండ్రీ, తాతా, ముత్తాతా వ్యవసాయం చేశారుకాబట్టి తనుకూడ వ్యవసాయం చెయ్యవలసిందే. ఇక రాధని పెళ్ళిచేసుకునే విషయానికి వస్తే, ఆమె హిందూ; అల్లాని నమ్మని ఆమెని పెళ్ళిచేసుకోడం అపకీర్తీ, మతవిరుద్ధమూ.

కొంతకాలం యవ్వన లక్షణమైన ఆగ్రహంతో ఎదురుతిరుగుదామా అని అనుకున్నాడు కూడా. అయితే, శతాబ్దాలుగా రక్తంలో జీర్ణించుకుపోయిన దాస్యభావనలు, తనతండ్రి కఠినమైననిర్ణయం తనకి ఎంతగా ఆగ్రహం తెప్పించినప్పటికీ అతని అధికారానికీ, సామాజిక కట్టుబాట్లకీ విరుద్ధంగా ఎదురుతిరగనియ్యలేదు. కొన్నిరోజులకి తమ ఊళ్ళోంచి సర్కసూ వెళ్ళిపోయింది. రాధని తను దొంగచాటుగా కలుసుకోవడమూ అకస్మాత్తుగా ఆగిపోయింది.  రహీంఖాన్ తండ్రి కూడ, రాం చరణ్ తో గడుసుగా రాధకి అప్పుడే పదిహేనేళ్ళు నిండి పెళ్ళీడుకొచ్చిందనీ, ఈపాటికే పెళ్లిచేసిఉండాలని సలహా ఇస్తూ, ఆలస్యంగా పెళ్ళిళ్ళుచేస్తే వచ్చే విపత్తుల గురించి గుర్తుచెయ్యడం మరిచిపోలేదు. కొద్దివారాల్లోనే రాధకి పక్క ఊర్లోని కుండలాంటి పొట్ట ఉన్న మధ్యవయస్కుడైన కోమటితో పెళ్ళి జరిగిపోయింది.  చీకటి ఏకాంతంలో రహీంఖాన్ తో తన విఫలప్రేమకి గుర్తుగా రెండు కన్నీళ్ళు కార్చి, విధికి తొందరగా రాజీ పడిపోయి, రాధ ఆరుగురు పిల్లల తల్లికూడా అయిపోయింది.

రహీం ఖాన్ కూడా పెళ్ళిచేసుకున్నాడు. అయితే ఇందులో అతని ఇష్టాఇష్టాల ప్రసక్తి లేదు. తల్లిదండ్రులే పిల్లని ఎంపిక చేసి, తేదీ నిర్ణయించి, తనకి షోకైన బట్టలూ, పెళ్ళికూతురికి వెండి ఆభరణాలూ బెత్తాయించి, గుర్రం మీద తనని కూర్చోబెట్టి, తప్పెట్లు తాళాలమోతతో పెళ్ళికూతురు ఇంటికి తీసుకువెళ్ళి నిఖా జరిపించేసేరు. కాజీ అడిగిన సంప్రదాయమైన ప్రశ్నలకి రహీం ఖాన్ యంత్రంలా తల ఊపేడు.  వేరే మార్గం ఏదీ లేదు.  పాపం! సిగ్గుతో తలవంచుకుని ఓ చీకటిగదిలో కూర్చుని తన భవిష్యత్తు మీద ఏమాత్రం అవగాహనలేని పెళ్ళికూతుర్ని అడిగే ప్రయత్నం ఎవ్వరూ చెయ్యలేదు కూడా. కార్యక్రమం ముగిసిన తర్వాత, రహీంఖాన్ తండ్రి గర్వంగా భార్యతో స్వోత్కర్షతో ఇలా అన్నాడు: “చూశావా? మనవాడు ఎలా నేను చెప్పినట్టు నడుచుకున్నాడో. నువ్వెప్పుడూ వాడు మనం చేసిన ప్రయత్నాలకి ఒప్పుకోడేమోనని భయపడేదానివి. నాకు ఈ కుర్రకారు సంగతి తెలుసు. పెళ్ళిళ్ళు ఆలస్యమైతే అశాంతిగా ఉండడం వాళ్లకి సహజం. అందుకే మన పెద్దలు పిల్లలకి చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. ఇక చూడు, వాడే తోవలో పడతాడు!”

సరిగ్గా అదే క్షణంలో, కసాయివాడికోసం ఎదురుచూసే గొర్రెలా తనకోసం ఎదురుచూస్తున్న భార్య వేచి ఉన్న గది ద్వారందగ్గర నిలబడ్డ రహీం ఖాన్, తన తల్లి దండ్రులమీదా, కుటుంబం మీదా, సమాజం మీదా పగతీర్చుకోవాలన్న భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు.  ఆ గందరగోళపు, హేతుబద్ధంగా ఆలోచించలేని స్థితిలో, తనుపడుతున్న మానసికవ్యధకంతటికీ పెళ్ళికూతురే బాధ్యురాలుగా కనిపించింది. ఆమె మీద తను పగతీర్చుకోవాలి. వెన్నలాంటి మనసున్న అతని మనసు కర్కశంగా మారింది. తలుపు చాలా  మొరటుగా తోసాడు.

అది జరిగి ముఫ్ఫై ఏళ్ళు గడిచిపోయింది. ఆ చీకటి పాకలో మంచంమీద పడుక్కున్న రహీంఖాన్ ఇవన్నీ గుర్తుచేసుకున్నాడు. తను కక్ష సాధించుకోలేదూ? ముప్ఫై సంవత్సరాలపాటు తన భార్యనీ, పిల్లలనీ, ఎడ్లనీ నిర్దాక్షిణ్యంగా హింసించి, ఊర్లో ఉన్నవాళ్ళందరితో తగువులాడి, తన సమాజంలో అందరూ అసహ్యించుకునే వ్యక్తిగా తయారయ్యేడు. అలా అందరూ అసహ్యించుకునే వ్యక్తిగా మారడమనే భావనకి లీలగా సంతోషం కలిగింది.

అయితే, ఎప్పుడూ సరదాగా తిరిగే మంచి మనసున్న కుర్రాడు ఉన్నట్టుండి ఇంతకఠినంగా మృగంలా ఎందుకు మారేడో,  దానికిగల కారణాలేమిటో ఎవ్వరూ అర్థం చేసుకోనూ లేదు, అర్థం చెసుకుందికి ప్రయత్నించనూ లేదు. మొదట్లో వాళ్ళ ప్రవర్తన ఆశ్చర్యంతో కూడిన విరోధంగా ఉంటే, తర్వాత్తర్వాత అది భయంతో కలగలిసిన ఉదాసీనతగా  పరిణమించింది. అతని మనసు అర్థంచేసుకోవడంగాని, సానుభూతి ప్రకటించడంగాని ఎవ్వరూ చెయ్యలేదు.  చేదు నిజం మనసు తొలుస్తుంటే, అందరిచేత వెలివేయబడ్ద రహీం ఖాన్, సమాజం అనుమతించింది గనుక తనభార్యపై తిరుగులేని అధికారాన్ని ప్రదర్శించి ఊరట పొందేడు.

ముప్ఫై సంవత్సరాలపాటు అతని భార్య స్త్రీజాతి సహజలక్షణమైన బానిసలాంటి విధేయతని ప్రదర్శించి, అతని వేధింపులని తట్టుకుని ఒదిగి ఉంది. రాను రాను, ఆమెకి శారీరక హింస ఎంత అలవాటయిపోయిందంటే, ఒక వారం రోజులుగాని ఆ బాధలేకుండా గడిచిందంటే ఆశ్చర్యమే.  రహీంఖాన్ కి భార్యని హింసించడం తన ఉనికిలో ఒక భాగమైపోయింది. కళ్లమీదకి అలా నిద్ర ముంచుకొస్తుంటే అతని చివరి ఆలోచనల్లా, అతనికి జీవితంలో అలవాటైపోయిన ఆవేశాన్ని ప్రదర్శించడానికి అవకాశం లేనపుడు బతకగలడా అని. బహుశా ఈ ఒక్కసారే అతనికి ఒక అనుభూతి అకలిగింది, నిజంగా ప్రేమలాంటిది కాదు గాని, ఆమె లేకుండా ఉండే తన ఒంటరితనం గురించి. ఇంతకుముందువరకూ, తను అంతగా ద్వేషించిన ఆ వ్యక్తి తన జీవితంలో ఎంతగా భాగస్వామిని అయిపోయిందో గ్రహించలేకపోయాడు.

అతను నిద్ర లేచేసరికి అప్పుడే బారెడు పొద్దెక్కింది. భార్యని తిడుతూనే తన దినచర్య ప్రారంభించేడు. ఎందుకంటే, ఎప్పుడూ ఆమే సూర్యోదయం అవకుండ లేచేది. ఇవాల తనకు తొందరలేదు. బధ్ధకంగా లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, మేకలకు పాలు పితికి నిన్న మిగిలిన చపాతీలు వేడిపాలలో ముంచుకుని ఉదయం ఫలహారం అయిందనిపించేడు. అప్పుడు తనకిష్టమైన హుక్కా పక్కలో పెట్టుకుని పొగ త్రాగడనికి కూర్చున్నాడు. తెరిచిఉన్న కిటికీ లోంచి ఎండపడుతూ గుడిశ వెలుతురుతో నిండిపోయి వెచ్చగా ఉంది. మూలనెక్కడో సాలెగూళ్ళు కనిపిస్తే, తనివాళ ఎలాగూ పొలంపనికి ఎగనామం పెట్టాలని నిశ్చయించుకున్నాడు కాబట్టి, గుడిశ శుభ్రం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. పొడవైన కర్రకి కుంచెకట్టి సాలెగూళ్ళు తియ్యబోతుండగా చూరులో ఒక పిచ్చుకగూడు చూశాడు. రెండు పిచ్చుకలు కిచకిచమని అరుస్తూ, అటూ ఇటూ తెగ తిరుగుతున్నాయి.

ముందు కర్రతో ఒకపోటుపొడిచి ఆ గూడు కూలదోద్దామనుకున్నాడు. కాని అతనిలోని ఏదో శక్తి ఆ పని చెయ్యకుండా ఆపింది. కర్ర విసిరేసి, గూడు ఎలాగ ఉందో చూద్దామని ఒక స్టూలు తెచ్చుకుని ఎక్కి గమనించేడు. అందులో ఇంకా రెక్కలు మొలవని ఎర్రని మాంసం ముద్దలాంటి రెండు బుజ్జి పిచ్చుకలు, బహుశా ఒకరోజైనా కాలేదేమో, గమనించేడు. తల్లి పిచ్చుకా తండ్రి పిచ్చుకా అతని ముఖం మీదే భయంతో అరుస్తూ తిరగసాగేయి. అతనింకా సరిగ్గ పిల్లల్ని చూడకుండానే తల్లి పిచ్చుక అతని మీద దాడి చేసింది.

మరుసటిరోజు తనపని యధాప్రకారం ప్రారంభించేడు. అయినా, అతనితో ఎవ్వరూ మాటాడటం లేదు. ఉదయం నుండి సాయంత్రం అయేదాకా పొలంలో పనిచెయ్యడం, చెలక దున్నడం, చేలకి నీళ్ళుపెట్టడం చేసుకుని సూర్యాస్తమయంలోపు ఇంటికి తిరిగి రావడం అతని దినచర్య. ఇంటికి వచ్చి తన నులకమంచం మీద పడుక్కుని, హుక్కా పీలుస్తూ, ఆ పిచ్చుక  కుటుంబం యొక్క ఆటపాటలన్నీ కుతూహలంతొ శ్రధ్ధగా గమనిస్తాడు. చిన్న పిల్లలు రెండూ  ఇప్పుడుకొంచెం పెద్దవయ్యేయి. వాటికి ఎన్నాళ్ళబట్టో ఇంట్లోంచి వెళ్లిపోయిన తనకొడుకుల గుర్తుగా నూరూ, బుండూ అని పేర్లు పెట్టేడు. ఆ నాలుగు పిచ్చుకలే అతని ప్రపంచం ఇప్పుడు.  అతని చుట్టుపక్కలవాళ్లకి ఇప్పటికీ అతనంటే భయమే. ఈ మధ్య అతను కనబరుస్తున్న ప్రశాంతత చూసి అనుమానమే. అతను ఇప్పుడు ఎడ్లని కొట్టగా ఎవ్వరూ చూడలేదు. అది అందరికీ ఆశ్చర్యమే.  నాతూ, చిడ్డూ కూడా ఇప్పుడు ఒంటిమీది దెబ్బలు మానిపోవడంతో హాయిగా కృతజ్ఞతగా ఉన్నాయి.

ఒక వర్షాకాలం సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఎప్పుడైనా వర్షం పడేటట్టున్న సమయంలో పొలం నుండి మామూలు సమయం కంటే ముందుగానే ఇంటికి ముఖం పట్టేడు రహీం ఖాన్.  దారిలో రోడ్డుమీద కొందరు పిల్లలు ఆడుకోడం చూసేడు. అతన్ని చూడగానే వాళ్ల కాలిజోళ్ళు వదిలేసి మరీ పరుగు లంకించుకున్నారు. “మీరెందుకు పారిపోతున్నారు? మిమ్మల్ని కొట్టనులెండి” అని అరిచినా ప్రయోజనం లేకపోయింది. ఇంతలో చినుకులు మొదలవడంతో, వర్షంముదిరేలోపునే ఎడ్లని కట్టడానికని గబగబా అడుగులేసుకుంటూ ఇంటివైపు నడిచేడు.

గుడిశలో దూరి, మట్టి ప్రమిదలో దీపం వెలిగించి తన రాత్రిభోజనం తయారు చేసుకుందికి ముందు ఆ దీపం చుట్టూ కొన్ని బ్రెడ్డు తునకలు పిచుకలు తినడానికి వేసేడు. “ఓ నూరూ, ఓ బుండూ” అని అరిచేడు గాని కాని అవి పలకలేదు. తన మిత్రులకి ఏమయ్యిందా అని ఆత్రంగా పిచ్చుకగూడులోకి తొంగి చూసేడు. అక్కడ నాలుగూ భయంతో దగ్గరగా రెక్కలు ముడుచుకుని కూర్చున్నాయి. ఆ గూడు ఎక్కడ ఉందో సరిగ్గా అక్కడే గుడిశ కారుతోంది. వెంటనే నిచ్చెన తీసుకుని బాగా కురుస్తున్న వర్షంలోనే దాన్ని మరామత్తు చెయ్యడానికి బయలుదేరేడు రహీం ఖాన్. సంతృప్తికరంగా తనపని  పూర్తిచేసే వేళకి మనిషి నిలువునిపాదం తడిసి ముద్దయిపోయేడు. మంచం మీద కూర్చుకే సరికి తుమ్ములు పట్టుకున్నాయి, కాని ఆ హెచ్చరికని లక్ష్యం చెయ్యకుండా నిద్రకి ఉపక్రమించేడు. తెల్లారి లేచేసరికి అతని శరీరం జ్వరంతో కాగిపోతోంది.

చాలా రోజులపాటు అతను పొలం పనికి వెళ్ళకపోవడం చూసిన గ్రామస్థులకి కుతూహలం కలిగి కొందరు సంగతి ఏమిటో కనుక్కుందామని అతని గుడిశ దగ్గరకి వెళ్ళారు. తలుపు కన్నంలోంచి మంచం మీద పడుక్కుని “ఓ బుండూ, ఓ నూరూ, నేను లేకపోతే రేపు మీకు ఎవరు మేతపెడతారర్రా?” అని అనడం విని అతనిలో అతనే మాటాడుకుంటున్నాడనుకున్నారు.

జాలిగా తలలూపుకుంటూ, “పాపం! వీడికి పిచ్చెక్కినట్టుంది. సేవలుచెయ్యాడనికి అతని భార్యకి కబురుపెడదాం.” అని  నిశ్చయించుకున్నారు.

మరుచటిరోజు అతని భార్య పిల్లలని వెంటబెట్టుకుని ఆందోళనపడుతూ, ఏడుస్తూ వచ్చేసరికి చుట్టుపక్కల వాళ్ళందరూ గుమిగూడేరు  సానుభూతితో.  తలుపు లోపలినుండి గడియవేసి ఉంది. తలుపు ఎంత బాదినా ఎవ్వరూ తలుపు తియ్యలేదు. చివరికి తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించేసరికి, నాలుగు పిచ్చికలూ భంగపరుస్తున్నశ్మశాన నిశ్శబ్దం ఆవరించిన ఆ గదిలో, మంచం మీద నీరసంగా పడున్న రహీం ఖాన్ మహాకాయం కనిపించింది…

 .

ఖ్వాజా అహ్మద్ అబ్బాస్

(7 June 1914 – 1 June 1987)

ప్రముఖ ఉర్దూ కవి, చిత్ర నిర్మాత, దర్శకుడు, రచయిత, కథకుడు…

.

Sparrows

The sun was setting behind the mango grove which fringed the western extremity of the village when Rahim Khan returned from the fields. Broad and strong despite his fifty odd years, with the plough on his shoulders, and driving his two oxen, he walked through the main street of the village with a haughty and unfriendly air. As he approached the chaupal where a dozen or so peasants were collected for their evening smoke, the hilarious tones of gossip died down to cautious whispers. It was only when he had vanished round the corner and the heavy tread of this footsteps was heard no more that Kallu, passing the communal hookah to another, remarked, ‘There goes the hard-hearted devil!’ To which Nanha, the fat sweet-seller added: ‘He is getting worse and worse every day. Only yesterday he beat poor Ramoo’s child for throwing a pebble at his oxen.’ Ramnath, the officious zaildar, volunteered further details of Rahim Khan’s recent cruelties. ‘And the other day he very nearly killed my mare for straying into his field.’ The zaildar, of course, thought it quite irrelevant to mention that the straying of his mare had been specially planned by his mischievous sons. The old grey-haired patel was, as always the last to open his toothless mouth. And as usual, his words were prefaced by a pious invocation to the Almighty. ‘Hari Ram!’ he muttered, ‘I have never seen such a cruel man. He has compassion neither for a child nor for helpless animal. No wonder his own sons have run away from home.

The subject of their conversation, meanwhile, had reached his hut which , almost symbolically, stood gaunt and aloof, at a distance from the neighboring cluster of houses. Leaning the plough up against  the low wall of his house, he proceeded to tie the oxen to a pair of big wooden stakes embedded in the ground just in front of the doorway.

‘Bhai Rahim Khan!’ an obsequious voice said behind him as he was about to enter the house.

‘What is it?’ he gruffly queried, turning round to address the old woman who had come out of the house nearest his own. As  she hesitated to speak, he fired a volley of questions: ‘What is it? I won’t eat you. Why don’t you speak, woman? Has your son been arrested again for revenue arrears or has your daughter-in-law delivered another baby?’

As she stopped for breath, the woman summoned up all her courage to utter two words, ‘Your wife…’ ‘….has run away’. He completed the sentence with a grin which broadened with the realization that he had guessed right.

‘No, no,’ the woman hastily explained with an apologetic look, as if she herself were responsible for his wife’s absence. ‘She has only gone to her brother at Nurpur and will be back in a few days.’

‘Bah!’ he flung back at her, opening the door. He knew that his wife would never come back.

Seething with inward wrath he entered the dark hut and sat down on the charpoy. A cat mewed in a corner. Finding no one else on whom to vent his anger he flung it out, slamming the door with violence.

There was no one to give him water to wash his dust-laden feet and hands, no one to give him supper, no one whom he could curse and beat. Rahim Khan felt uncomfortable and unhappy. He had always been angry with his wife when she was there, but her absence angered him still more.

‘So she’s gone,’ he mused, lying down on the cot, having decided to go to sleep without his food. During the thirty years of their married life he had  always felt that she would leave him one day and, at one time, he had even hoped she would. Six years ago, his eldest son Bundu had run away from home because of a more than usually severe beating. Three years later, the younger one, Nuru joined his brother. Since that day, Rahim Khan had felt sure his wife too would run away to her brother’s house. But now that she had gone, he felt unhappy–not sorry , no, for he had never loved his wife–but only uncomfortable, as if a necessary piece of furniture had been removed. With her gone, on whom could he shower the outpourings of an embittered heart?

For thirty years his wife had been both the symbol and the target of all his grievances against his family, against society, against life.

As a youth there had been none in the village to beat him in feats of athletic skill–in wrestling, in kabadi in diving from the canal bridge. He had loved a girl, and wanted to join a touring circus which happened to pass through the village. In the circus, he had felt, lay the key to his ambitions–a career after his own heart–travel-fame. And in Radha, the daughter of Ram Charan, the village banya, he thought he had found this soul-mate. He had first noticed her watching him at a wrestling match and it had been the greatest moment of this life when, standing up after vanquishing his adversary, he had found Radha looking at him with the light of love in her eyes. After that there had been a few brief and furtive meetings when the unlettered but romantic youth had declared his love in passionate though halting words. But his parents had killed both ambitions. Circus work was too lowly and immoral for a respectable peasant. Anyway, his father, grandfather and all his ancestors had tilled the land, so he too had to do it. As for marrying Radha, a Hindu, a Kafir, the very idea was infamous and irreligious.

For some time, Rahim Khan, with youthful resentment, toyed with the idea of open rebellion. But the tradition of centuries of serfdom ran in his blood and, however, indignant he might have felt at his father’s severity, he could not summon enough courage to defy paternal authority and social traditions. After a few days, the circus left the village without Rahim Khan and the furtive romance with Radha too came to an abrupt end. Rahim Khan’s father slyly suggested to Ram Charan that his daughter was now fifteen and ought to have been married long ago, not failing to hint at the disastrous consequences of late marriages. Within a few weeks Radha was married to Ram Lal, a middle-aged, pot-bellied banya of the neighboring village. With a few sad tears shed in the solitude of the night in memory of her hopeless romance with Rahim Khan, she quickly reconciled to her fate and proceeded forthwith to be mother of half-a-dozen children.

Rahim Khan also married. He had, of course, no choice in the matter. His parents selected the girl, fixed the date, ordered some gaudy clothes for him and some silver ornaments for his bride, sat him on a horse, and to the beat of a brass band, took him to the girl’s house where the Nikah was duly preformed. To the Kazi’s formal questions Rahim Khan mechanically nodded his head. Any other course was impossible. Nobody, of course, cared to ask the shy little girl who sat huddled in a dark room only dimly conscious of the fate to which she had been condemned. After the ceremony, Rahim Khan’s father, in a mood of self-congratulation, boasted to his wife: ‘See how meekly he obeyed me. You always feared he might refuse to fall in with our arrangements. I know there youngsters. They apt to be restless if their marriage is delayed. That is why our father’s believed in marrying away their children early. Now he will be all right!’

At that very moment, standing on the threshold of the room where his wife awaited him much as a sheep awaits the butcher, Rahim Khan made a terrible resolve to avenge himself on his parents, his family, on society. He held them all responsible for the frustration of this life’s dreams. And in his confused, illogical mind he regarded his bride as a symbol of this persecution to which he had been subjected. On her he would wreak his vengeance. Iron entered his hitherto kindly soul as he rudely pushed open the door.

That was thirty years ago, Rahim Khan reflected as he lay there on his cot in the dark hut. And hadn’t he had his revenge? For thirty years he had ill-treated his wife, his children and his bullocks, quarrelled with everyone in the village and made himself the most hated person in the community. The thought of being so universally detested gave him grim satisfaction.

No one in the village, of course, understood or tried to understand the reasons for this strange transformation of the cheerful and kind young man into the beast that he had become. At first, their attitude towards him was one of astonished hostility, but later it changed to indifference mingled with fear. Of understanding and sympathy he received none. Shunned by everyone, with a bitterness ever gnawing at his heart, Rahim Khan sought consolation in the unquestioned authority over his wife which society allowed him.

For thirty years his wife had submitted to his persecution with the slave-like docility that is the badge of her tribe. Lately, indeed, she had become so used to corporal chastisement that it seemed unnatural if a whole week passed without beating. To Rahim Khan beating his wife had become a part of his very existence. As sleep gathered round him, his last thought was whether he would be able to endure a life without having an opportunity of indulging in what had now become his second nature. It was perhaps the only moment when Rahim Khan had a feeling, not exactly of affection for his wife, but of loneliness without her. Never before had he realized how much the woman he hated was a part of his life.

When he awoke it was already late forenoon and he started the day by cursing his wife, for it was she who used to wake early every morning. But he was in no great hurry today. Lazily he got up and, after his ablutions, milked the goats for his breakfast which consisted of the remains of the previous day’s chapattis soaked in fresh milk. Then he sat down for a smoke, with his beloved hookah beside him. Now the hut was warm and alight with the rays of the sun streaming in through the open window. In a corner they revealed some cobwebs and, having already decided to absent himself from his fields, he thought he would tidy his hut. Tying some tags to the end of a long pole, he was about to remove the cobwebs when he saw a nest in the thatched roof. Two sparrows were fluttering in and out, twittering constantly.

His first impulse was to wreck the nest with one stroke of his pole, but something within him made him desist. Throwing down the pole, he brought a stool and climbed up on it to get a better view of the sparrows’ home. Two little featherless mites of red-flesh, baby sparrows hardly a day old, lay inside, while their parents hovered round Rahim Khan’s face, screaming threateningly. He barely had a glimpse of the inside of the nest when the mother sparrow attacked him.

Next day he resumed his daily work. Still no one  talked to him in the village. From morning till late in the afternoon he would toil in the field, ploughing the furrow and watering the crops, but he returned home before sunset. Then he would lie on his cot, smoking his hookah and watching with lively interest the antics of the sparrow family. The two little ones had now grown into fine young birds, and he called them Nuru and Bundu after his lost sons whom he had not seen for several years. The four sparrows were his only friends in the world. His neighbours were still frightened of him and regarded his recent peaceful behaviour with suspicion. They were genuinely astonished that for some time no one had seen him beating his bullocks. Nathoo and Chiddoo themselves were very happy and grateful and their bruised bodies had almost healed.

One monsoon evening, when the sky was overcast with threatening clouds, Rahim Khan returned from the fields a little earlier than usual. He found a group of children playing on the road. They ran away as they saw him, and even left their shoes behind in their haste. In vain did Rahim Khan shout, ‘Why are you running away? I am not going to beat you.’ Meanwhile, it had started drizzling and he hurried homewards to tie up the bullocks before the big downpour came.

Entering his hut, Rahim Khan lighted the earthenware oil lamp and placed some crumbs of bread for the sparrows before he prepared his own dinner. ‘O Nuru! O Bundu!’ he shouted, but the sparrows did not come out. Anxious to find out what had happened to his friends, he peered into the nest and found the quartet scared and sitting huddled up within their feathers. At the very spot where the nest lay, the roof was leaking. Rahim Khan took a ladder and went out in he pouring rain to repair the damage. By the time the job was satisfactorily done he was thoroughly drenched. As he sat on the cot, Rahim Khan sneezed, but he did not heed the warning and went to sleep. Next morning he awoke with a high fever.

When the villagers did not see him going to the fields for several days they grew anxious and some of them came to see what the matter was. Through a crack in the door they saw him lying on the cot talking, so they thought, to himself. ‘O Bundu, O Nuru, who will feed you when I am gone?’

The peasants shook their heads sympathetically. ‘Poor fellow,’ they said, ‘he has gone mad. We will send for his wife to look after him.’

Next morning when Rahim Khan’s wife, anxious and weeping, came with her sons, a group of neighbours collected in sympathy. The door was locked from the inside, and in spite of loud knocking no one opened it. When they broke their way in they found the large and gaunt frame Rahim lying in the brooding silence of the room, broken only by the fluttering of four sparrows.

KA Abbas

(7 June 1914 – 1 June 1987)

Indian film director, novelist, screenwriter, and a journalist in the Urdu, Hindi and English languages.

(Story Courtesy: http://web.iiit.ac.in/~nirnimesh/Literature/sparrows.htm)

“పిచ్చుకలు… K A Abbas” కి 3 స్పందనలు

 1. Very informative , and quality telugu contetnts are in your website.If you like to get more traffic for free.Submit your new posts to webtelugu.com
  No need to sign up , just login with your facebook account and start posting your contents on webtelugu . We will also spread your news via facebook and twitter , and also helps you to increase your alexa rank.

  http://www.webtelugu.com/

  Thanks

  మెచ్చుకోండి

 2. అద్భుతమైనా కథనం. మీ అనువాద౦ చాలా బావుంది.

  ఒక మనిషి విపరీత ప్రవర్తనకు పరిస్థితులే కారణం. వివేకం, సంస్కారంతో ఉత్తమ జీవనమార్గం ఎంచుకోవచ్చు, అవిలేక ఇలా పతనమయ్యీ పోవొచ్చు. రచయిత ఆ వ్యక్తి ప్రవర్తన వెనుక ఉన్న పరిస్థితులను చాలా చక్కగా చూపించారు.

  మెచ్చుకోండి

  1. అమ్మా జ్యోతిర్మయీ,
   ఈ కథ ఎంత అద్భుతంగా అబ్బాస్ గారు నడిపించేడంటే, అతని శిల్ప చాతుర్యం మీరు ఎంత విమర్శనాత్మక దృష్టితో చూస్తే అంత బాగా కనిపిస్తుంది. మనిషి సహజంగా మంచివాడే. కాకపోతే పరిస్థితులప్రాబల్యం అతనిలోని చెడ్డగుణాలని ప్రేరేపిస్తుంది. అందుకని కొందరి వ్యక్తుల్లో అకస్మాత్తుగా వచ్చిన మార్పులను చాలా సానుభూతితో అర్థం చేసుకుందికి ప్రయత్నించాలి. పిచ్చుకలు అతనిలో మానవత్వాన్ని తిరిగి ఎలా తిరిగి తట్టిలేపాయో మీరు గమనించవచ్చు.
   ఆశీస్సులతో

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: