రోజు: జూలై 17, 2012
-
మనసే నా సామ్రాజ్యం …ఎడ్వర్డ్ డైయర్, ఇంగ్లీషు కవి
. మనసే నా సామ్రాజ్యం. అక్కడ నాకు ఎంత మహదానందం దొరుకుతుందంటే… దాతలు కనికరించడం వల్లనో, లేక స్వతస్సిద్ధంగానో సృష్టిలో లభించే ఆనందాలన్నీ దాని ముందు దిగదుడుపే. అందరూ కోరుకునేవే నేను కోరుకున్నప్పటికీ నా మనసు అలాంటివి అడక్కూడదని నిషేధిస్తుంది. రాజుల ఆడంబరాలూ, అంతులేని సంపదలూ… యుద్ధంలో జయించడానికి సైన్యాలూ… నా బాధలు ఉపశమించడానికి కపటోపాయాలూ… కళ్ళ తనివి తీరడానికి అందమైన ఆకృతులూ… వీటి వేటికీ నే బానిసని కాలేను. కావలసినవన్నీ నామనసు నాకిస్తుంటే, ఎందుకవి? బాగా…