ప్రేమా – నవ్వూ … రాబర్ట్ బర్న్స్ స్కాటిష్ మహా కవి.

నువ్వు నవ్వితే ప్రపంచం నీతో నవ్వుతుంది;
నువ్వుఏడిస్తే, నువ్వొక్కడివే ఏడవాలి;
ఈ పురాతనమైన నేల సంతోషం ఎరువుతెచ్చుకోవాలి
ఎందుకంటే, దానికి చాలినన్ని దుఃఖాలు దానికి ఉన్నాయి;

గొంతెత్తి పాడిచూడు, కొండలు ప్రతిధ్వనిస్తాయి,
అదే నిట్టూర్పు విడిచి చూడు, గాలిలో కలిసిపోతుంది.
ప్రతిధ్వనికూడా, ఆనందాన్ని సంతోషంగా నినదిస్తుంది
ఆలనాపాలనా చెప్పాలంటేనే, నోరుమెదపదు.

నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు ఉంటారు స్నేహితులు మెండు;
అదే దుఃఖిస్తూ ఉండు, ఒక్కడు ఓదార్చేవాడుండడు;
మధురమైన మదిరని పంచుతాను అను, వద్దనేవాడుండడు;
కన్నీళ్ళు దిగమింగుకోవాల్సివస్తే, ఒట్టుకి ఒక్కడుండడు తోడు.

ఆనందోత్సాహాల మేళాలలో
బారులుతీరిమరీ మనుషులు నిల్చుంటారు
బాధల గడప నడవలోనుండి మాత్రం
ఒకరి వెంట ఒకరు నెమ్మదిగా జారుకుంటారు

విందు చెయ్యి, మనుషులు కిక్కిరిసిపోతారు
ఉపవాసం చెయ్యి, ప్రపంచం పక్కనుంచి పట్టనట్టుపోతుంది;
బాగుపడి, పంచుకో…  ప్రపంచం నిను బతకనిస్తుంది
అదే చస్తున్నాను మొర్రో అను, ఏమాత్రం చేయూత అందించదు

ఉల్లాసంగా ఉండు… మనుషులు నీ స్నేహం కోరుకుంటారు
బాధలలో ఉండు, ముఖం చాటేస్తారు
అందరికీ నీ ఆనందంలో సమపాలు కావాలి
ఎవ్వరికీ నీ కష్టంలో వాటా అక్కరలేదు.

.

రాబర్ట్ బర్న్స్

స్కాటిష్ మహా కవి

.

Robert_Burns
Robert_Burns (Photo credit: Wikipedia)

.
Love and Laughter.
.
Laugh, and the world laughs with you;
Weep, and you weep alone;
This grand old earth must borrow its mirth,
It has troubles enough of its own.
Sing, and the hills will answer;
Sigh, it is lost on the air;
The echoes bound to a joyful sound
But shrink from voicing care.
Be glad, and your friends are many;
Be sad, and you lose them all;
There are none to decline your nectared wine,
But alone you must drink life’s gall.
.
There is room in the halls of pleasure
For a long and lordly train,
But one by one we must all file on
Through the narrow aisles of pain.
Feast, and your halls are crowded ;
Fast, and the world goes by;
Succeed and give, ’twill help you live;
But no one can help you die.
Rejoice, and men will seek you;
Grieve, and they turn and go
They want full measure of all your pleasure.
But they do not want your woe !
.
Robert Burns

“ప్రేమా – నవ్వూ … రాబర్ట్ బర్న్స్ స్కాటిష్ మహా కవి.” కి 6 స్పందనలు

 1. బాధలలో ఉండు, ముఖం చాటేస్తారు
  అందరికీ నీ ఆనందంలో సమపాలు కావాలి
  ఎవ్వరికీ నీ కష్టంలో వాటా అక్కరలేదు.

  లోకరీతి ఇంతే! ఆ కష్టంలో పాలు పంచుకునేవాడే అసలైన స్నేహితుడు.

  మెచ్చుకోండి

  1. శర్మగారూ,
   భాషలో, భావనలో కొంతమంది ప్రాచీన ఆంగ్లకవుల కవితలు భారతీయ తత్త్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. భారతీయతతో ఆంగ్లేయులకు వ్యాపార సంబంధాలే గాక సాహిత్యపరమైన ఇచ్చిపుచ్చుకోడాలున్నాయేమో నని అనిపిస్తుంటుంది. అప్పట్లో ఇంగ్లీషు సాహిత్య భాషగా నిలదొక్కుకుంటే, గ్రీకు లాటిను భాషలే ఎక్కువగా బోధనా భాషగా వాడబడుతుండేవి. పెద్దవాళ్ళెవరైనా దీనిగురించి పరిశోధించి (ఇంతకుముందే చేసి ఉంటే మరీ మంచిది) తెలిపితే బాగుంటుంది.
   అభివాదములతో

   మెచ్చుకోండి

 2. చిన్న చిన్న విషయాలు ఎంత గొప్పగా,చక్కగా చెప్పారో, ఎప్పటికి అవి స్థిరంగానే వుండిపోతాయేమో,
  కవి కాలాన్ని చెప్పలేదు ఈ సారి,
  yesterday i posted my translation,
  thanking you sir.

  మెచ్చుకోండి

  1. భాస్కర్ గారూ,
   మీరన్న మాట నిజం. ఇంతకుముందు రాబర్ట్ బర్న్స్ కవితలు పోస్టుచేశాను గదా అని ఇవ్వలేదు.
   మీ బ్లాగులో కవితలు చూసేను. అక్కడ నా కామెంటు కూడా వ్రాసేను.
   అభివాదములతో

   మెచ్చుకోండి

 3. ఆవేదనాభరిత సందేశం….

  మెచ్చుకోండి

 4. అమ్మా జ్యోతిర్మయీ,
  నిజం. కానీ నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. “శ్రీగలభాగ్యశాలికడజేరగ వత్తురు తారు దారె దూరాగమనప్రయాసమునకోర్చియునైన” అని భాస్కర శతకకారుడు మారవి వెంకయ్యా, “ఎప్పుడు సంపదగల్గిన అప్పుడె చుట్టములు వత్తురది యెట్లన్నన్ కుప్పలుగ చెఱువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా” అని సుమతీ శతకకారుడు బద్దెనా, ఏనాడో చెప్పినదే.
  ఆశీస్సులతో

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: