అనువాదలహరి

ప్రేమా – నవ్వూ … రాబర్ట్ బర్న్స్ స్కాటిష్ మహా కవి.

నువ్వు నవ్వితే ప్రపంచం నీతో నవ్వుతుంది;
నువ్వుఏడిస్తే, నువ్వొక్కడివే ఏడవాలి;
ఈ పురాతనమైన నేల సంతోషం ఎరువుతెచ్చుకోవాలి
ఎందుకంటే, దానికి చాలినన్ని దుఃఖాలు దానికి ఉన్నాయి;

గొంతెత్తి పాడిచూడు, కొండలు ప్రతిధ్వనిస్తాయి,
అదే నిట్టూర్పు విడిచి చూడు, గాలిలో కలిసిపోతుంది.
ప్రతిధ్వనికూడా, ఆనందాన్ని సంతోషంగా నినదిస్తుంది
ఆలనాపాలనా చెప్పాలంటేనే, నోరుమెదపదు.

నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు ఉంటారు స్నేహితులు మెండు;
అదే దుఃఖిస్తూ ఉండు, ఒక్కడు ఓదార్చేవాడుండడు;
మధురమైన మదిరని పంచుతాను అను, వద్దనేవాడుండడు;
కన్నీళ్ళు దిగమింగుకోవాల్సివస్తే, ఒట్టుకి ఒక్కడుండడు తోడు.

ఆనందోత్సాహాల మేళాలలో
బారులుతీరిమరీ మనుషులు నిల్చుంటారు
బాధల గడప నడవలోనుండి మాత్రం
ఒకరి వెంట ఒకరు నెమ్మదిగా జారుకుంటారు

విందు చెయ్యి, మనుషులు కిక్కిరిసిపోతారు
ఉపవాసం చెయ్యి, ప్రపంచం పక్కనుంచి పట్టనట్టుపోతుంది;
బాగుపడి, పంచుకో…  ప్రపంచం నిను బతకనిస్తుంది
అదే చస్తున్నాను మొర్రో అను, ఏమాత్రం చేయూత అందించదు

ఉల్లాసంగా ఉండు… మనుషులు నీ స్నేహం కోరుకుంటారు
బాధలలో ఉండు, ముఖం చాటేస్తారు
అందరికీ నీ ఆనందంలో సమపాలు కావాలి
ఎవ్వరికీ నీ కష్టంలో వాటా అక్కరలేదు.

.

రాబర్ట్ బర్న్స్

స్కాటిష్ మహా కవి

.

Robert_Burns
Robert_Burns (Photo credit: Wikipedia)

.
Love and Laughter.
.
Laugh, and the world laughs with you;
Weep, and you weep alone;
This grand old earth must borrow its mirth,
It has troubles enough of its own.
Sing, and the hills will answer;
Sigh, it is lost on the air;
The echoes bound to a joyful sound
But shrink from voicing care.
Be glad, and your friends are many;
Be sad, and you lose them all;
There are none to decline your nectared wine,
But alone you must drink life’s gall.
.
There is room in the halls of pleasure
For a long and lordly train,
But one by one we must all file on
Through the narrow aisles of pain.
Feast, and your halls are crowded ;
Fast, and the world goes by;
Succeed and give, ’twill help you live;
But no one can help you die.
Rejoice, and men will seek you;
Grieve, and they turn and go
They want full measure of all your pleasure.
But they do not want your woe !
.
Robert Burns

%d bloggers like this: