అనువాదలహరి

ఓ నావికుడా! నా నాయకుడా! … వాల్ట్ వ్హిట్మన్

O Captain! My Captain!
O Captain! My Captain! (Photo credit: jfortugaleza)

ఓ నావికుడా! నా నాయకుడా!
మన భయంకర ప్రయాణం ముగిసింది.
మన ఓడ ప్రతి ప్రమాదాన్నీ తట్టుకుని నిలబడింది,
మనం లక్ష్యాన్ని సాధించగలిగాం
అదిగో, రేవు సమీపిస్తోంది, గంటలు వినబడుతున్నై
ప్రజలు ఉత్సాహంతో ఉరకలువేస్తున్నారు,
సాహసయాత్రముగించిన ఈ నౌక నిలకడగా లంగరు వేస్తుంటే
అందరికళ్ళూ దాని మీదే, మౌనంగా, విచారంగా…
అయ్యో నా హృదయమా! హృదయమా! హృదయమా!
నా నాయకుడు ఈ డెక్ మీద
రాలిపోయాడు… శరీరం చల్లబడి, నిశ్చైతన్యమై
రక్తం బొట్లు బొట్లుగా కారుతూనే ఉంది.

ఓ నాయకుడా! నా నావికుడా! లే! ఆ గంటలు ఒక్కసారి విను!
ఒక్క సారి లే! నీకోసం జండా విసురుతున్నారు పట్టుకో!
నీ కోసమే మేళాలు మధురంగా మ్రోగుతున్నాయి;
ఆ పూలదండలూ, అలంకరించిన మాలలూ నీ కోసమే,
నీ కోసమే తీరం తీరం అంతా జనసమ్మర్దమౌతోంది
నీ కోసమే ప్రజలంతా నిరీక్షిస్తూ, నీ పేరే జపిస్తున్నారు
అయ్యో మా తండ్రీ!
నీ తలక్రింద నా చెయ్యి ఉంచనీ
ఇక్కడ నీ కల సాకారమై ఎదురుచూస్తోంది
నువ్వుమాత్రం కూలబడిపోయావు, గతాసువువై.

నా నాయకుడిక పలకడు; అతనిపెదాలు వివర్ణమై, మెదలవు;
నా తండ్రికి నా మోచెయిస్పర్శతెలీదు; అతనికి నాడీలేదు, ఇచ్ఛాలేదు.
ఈ నౌక క్షేమంగా, నిర్భయంగా లంగరువేయబడింది.
దాని యాత్ర సమర్థవంతంగా పరిసమాప్తమయింది.
ప్రమాదభరితమైన యాత్ర చేసి, లక్ష్యం సాధించి, విజయంతో తిరిగివచ్చింది.
సమస్త తీరాల్లారా! హర్షధ్వానాలు చెయ్యండి!
సమస్త ఘంటికల్లారా! నిర్విరామంగా మ్రోగండి!
నేను, శోకంతో అడుగులేస్తూ నా కడపటి వందనం చెల్లిస్తాను
నా నాయకుడు డెక్ మీద శయనిస్తున్నాడు
ఉపహతుడై కూలబడిపోయాడు…నిర్జీవంగా.

.

Walt Whitman's use of free verse became apprec...
Walt Whitman’s use of free verse became appreciated by composers seeking a more fluid approach to setting text. (Photo credit: Wikipedia)

వాల్ట్ వ్హిట్మన్

(May 31, 1819 – March 26, 1892)

.

(అమెరికన్ సివిల్ వార్ నేపథ్యం లో ప్రతీకాత్మకంగా వ్రాసిన అద్భుతమైన కవిత ఇది. ఈ కవితలో   చెప్పిననాయకుడు… టెక్సాస్ లో నిహతుడైన అమెరికను ప్రెసిడెంటు అబ్రహాం లింకన్; పడవ… అమెరికా; ఉతర దక్షిణ రాష్ట్రాలమధ్య జరిగిన యుద్ధానికి బానిసత్వ నిర్మూలన ముఖ్యమైన విషయం. మీరు Dead Poets Society అన్న సినిమా చూసి ఉండకపోతే తప్పకుండా చూడండి. పిల్లలకి కవిత్వాన్ని ఎలా బోధించాలన్న ప్రధాన సమస్య దాని నేపధ్యం. ఈ కవితని హీరో అనేక సార్లు ఉటంకిస్తాడు. దాని ఔచిత్యం మీకు సినిమా ముగింపులో బోధపడుతుంది.

విడిగా కూడ ఇది చాలా భావోద్వేగాన్ని కలిగించే కవిత. అన్ని దేశాలలోనూ, అనేక సందర్భాలలోనూ విజయాన్ని అందించి దాన్ని చూసే తరుణంలో సజీవులై ఉండని వ్యక్తులు మనకి కనిపిస్తుంటారు. అంతెందుకు… చాలా కుటుంబాలలో తల్లిదండ్రులలో ఎవరో ఒకరు (కనీసం) ఈ  కోవకు చెందిన వారే.)

.

O Captain! My Captain!

.

O Captain! My Captain! Our fearful trip is done;
The ship has weather’d every rack, the prize we sought is won;
The port is near, the bells I hear, the people all exulting,
While follow eyes the steady keel, the vessel grim and daring:
But O heart! heart! heart!
O the bleeding drops of red,
Where on the deck my Captain lies,
Fallen cold and dead.

O Captain! my Captain! rise up and hear the bells;
Rise up–for you the flag is flung–for you the bugle trills;
For you bouquets and ribbon’d wreaths–for you the shores a-crowding;
For you they call, the swaying mass, their eager faces turning;
Here Captain! dear father!
This arm beneath your head;
It is some dream that on the deck,
You’ve fallen cold and dead.

My Captain does not answer, his lips are pale and still;
My father does not feel my arm, he has no pulse nor will;
The ship is anchor’d safe and sound, its voyage closed and done;
From fearful trip, the victor ship, comes in with object won;
Exult, O shores, and ring, O bells!
But I, with mournful tread,
Walk the deck my Captain lies,
Fallen cold and dead.
.

Walt Whitman

(May 31, 1819 – March 26, 1892)

Whitman's O Captain! My Captain!
Whitman’s O Captain! My Captain! (Photo credit: Wikipedia)
%d bloggers like this: