అనగా అనగా ఒకప్పుడు … గాబ్రియేల్ ఒకారా, నైజీరియన్ కవి

(నా ఈ 400వ టపా సందర్భంగా సాహితీ మిత్రులకీ, నా బ్లాగు అభిమానులందరికీ  కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అపూర్వమైన కవిత అనువాదాన్ని మీ ముందు ఉంచుతున్నాను. 1975 ప్రాంతాల్లో The Hindu లో ఒక సారి చదివాను. అప్పటినుండీ ఇది నా మనసులో నాటుకు పోయింది. అప్పట్లో అంత సాహిత్యవ్యాసంగం లేకపోవడంవల్ల కవి పేరూ గుర్తు పెట్టుకోలేదు, కవితా గుర్తులేదు. ఆఫ్రికన్ కవి అని తెలుసు. అందులో “సందర్భానికి తగ్గ ముఖాలు” అన్న విషయం లీలా మాత్రంగా గుర్తుంది.  నెట్ లో దీన్ని వెతకగా వెతకగా మొన్న దొరికింది. ఎంత ఆనందం వేసిందో.  మీకు కూడా నచ్చుతుందనే నా నమ్మకం.

గమ్మత్తుగా నిన్న కువైటీ కవయిత్రి ఫతిమా అల్ మతార్ కవిత కూడా భిన్నమైన ముఖాలుగురించే. ఈ ఇద్దరు కవులూ మనలోని ఆత్మవంచనాగుణం జీవితాన్ని సింహావలోకనం చేసుకుంటున్నప్పుడు ఎలా బాధిస్తుందో చాలా గొప్పగా చిత్రించేరు. మనకు తెలియకుండానే మనం పరిస్థితులకి ఎలా బానిసలం అయిపోతామో తెలియజేస్తాయీ కవితలు. ఇందులో భాషా, భావనా, శైలీ చాల మంది తర్వాత అనుకరించారు.)

.

ఒరే నాన్నా! ఒకప్పుడు
మనుషులు మనసారా నవ్వేవారు,
వాళ్ళ కళ్ళలో నవ్వు కనిపించేది;
ఇప్పుడు కేవలం పలువరసతోనే నవ్వుతున్నారు.
మంచుగడ్డలా ఏ భావమూలేని చూపులు చూస్తూ
అంతలోనే నా నీడవెనక ఏముందా అని వెతుకుతూ…

ఒకప్పుడు నిజంగా హృదయపూర్వకంగా
చేతులు కలిపే వారు;
నాన్నా! ఆ రోజులు వెళ్ళిపోయాయిరా.
ఇప్పుడు ఒకపక్క అయిష్టంగానే చేతులు కలుపుతూ,
మరొక పక్క నా ఖాళీ జేబులో
ఏముందా అని తణువుతుంటారు.

“ఇది మీ ఇల్లే అనుకొండి”
“మరోసారి తీరికచేసుకుని రండి” అని చెప్పి
మొహమాటానికి ఒక సారో, రెండు సార్లో వెళితే
ఇక మూడోసారి ఉండదు.  నాముఖం మీదే
భళ్ళున తలుపేసుకుంటారు.

అందుకని నేను చాలా విషయాలు నేర్చుకున్నానురా, నాన్నా!
సందర్భానికి తగ్గ బట్టలు తొడుక్కుంటున్నట్లు, నేను కూడా
ముఖాలు తొడుక్కోడం నేర్చుకున్నాను… ఇంట్లో ఒక ముఖం,
ఆఫీసుకొకటీ, వీధికోసం ఇంకొకటీ, గృహస్థుగా మరొకటీ,
పార్టీలకొకటీ; వాటితో పాటే, ఫొటోలోని చెదరని నవ్వులా
సందర్భానికి తగ్గ నవ్వుని కూడా అతికించుకోడం నేర్చుకున్నా.

నేను కూడా  నేర్చుకున్నాను…
నా దంతాలతో నవ్వడమూ,
మనస్కరించకపోయినా చేతులు కలపడమూను.
నేను కూడ “పీడవదిలింది” అనుకున్నప్పుడు
“సంతోషం, తప్పకుండా మళ్ళీ కలుసుకుందాం” అనడం;
ఏమాత్రం సంతోషం లేకపోయినా,
“మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది” అనడం;
బాగా విసుగెత్తిపోయినా,”మీతో మాటాడ్డం ఎంతో బాగుంది” అనడం.

కానీ, నను నమ్మరా తండ్రీ!
నాకు కూడ నీలా ఉన్నప్పుడు నేనెలా ఉండేవాడినో
అలాగే ఉండాలని ఉంది.
నాకు ఈ బోలుమాటలు మరిచిపోవాలని ఉంది.
అన్నిటికంటే ముఖ్యంగా నేను
మనసారా నవ్వడం తిరిగి నేర్చుకోవాలి.
నవ్వుతుంటే అద్దంలో నా పళ్ళు
పాముకోరల్లా కనిపిస్తున్నాయి.

నాన్నా! నాకు ఎలా నవ్వాలో చూపించరా!
ఒకప్పుడు, నేను నీలా ఉండే రోజుల్లో
ఎలా ముసిముసి నవ్వులు నవ్వేవాడినో
అలా నవ్వడం చూపించు.

.

గాబ్రియేల్ ఒకారా

.

Image Courtesy: http://thehenrybrothers.wordpress.com/

Gabriel Okara

Once Upon a Time
.

Once upon a time, son,
they used to laugh with their hearts
and laugh with their eyes:
but now they only laugh with their teeth,
while their ice-block-cold eyes
search behind my shadow.

There was a time indeed
they used to shake hands with their hearts:
but that’s gone, son.
Now they shake hands without hearts
while their left hands search
my empty pockets.

‘Feel at home!’ ‘Come again’:
they say, and when I come
again and feel
at home, once, twice,
there will be no thrice
for then I find doors shut on me.

So I have learned many things, son.
I have learned to wear many faces
like dresses – homeface,
office-face, street-face, host-face,
cocktail-face, with all their conforming smiles
like a fixed portrait smile.

And I have learned too
to laugh with only my teeth
and shake hands without my heart.
I have also learned to say,’Goodbye’,
when I mean ‘Good-riddance’:
to say ‘Glad to meet you’,
without being glad; and to say ‘It’s been
nice talking to you’, after being bored.

But believe me, son.
I want to be what I used to be
when I was like you. I want
to unlearn all these muting things.
Most of all, I want to relearn
how to laugh, for my laugh in the mirror
shows only my teeth like a snake’s bare fangs!

So show me, son,
how to laugh; show me how
I used to laugh and smile
once upon a time when I was like you.

Gabriel Okara.

Nigerian Poet

Photo and Poem Courtesy:

Link to

“అనగా అనగా ఒకప్పుడు … గాబ్రియేల్ ఒకారా, నైజీరియన్ కవి” కి 9 స్పందనలు

  1. మనిషి మనస్తత్వాన్ని,
    మన దోసిల్లలో నింపి,
    తాగించినట్లుంది.
    thank you sir.

    మెచ్చుకోండి

  2. భాస్కర్ గారూ,
    మనిషి ఎలా ప్రవర్తించినా బుద్ధిజీవి గనక ఎప్పుడో ఒకప్పుడు తన ప్రవర్తనని సింహావలోకనం చేసుకోకపోడు. నిజాయితీగా తనని తాను తన విలువలపరిథిలో మూల్యాంకనం చేసుకుంటున్నప్పుడు తనప్రవర్తన, అందులోని లోపాలూ తెలియకపోవు. బాల్యం ఎప్పుడూ అందమైనదే. ఒకరు మప్పితే తప్ప బాల్యం విడిచిపెట్టేదాకా మననిజాయితీ మనలని వీడదు. అందుకే అందరికీ బాల్యం ఒక నాస్టాల్జియా.
    అభివాదములతో

    మెచ్చుకోండి

  3. కర్లపాలెం హనుమంత రావు Avatar
    కర్లపాలెం హనుమంత రావు

    అవును మూర్తి గారూ! నిన్న ముఖాన్ని గురించే..ఈ రోజూ ముఖాన్ని గురించే! కానీ ఎవరి ముఖం వారిదేగా! రెండు కవితలూ…బాగున్నాయి.నేటి సందర్భానికి అతికినట్లుగా కూడా వున్నాయి.ఈ రొజు కవిత అనువాదం మరింత సరళంగా సాగి మరింత హృదయానికి ఎక్కువగా హత్తుకుంది.400 టపాలు పూర్తి చేసిన సందర్భంగా అభినందనలు.

    మెచ్చుకోండి

    1. హనుమంతరావు గారూ,
      చాలా బాగా అన్నారు. ఎవరి ముఖం వారిదే. కాకపోతే, ఎవరికివారికి తమకున్న ముఖాన్ని చూపించడంకంటే, తమకి కావలసిన ముఖం చూపించడంలో ఆసక్తి ఎక్కువ ఉంటుంది. అందుకే లేని ముఖాన్ని చూపించడానికి తాపత్రయం. మీ అభినందనలకు నా నమోవాకాలు.
      అభివాదములతో

      మెచ్చుకోండి

  4. How true! Beautiful poem!

    Congratulations on your 400th post Murthy garu! Wish to see many more from you! 🙂

    మెచ్చుకోండి

    1. Thank You Madhuravani. The poem was really haunting me for long. First time when I read it, I was so impressed that I immediately copied it on to my diary. I could not race the diary. I felt so happy when I could trace it the other day on the net. That was like meeting a childhood friend in old age. I just wated to post it to share my pleasure. Thank you once again,
      with very best wishes

      మెచ్చుకోండి

  5. రోజూ ఇన్ని మొహాల్ని మార్చి…మార్చి…
    కొక్కేన ఉన్న నా అసలు మొహం మర్చి…

    వెదుకుతుంటే…

    ఇదేమిటి ఈయనెవరో నా మనసంతా తెలిసినట్లుగా
    నాలో నేను దాచుకున్న విషయాలన్నింటిని ఇలా ఏకరువు పెట్టేశాడు?

    (ఇకపై జాగ్రత్తగా వుండాలి…
    మన విషయాలు లోనే ఉండాలి కదా…)

    ఇది ఓ సగటు సహేతుక వ్యక్తి అంతరంగం…
    చదివాక మీకు కలిగినంతగా నాకూ ఆనందం…
    కృతజ్ఞతలు…

    hearty congrats on your 400 th post…
    wishing to see many many more till i breathe last…

    మెచ్చుకోండి

  6. రావుగారూ,
    మీ వ్యాఖ్య చదివేక నాకు మనసు ఆర్ద్రమైంది. భగవంతుడు మీకు పరిపూర్ణ ఆయురారోగ్యాలివ్వాలని కోరుకుంటున్నాను.
    ఇప్పటికి 1000 అనువాదాలు పైగా చెయ్యగలిగాను అంటే, అదంతా మీలాంటి మిత్రుల ప్రోత్సాహం వల్లనే.
    హృదయపూర్వక అభివాదములతో.

    మెచ్చుకోండి

  7. సర్…

    మీ మనఃపూర్వక ఆశీస్సులకు
    కృతజ్ఞతాపూర్వక నమస్సులు…

    చర్వితచర్వణమౌతుందని
    తటపటాయిస్తున్నాను గానీ…
    ఇంత అద్భుతమైన అనువాదాలను
    నేను ఇంతవరకు చూడలేదు…
    నాకుగా ఇంగ్లీష్ గానీ తెలుగు గానీ
    పాండిత్య పరంగా లోతైన జ్ఞానం తక్కువ.
    ఏదో చిన్నప్పట్నుంచి చదివిన తెలుగు,
    ఇంగ్లీష్ నవలలు – సినిమాలే ఈ మాత్రపు
    విషయ జ్ఞానం.

    మీ అనువాదం చదివిన తరువాత కూడా
    ఇంగ్లీష్ మాతృక లోని ఆత్మను పట్టుకోవడం
    నాకు కష్టమైన ప్రక్రియగానే మిగులుతోంది…
    భాష మీద పెద్దగా పట్టు లేకపోవడంగా…

    కానీ…
    ఆ ఆత్మను మీరు అంత చాకచక్యంగా
    ప్రస్పురింపజేయడం ఎంతో గొప్పగా…
    ఎంతలా అంటే…
    ఆ ఇంగ్లీష్ పదాలలో ఇంత మాధుర్యం
    దాగి ఉందన్న విషయం, కేవలం
    మీ వెర్షన్ చూసిన తర్వాతే అర్ధమౌతోంది…

    ఖచ్చితంగా నేను గానీ డైరెక్ట్ గా గానీ
    ఈ ఇంగ్లీష్ కవితలు చదివితే…
    ఎప్పటికీ…
    ఎప్పటికీ…
    ఆ సుందరమైన కవితల హృదయాలను
    ఆ మాధుర్యాన్ని…
    కనుగొనలేను…

    నాలాంటి వారికి
    ప్రపంచ సాహిత్యాన్నీ…
    ప్రాపంచిక జ్ఞానాన్నీ…
    ప్రసాదిస్తున్న మీకు…
    మరొక్కమారు వందనం…

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: