రోజు: జూలై 10, 2012
-
వంశప్రతిష్టలూ- అధికారముద్రలూ… జేమ్స్ షర్లీ, ఇంగ్లీషు నాటక కర్త.
మన వంశప్రతిష్టలూ, అధికారముద్రలూ ఎంతగొప్పవైనా అవికేవలం ఛాయామాత్రమే, అల్పమైనవే. విధినితప్పించుకోగల కవచం ఏదీ లేదు. మృత్యువు తన శీతలహస్తాన్ని మహరాజులమీదనైనా వెయ్యగలదు. రాజదండాలూ, అపురూపమైన కిరీటాలూ నేలకు ఒరిగిపోవలసిందే. పలుగు పారలతో మట్టిలోకప్పబడి అన్నిటితో సరిసమానంగా దొర్లవలసిందే . కొంతమంది శౌర్యవంతులు కదనరంగంలో శతృసంహారంచేసి కొత్తచరిత్ర లిఖించవచ్చు. అయినా, వాళ్ళ భుజబలాలు లొంగవలసిందే. కొంతకాలం ఎదిరించవచ్చేమోగాని ముందో వెనకో విధికి దాసోహమనక తప్పదు. రక్తహీనులై, మృత్యువుకి తలవంచినపుడు, వాళ్ల ఊపిరి కూడా సమర్పించవలసిందే. . నీ నుదిటిమీది […]