
కాకుల కా, కా, లతో పక్షుల కిలకిలలతో
ఈ చిట్టడవి సన్నటి ఈ నీరెండలో ఆహ్లాదంగా ఉంది.
దూరాన చర్చిలోనుండి ప్రార్థన తేలివస్తోంది
కాని వాళ్ళు చిత్తమొచ్చినరీతిలో అది పాడుతున్నారు
మేఘాలసందులలోనుండి జాలువారుతున్న బంగారు కిరణాలు
సరసుమీది నునుతరగలపై తళతళలాడుతున్నాయి
ఈ శిలలు కూడా ఒకదానికొకటి తమసామీప్యతకు
సంతసిస్తున్నట్టు కనిపిస్తున్నాయి
మరొకసారి నా మనసు ఉప్పొంగి ఉరకలేస్తూ
ఆనందంతో పరవశిస్తోంది
వెలుగునీడలు చేతి వేళ్లలా
నా స్వరతంత్రులను మీటుతున్నాయి
ప్రియతమా! నా ఊహగతాన్ని చిత్రిస్తోంది…
క్రిందటిసారి నువ్వు ఇక్కడ ఉన్నావే… ఆ రోజుని.
ఆ రోజు ఆకులుకూడా కదలని శీతగాలిలో
వేగంగా కదిలే స్కేటింగ్ బూట్ల చప్పుడుతో
ఈ సరస్సు మారుమోగింది
నువ్వు నామీదకి ఒరిగావు, నేను నీమీదకి ఒరిగేను
మన కేళి అపశృతులులేకుండా గాలిలోతేలినట్లు సాగింది.
ఒకసారి ఎడమపాదంతో, మరోసారి కుడిపాదంతో
జారుతూ మనం ఎన్నో వలయాలు తిరిగాము.
మనలాగే విహరిస్తున్న మనుషులమధ్యలోంచి
మనం ఊయలలా సాగిపోయాము
నువ్వు నా చెయ్యి గట్టిగా పట్టుకున్నావు
మనం చదునుగా ఉన్న మంచు మెరిసేదాకా,
గుంపులుగా మనుషులు వెళిపోయేదాకా ఆడేము
హంసలు విహరించే ఆ సరస్సు సాక్షిగా
అదిగో, ప్రశాంతంగా ఉన్న ఆ కొండ సాక్షిగా చెబుతున్నా:
ఆ రోజు మనిద్దరం ప్రేమలోపడి ఉంటే
ఓహ్! ఈపాటికి ప్రేమలో మునిగిపోయి ఉండేవాళ్ళం
.
Note: డడింగ్స్టన్ స్కాట్లండులో ఎడింబరో కి తూర్పుగా ఉండే ఒక గ్రామం

రాబర్ట్ లూయీ స్టీవెన్సన్
(13 November 1850 – 3 December 1894)
స్కాటిష్ కవి, నవల రచయితా, వ్యాసకర్త.
.
Duddingstone – By Robert Louis Stevenson
With caws and chirrupings, the woods
In this thin sun rejoice.
The Psalm seems but the little kirk
That sings with its own voice.
The cloud-rifts share their amber light
With the surface of the mere –
I think the very stones are glad
To feel each other near.
Once more my whole heart leaps and swells
And gushes o’er with glee;
The fingers of the sun and shade
Touch music stops in me.
Now fancy paints that bygone day
When you were here, my fair –
The whole lake rang with rapid skates
In the windless winter air.
You leaned to me, I leaned to you,
Our course was smooth as flight –
We steered – a heel-touch to the left,
A heel-touch to the right.
We swung our way through flying men,
Your hand lay fast in mine:
We saw the shifting crowd dispart,
The level ice-reach shine.
I swear by yon swan-travelled lake,
By yon calm hill above,
I swear had we been drowned that day
We had been drowned in love.
.
Robert Louis Stevenson
(13 November 1850 – 3 December 1894)
Scottish novelist, poet, essayist, and travel writer.
Related articles
- Don’t judge each day by the harvest you reap, but by the seeds you plant. Robert Louis Stevenson #quote #inspiration #taolife (the1minuteblogger.wordpress.com)
- Life is not a matter of having good cards, but of playing a poor hand well. Robert Louis Stevenson #quote #inspiration #taolife (the1minuteblogger.wordpress.com)
- Editor’s Choice: Robert Louis Stevenson’s works donated to National Library of Scotland and Napier University (dailyrecord.co.uk)
స్పందించండి