అనువాదలహరి

మైక్రోస్కోప్ లో … మిరొస్లావ్ హోబ్, చెక్ కవి

.

ఇక్కడకూడా మతిపోగొట్టే సుందర దృశ్యాలూ,

చంద్రోపరితలాలూ, నీరవ ప్రదేశాలూ ఉన్నాయి.

ఇక్కడకూడా జీవకణాలూ,

సేద్యగాళ్ళూ, తమజీవితాన్ని తృణప్రాయంగా త్యజించగల

యోధులైన కణాలూ ఉన్నాయి.

ఇక్కడకూడా సమాధులూ,

కీర్తిప్రతిష్టలూ, గుర్తింపులేకపోడాలూ ఉన్నాయి.

వ్యవస్థలమీద తిరుగుబాటు గూర్చి

నేను గొణుగుడు వింటున్నాను

.

మిరొస్లావ్ హోబ్,

చెక్ కవి,  వ్యాధినిరోధశాస్త్రజ్ఞుడు

(13 September 1923 – 14 July 1998)

.

In the Microscope

Here too are the dreaming landscapes,
lunar, derelict.
Here too are the masses,
tillers of the soil.
And cells, fighters
who lay down their lives for a song.

Here too are cemeteries,
fame and snow.
And I hear the murmuring,
the revolt of immense estates.

Miroslav Holub

(13 September 1923 – 14 July 1998)

Holub is one of the foremost Czech poets of the 20th century (and of Europe) and a reputed Immunologist.He has 10 volumes of poetry to his credit.

His poems frequently deal with the grim realities of life and are written with scientific exactitude. He is widely translated (into more than 30 languages).


4 thoughts on “మైక్రోస్కోప్ లో … మిరొస్లావ్ హోబ్, చెక్ కవి”

  1. భాస్కర్ గారూ,
   మనిషికి భగవంతుడిమీద అంత గాఢమైన నమ్మకం కలగడానికి, ఈ సృష్టిలో ని ప్రతి వస్తువులోనూ ఉన్న చిత్రమైన order, అది Macrocosmలో ఎలా ఉంటుందో microcosmలో కూడా అంత నిర్దుష్టంగానూ ఉండడమే. ముందు ఆయా పనులు చక్కబెట్టె కణాలేమిటో రాద్దామనుకున్నానుగాని, మళ్ళీ అది అక్కరలేని ప్రయాస. కవిత్వం ఇచ్చే స్పందనకు ఆ సమాచారం ఏమీ దోహదంచెయ్యదని ఊరుకున్నాను.
   అభివాదములతో

   మెచ్చుకోండి

 1. సూక్ష్మంలో…బ్రహ్మాండంలో సైతం ఒకే విధమయిన క్రమాన్ని పాటించిన ఆ అజ్ఞాత శక్తి కి చెక్ కవి పట్టిన కవితాహారతి మీ అనువాదం న్యాయం చేసింది మూర్తి గారూ! ఒక మంచి కవిత పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. హనుమంత రావు గారూ,
  నా బ్లాగుకి స్వాగతం. మిరొస్లావ్ హోబ్ ఒక శాస్త్రజ్ఞుడు. సాధారణంగా శాస్త్రానికీ కవిత్వానికీ సగమెరుక. ఎందుకంటే శాస్త్రవిజ్ఞానం కేవలం హేతువు ఆధారంగా నడుస్తుంది. కవిత్వం ఆవేశం ఆధారంగా నడుస్తుంది. అయితే, ఇతను తన పరిశోధనలనీ, కవిత్వాన్నీ ఒక తాటిమీద నడిపించగలిగేడు. 10 కవితా సంపుటులే దానికి నిదర్శనం. మనిషి తలుచుకుంటే తనకు నైపుణ్యం ఉన్న విషయంలో కవితా వస్తువుని సందర్శించగలడని నిరూపించేడీయన.
  అభివాదములతో

  మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: