అనువాదలహరి

నాన్న జ్ఞాపకం … యెహుదా అమిఖాయ్, ఇజ్రాయిలీ కవి.

మా నాన్న జ్ఞాపకం,  పనిచేసేచోట తినడానికి

పొట్లంలో పట్టికెళ్ళే సాండ్ విచ్ లు లా , తెల్లకాగితంలో భద్రంగా ఉంది.

ఐంద్రజాలికుడు తన టోపీలోంచి ఏనుగులూ, చెవులపిల్లులూ, తీసినట్టు

తనచిన్న శరీరం తోనే మితిలేని ప్రేమ కనపరిచేవాడు

జీవనదుల్లాంటి ఆ చేతులు

మంచిపనులతో ఎప్పుడూ పొర్లిప్రవహిస్తూండేవి.

.

యెహుదా అమిఖాయ్ 

(3 May 1924 – 22 September 2000) 

ఇజ్రాయిలీ కవి,  నవలాకారుడు

ఇతను వ్యావహారిక హీబ్రూలో వ్రాసిన మొదటి కవిగా గుర్తింపుపొందాడు. రెండవ ప్రపంచ సంగ్రామంలో బ్రిటిషు సేనలతరఫున పోరాడేడు. అతను కవిత్వానికి చేరువకావడానికి,   Dylan Thomas, WH Auden TS Eliot మొదలైన వాళ్ళ ప్రభావం ఉంది.  దైనందిక జీవిత సమస్యలతో పాటు, జీవితం యొక్క పరమార్థం, మృత్యువూ మొదలైన విషయాలు అతని కవితా వస్తువులు. అతని కవిత్వం  దేముడిని కించపరిచేదిగా ఉందన్న అపవాదు కూడా ఉంది. ఎందుకంటే And This is Your Gloryఅన్న కవితలో దేముడిని కారుక్రిందకు దూరి దాన్ని మరమ్మత్తు చేసే మెకానిక్ లా, గ్లోబుక్రింద దూరి దాన్ని బాగుచెయ్యడానికి విఫల ప్రయత్నం చేస్తున్నట్టుగా చిత్రీకరించేడు.  అలాగే మరో కవిత Gods Change, but Prayers Remain the Sameలో దేముడిని గైడుగా, ఐంద్రజాలికుడిగా చిత్రించాడు. కవితలే కాకుండా అతను రెండు నవలలు కూడా వ్రాసేడు.

.

My Father

The memory of my father is wrapped up in
white paper, like sandwiches taken for a day at work.

Just as a magician takes towers and rabbits
out of his hat, he drew love from his small body,

and the rivers of his hands
overflowed with good deeds.

— Yehuda Amichai

(3 May 1924 – 22 September 2000)

Israeli Poet

%d bloggers like this: