అనువాదలహరి

అవతారం… శ్రీజిత్ అరియల్లూర్, Malayali Poet

.

పడావు భూముల్లో
ఆడుకుందికి ఒక్కడూ వెళ్ళిన కుర్రాడు
రక్షణలేని నేలనూతిలోపడి
ములిగిపోయాడు.

ఊరల్లా
ఆ కుర్రాడిగురించి వెది వెదికి
కాళ్లు పుళ్లయిపోయి తిరిగొచ్చింది గాని
ఏమీ లాభం లేకపోయింది.
అహ్! వాడే వస్తాడులే ఏదో ఒక రోజు
ఏ పెద్దూర్లోనో బాగా డబ్బుగడించి
మారుతీ కారులో,
అని ఆశించారంతా.

తర్వాత వర్షాలొచ్చినప్పుడు
ఇళ్ళూ వాకిళ్ళూ, నూతులూ
కుప్పలుతెప్పలుగా నిండిపోయి
వరదైపోయినపుడు
ఆ కుర్రాడు తిరిగొచ్చేడు ఇంటికి
మరు జన్మలో… చేపపిల్లగా.
అయితే అతన్ని ఎవరూ గుర్తుపట్టలా.

వాళ్లమ్మానాన్నా
వాళ్ళ కన్నీళ్ళలాగే
స్వఛ్ఛమైన వాననీటిలో
వాడికి తలతుడిచే తువ్వాలుతోనే
వాడిని పట్టుకున్నారు
వాడి తమ్ముడు ఆడుకుందికి.

అరోజునుండీ గాజుకుప్పెఆక్వేరియంలో
వాళ్ళ తమ్ముడికి
ముద్దులివ్వడానికి ప్రతిరోజూ
ఆ చేపపిల్ల ఎంతో ప్రయత్నిస్తూనే ఉంది.

అయితే ఏం లాభం! వాళ్ళిద్దరివీ ఇప్పుడు
రెండులోకాలవడం వల్ల గాబోలు
పాపం! ఆ పాకిరే కుర్రాడు
వాళ్ళన్నని గుర్తుపట్టలేకున్నాడు.
.

(మలయాళ  మూలం: శ్రీజిత్ అరియల్లూర్; English translation: Sri Babu Ramachandran)

Sreejit Ariyallur
Image Courtesy: https://www.facebook.com/sreejith.ariyallur

Avatharam – Sreejith Ariyallur, Malayalam Poetry.

The boy

.

Who went out alone

To play in the barren lands,

drowned in an unguarded

Bore well..

The whole village

set out  in search of

The boy, only to

return with sore feet,

And hopes that he would

make a fortune in some city

and return to the village one day.

In a Maruti Car..

Later, during the rains

When the wells, the fields

and the compounds were flooded,

The boy returned home

in the rebirth,  as a fish..

But none could identify him..

From the rainwater

as clear as tears,

Amma and Appa

Caught the fish

For his younger brother,

with the same towel

they used to dry his hair with.

And,  then onwards

From the glass bowl

The fish kept on offering

Kisses to his little brother..

But, may be because

They belonged to

different worlds by now

The toddler never recognized

His elder brother.

‘Mother’ is not Singular… Anisetti Rajita

It’s the mother earth, overflowing with oceans,
that has breathed the idea of love at epochal time,
and still, replicates life in every inch of this creation.
She is an eternal spring that embraces all waters.

Mother is a ceaseless source of monumental love
And she is the beauty incarnate…
And, the survival of humanity solely rests on her.

If one can still breathe and life beats, it is thanks to
her varietal roles and intellectual essence.
It is because of this wonderful Mother
Sun rises or sinks each day.

If the wheel of seasons rolls down
or, limits of time are expanding;

If the deciduous trees dress themselves up
with delicate shoots flaunting daintiness of Spring;

If the cuckoos continue to coo
and we could witness full- and new-moons

it’s only courtesy omnipresence of Mother.

A Mother is not a mother to only one, or to only few;
A Mother is not just a lone and singular being,
Mother means many,  Mother is plural.

She is the primal natural force,
that set this universe into motion
She is a manifestation of humanity itself.

Mother is not singular, but plural
She is a veritable definition of plurality.

.

(This poem is taken from her collection of poetry “Usuru”)

Anisetti Rajita

Anisetti Rajita started writing poetry from school days. Discrimination of women, exploitation of the Dalit and downtrodden, Globalization and Urbanization are some of  her recurring themes.  Besides possessing wonderful command over language and idiom, she has great flair for drawing images from the very ambience she creates for her poem.  She has to her credit 5 collections of her poetry so far.

.

అమ్మ బహువచనం

.

ఆదినుండీ ప్రేమ భావనకు ఊపిరి పోసిన అమ్మ
సృష్టికి అణువణువునా ప్రతిసృష్టిచేసిన అమ్మ
అనేక సముద్రాలు పొంగే భూమండలం.
నదులనెన్నో పొదువుకున్న ఝరాఝరి
అనురాగపు అంతులేని సంపదా ఆమే
సౌందర్యపు అస్తిత్వం ఆమే
మనుష్యజాతికి మనుగడున్నది ఆమెవల్లనే
ఇంకా ప్రాణవాయువున్నదంటే
జీవ చేతనమున్నదంటే
ఆమె శ్రమరూపాలూ, మేధోసారం వల్లనే
తెల్లవారుతున్నదీ పొద్దుగూకుతున్నదీ
అద్భుతమైన అమ్మవల్లనే
రుతుచక్రం తిరిగి తిరిగి
కాలసీమలు కదులుతున్నాయంటే
ఆకులు రాల్చేచెట్లు చివుళ్లు తొడుక్కుని
వసంతశోభతో ముస్తాబవుతున్నాయంటే
కోకిలలు క్రమం తప్పకుండా ఇంకా
కుహుకుహులు వినిపిస్తున్నాయంటే
పౌర్ణమినీ అమావాశ్యనూ చూస్తున్నామంటే
అమ్మ ఉన్నందునే
అమ్మ ఒక్కరికో కొందరికో తల్లి కాదు.
అమ్మ ఒకే ఒక వ్యక్తీ కాదు.
అమ్మ ఏకవచనం కాదు
ప్రకృతి మూలశక్తి
జగఛ్ఛోదక శక్తి
మానవత్వపు అభివ్యక్తి అమ్మ
అమ్మ బహువచనం
బహువచనానికి నిండు నిర్వచనం.

31.3.99

ఆనిశెట్టి రజిత

బడిచదువులనాటినుండీ  కవిత్వం వ్రాస్తున్న రజిత కవితా వస్తువులు స్త్రీ వివక్ష, అన్యాయాలు, పీడితులూ, దళితులమీద జరిగే అత్యాచారాలు,  తెలంగాణామీద ఆధిపత్యాలు, ప్రపంచీకరణ, నగరీకరణ మొదలైనవి. ఆమె “గులాబీలు జ్వలిస్తున్నాయి” (1984), “నేనొక నల్లమబ్బునౌతా” (1997), “చెమట చెట్టు” (1998), “ఓ లచ్చవ్వ” (2000), “అనగనగా ఒక  కాలం”  (2005) కవితా సంపుటాలు వెలయించారు. భాష మీద నుడికారం మీద పట్టు కలిగి ఉండడమేగాక, వస్తువుని కవిత్వీకరించడంలో తన మేధను గాక, అనుభవాన్నీ, స్పందననీ ఈమె ఉపయోగిస్తారు. ఉపమానాలు చాలా సరళంగా సహజంగా ఉంటాయి.

Meghasandesam (a stream of consciousness poem) … Vamshidhar Reddy

.

Oh! It looks it might rain any time.
When two oppositely-charged clouds interact
What reaches us first, thunder or lightning?
velocity of sound is lesser than light, they say…
Where is my bava?
Thanks to Einstein…

Clouds are veritable thieves, no doubt.
Stealing water from the sea, and amassing,
get heavy, lazy and lame
and vomit it on us…
Tat! Why doesn’t a good simile strike me ever?

There it is, the first drop of rain
tumbling down with terminal velocity
thinking of breaking some head.
Why does a rain drop take the shape of a sphere?
Maybe, to reduce its surface tension,
Otherwise, won’t it break down to smithereens?
Perhaps, this is what they meant
when they said life is but a bubble.

Charge! Prepare for the battle!
Reminding the music of war scenes in a movie;
Filling nostrils with the scent of first drops on earth
comes rain pouring down heavily.
How many houses might have caved in?
And how many people might have died, who knows?
The Mahabharata story of Rock Pigeon Jarita
And her son Jaritari flashed in my memory for once
and touched a chord somewhere.

News item flashes in the dailies next day:
“Rain sweeps away nine lives…
Heavy rains lead to cholera in agency…
Farmers left high and dry.”
Ranganayakamma should be informed
that rain is a bourgeois,
for, all ills somehow, converge only to BPL.

As for me
I fondled the drizzle with my fingers
through the balcony grills,
blissfully taking tea with Pakodi(1)
and humming a childhood rhyme; or,
was leaving paper boats in the streams; or,
entertaining dirty ideas about taking advantage of rain
chewing the sweetcorn to the limits in the eat-street
with the girl friend; or,
draining down the 90 ml,
dipped in the KFC or sand-witched by the MacD burger
was pretending my share of grief
for the devastation caused by the rain.

You Lord of the clouds! Just one request!
Please give your priority to villages, not to towns.
Otherwise, we don’t get anything to eat.

“You fool!” he replied
“Your towering buildings,
and the signal towers in towns,
the dust and pollution …
stop, trap and harvest my water
What is there in a village…after all
neither a tree nor house worth mentioning.
Take note, fellow!
Your globalization has boomeranged on you!”

It was like a modern version of “Meghasamdesam”
unveiling a universal truth.
.

———————————————————————————————————–

Notes:

Bava:  first Cousin;This is with reference to a famous rain song from a Telugu movie of yester years Malleeswari starring NTR and Bhanumathi. Follow the link to hear the song.

Jarita and Jaritari : Mother and son Rock birds, respectively, from a story from the Mahabharata. When they are surrounded by wild forest fire created by Arjuna in the Khandava forest, the mother-word would grieve for her helplessness to protect its younglings. When she suggests them to save their lives hiding in an opening, then Jaritari tells his mother that it would be pragmatic  to risk a possible death from a probable death, since there in the opening lives a rat that would eat them away if they have tried to hide there.

Ranganayakamma: A noted short story writer and novelist, with leftist ideology. For more details the link can be followed.

BPL: Below Poverty Line, a statistical measure employed by governments to help poor people.

Meghasamdesam is a Classic Sanskrit work by Kalidasa wherein an accursed Yaksha condemned  for separation for a year sends a message to his wife through the Lord of Clouds. However, it has no such overtones here. It is not a message through, but message by a Cloud.

(1) Pakodi is an afternoon snack prepared with Bengalgram / Besan Flour and onion, and  is normally taken with tea ( some people particularly prefer it when it rains.)

———————————————————————————————————-

.

Photo Courtesy: https://www.facebook.com/vamshidhar.reddy.

Vamshidhar Reddy

Dr. Vamshidhar Reddy (1986) hails from Gajwel, Andhra Pradesh. A student of Osmania Medical college, Hyderabad, he is now preparing for his PG study.  He has a blog:  https://www.facebook.com/VamshiKavanaVanam.  Contemporary images, satire, novelty of expression are his forte.

(The present poem runs on the stream of consciousness technic.  Interestingly, he uses exactly the same comparison what Mayura, another great Sanskrit poet in his Surya Satakam does… that the Clouds suffer from the disease of excessive drawl of water from earth’s water resources and vomit it during the Rainy season.

I think remembering Ranganayakamma garu during the course of poem when the poor are always put to suffering and calling Clouds bourgeois is perhaps the best part of the poem. There is no disrespect meant for that reputed marxist-feminist writer.

And in the end, the message is clear and straight… warning about fall-outs of our globalization.)

.

మేఘసందేశం

వానొచ్చేట్టుంది,
పొలారిటీ మేఘాల్రెండు కొట్టుకు చస్తే
ఉరుము ముందా, మెరుపు ముందా,
ధ్వని వేగం కాంతికన్నా చాలా తక్కువట,
ఏడ తానున్నాడో…
థాంక్స్ టు ఐన్ స్టీన్…

మేఘాల్నిజంగా దొంగలే,
సంద్రపు నీటిని దోచి, దాచి,
బరువెక్కి, కదల్లేక,
మన మీదే వాంతిచేస్కుని,
ఛ, ఒక్క మంచి పోలికా దొరకదెందుకో,

అదిగో తొలి చినుకు,
టర్మినల్ వెలాసిటీ తో,
ఎవడి తల పగలగొట్టాలా అనాలోచిస్తూ,
చినుకు గోళంగానే ఎందుకుంటదో,
సర్ఫేస్ టెన్షన్ని తగ్గించుకోడానికేమో,
లేపోతే, పగల్దూ,
జీవితం నీటిబుడగంటే ఇదేనేమో,

ఆక్రమణ్, దాడి చేయండి, ప్రిపేర్ ఫర్ ద బాటిల్,
సినిమాల్లో వార్ సీన్స్ మ్యూజిక్ గుర్తుచేస్తూ,
కమ్మటి మట్టి వాసన ముక్కులోకి దూరుస్తూ,
జడి వాన..
ఎన్నిళ్ళు కూలాయో, ఎందరు చస్తారో,
“మాతృహృదయం”లో
జరిత, జరితారిల కన్వర్సేషన్ కళ్ళలో మెదిలి,
తడి తేలి..

పేపర్లో వార్త,
వర్షం ముంచిన తొమ్మిది ప్రాణాలు,
హెవీ రెయిన్స్ లీడ్ టు కలరా ఇన్ ఏజన్సీ,
వడగండ్లకు రైతు కడగండ్లు,
రంగనాయకమ్మ గారికి ఇన్ఫార్మ్ చేయాలి,
వాన బూర్జువా అని,
మరి కష్టాలన్నీ B.P.L కిందేగా,

నేను మాత్రం
బాల్కనీ గ్రిల్స్ లోంచి చినుకుల్ని చేత్తో తడుముతూ
తాదాద్మ్యంగా పకోడీ తో టీ తాగుతూనో,
వాన వల్లప్ప హమ్ చేస్తూ
కాలవల్లో కాగితప్పడవలొదుల్తూనో,
గర్ల్ ఫ్రెండ్తో ఈట్ స్ట్రీట్లో
మొక్కజొన్న పొత్తుల్ని స్కూప్స్ అంచుకు నముల్తూ
వర్షాన్నెలా అడ్వాంటేజ్ తీస్కోవాలా అని దరిద్రపాలోచన్లు చేస్తూనో,
నైన్టీ మి.లీ. గొంతులో పోసి
K.F.C బకెట్లో మునిగి, Mec.D బర్గర్లో నలిగి,
వర్ష విలయానికి నా వంతుగా ధారాళంగా బాధ నటిస్తూ..

మేఘమా, వన్ రిక్వెస్ట్,
నీ ప్రయారిటీ పల్లెకివ్వు, పట్నాలకొద్దు,
తిండి దొరకదు లేపోతే,

“ఒరేయ్, పిచ్చోడా,
పట్నంలో ఎత్తైన మేడలూ, సూదిలా టవర్లూ,
దుమ్మూ ధూళి, పొగా పొల్ల్యూషనుండి
నన్నాపి నీటిని కొల్లగొడ్తాయ్,
పల్లెలో ఏముంది, ఇల్లా, చెట్టా,
మీ గ్లోబలైజేషనే మీ కంట్లో పొడిచిందిరోయ్”
మోడర్న్ మేఘసందేశంలా,
విశ్వ రహస్యం విడిపిస్తూ,

కాళిదాసు,
మేం మేఘాలూ కబ్జా చేసామ్ మాష్టారు,
మీరు వేరే వస్తువు వెతుక్కోండి,
పిచ్చి పిచ్చిగా అరుస్తూ,
వర్షంలో తడుస్తూ
నా లాంటి పిచ్చోళ్ళు…

.
Vamshidhar Reddy

ఒలింపిక్ గీతం … జాన్ విలియమ్స్

The Olympic Rings, the symbol of the modern Ol...
The Olympic Rings, the symbol of the modern Olympic Games, inspired by Pierre de Coubertin (Photo credit: Wikipedia)

(లండనులో 30వ ఒలింపిక్ క్రీడలు ప్రారంభం అవుతున్న శుభ సందర్భంగా మానవాళికి ఈ క్రీడలు క్రీడలుగా మాత్రమే మిగిలిపోకుండా, స్వేచ్ఛా, స్వాతంత్ర్యం, సమానత్వాలపై అచంచలమైన విశ్వాసాన్ని ఇనుమడింపజేస్తూ, అగ్రరాజ్యాలూ, అగ్రనాయకులూ తమ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ఈ భావాలని పెదవులతో వల్లించకుండా,  కార్యాచరణలో చూపించి, మానవాళి పురోగతికి పాటుపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
భారత క్రీడాకారులు తమ తమ క్రీడా విభాగాలలో అత్యుత్తమ ప్రదర్శనచూపించడం ద్వారా మన జాతీయ పతాకాన్ని విశ్వవేదికమీద రెపరెపలాడించగలరని శుభాకాంక్షలూ, శుభాభినందనలూ తెలియజేస్తున్నాను.)

.

నేను జీవించే ప్రతిరోజూ
నా అత్యుత్తమ ప్రదర్శన
చూపించే రోజు
కావాలని కోరుకుంటాను.
నేను ఒక్కడినే కావచ్చు, కాని
నేను ఒంటరిని మాత్రం కాను
నా అత్యుత్తమ ప్రదర్శన
ఇంకా రావాల్సి ఉంది

.

నా గుండె పగిలింది
ఆణువణువూ శ్రమించేను
ఆ తీయదనాన్ని రుచి చూడడానికి.
నేను బాధని అధిగమిస్తాను
గెలుపూ ఓటములు చూస్తాను
ఈ అనుభవాల్లో ఇదే చివరకి మిగిలేది

.

నేను కాలంలో ఆ ఒక్క క్షణం కోరుకుంటాను
నా అంచనాలకి మించి నేను ఎదగ గలిగినది
నా కలలన్నీ ఒకే ఒక్క గుండె చప్పుడు దూరంలో
సమాధానాలన్నీ నా చేతిలో
నాకు ఆ క్షణం ప్రసాదించు
నా భవితని ఎదిరించేరోజు
ఆ క్షణంలో
నేను
అమరత్వాన్ని అనుభవిస్తాను.

.

నేను అత్యుత్తమంగా
ఉండడానికే జీవించేను
నాకు కోరుకున్నదే కావాలి
అంతకి తక్కువకి రాజీ లేదు.
నా ప్రణాళికలు వేసుకున్నాను.
ఇప్పుడు ఇక అవకాశం
నా చేతుల్లోనే ఉంది

.

నేను కాలంలో ఆ ఒక్క క్షణం కోరుకుంటాను
నా అంచనాలకి మించి నేను ఎదగ గలిగినది
నా కలలన్నీ ఒకే ఒక్క గుండె చప్పుడు దూరంలో
సమాధానాలన్నీ నా చేతిలో
నాకు ఆ క్షణం ప్రసాదించు
నా భవితని ఎదిరించేరోజు
ఆ క్షణంలో
నేను
అమరత్వాన్ని అనుభవిస్తాను.

.

ఆ ఒక్క క్షణాన్నీ హస్తగతంచేసుకున్నావా
నువ్వు ఇక జీవితకాలాన్ని జయించినట్టే
దాన్ని ప్రకాశించనీ

నేను కాలంలో ఆ ఒక్క క్షణం కోరుకుంటాను
నా అంచనాలకి మించి నేను ఎదగ గలిగినది
నా కలలన్నీ ఒకే ఒక్క గుండె చప్పుడు దూరంలో
సమాధానాలన్నీ నా చేతిలో
నాకు ఆ క్షణం ప్రసాదించు
నా భవితని ఎదిరించేరోజు
అప్పుడు,
ఆ ఒక్క క్షణంలో
నేను స్వేచ్ఛా జీవిని,

ఆ ఒక్క క్షణంలో
నేను స్వేచ్ఛా జీవిని.

.

జాన్ విలియమ్స్

This is a Copyrighted Material.

Please See the original at:

 http://www.elyrics.net/read/j/john-williams-lyrics/olympic-spirit-lyrics.html

జీవన శాఖి … తోరు దత్, భారతీయ కవయిత్రి.

పట్ట పగలే. కానీ, ఏదో తెలియని అలసట!
నా కళ్ళు మూసుకునే ఉన్నాను గాని నిద్రపోలేదు,
నా చెయ్యి మా నాన్నగారి చేతిలో ఉంది, నాకు
అతను నా దగ్గరే కూర్చున్నట్టు తెలుస్తోంది.
అలా గంటలకి గంటలు మేమిద్దరం మౌనంగా
ఎన్నిసార్లు గడిపామో లెక్కలేదు.
ఒకరి మనసులో కలిగిన భావాలు రెండో వాళ్ళకి తెలుస్తూ,
ప్రతి గుండెచప్పుడూ కాలాన్ని కొలుస్తున్నప్పుడు
అసలు మాటాడవలసిన పనేముంది?

నేను మేలుకునే ఉన్నాను: ఎదురుగా విశాలమైన మైదానం
అబ్బ! కనుచూపుమేర అనంతంగా ఎటుచూస్తే అటు సాగుతూ.
దాని నిండా పరుచుకుని ఒక వింత వెలుగు, అద్భుతమైన కాంతి,
మబ్బులులేని, మంచుకురుస్తున్న శీతకాలపు నిర్మలరాత్రిలో
మంచుబిందువులపై నక్షత్రాలు విరజిమ్మే వెలుతురు లాంటిదది.
అంతకంటే సాంద్ర ప్రశాంత సుందరంగా ఉంది…
అది కల కదు, నేను కళ్ళు పూర్తిగా తెరిచే ఉన్నాను,
అలాంటి మైదానం మధ్యలో నేను చూసాను,
ఒక చెట్టుని… తన కొమ్మలు అన్ని దిక్కులా చాచుతూ
రకరకాల ఆకులతో; వెలిసిపోయిన వెండీ, మెరిసే బంగారు రంగుల్లో,
మాటల్లో చెప్పలేని తళతళలని ప్రతిబింబిస్తూ.

ఆ చెట్టు సమీపంలోనే ఒక దేవదూత నిలబడి ఉన్నాడు;
అతను కొన్ని చివురుకొమ్మలు త్రుంచి నా తలచుట్టూ అలంకరించాడు
ఓహ్! ఏంత రమ్యంగా ఉందో,  ఆ వింత ఆకుల స్పర్శ!
నా కనుబొమలలో నొప్పి మాయమైపోయింది. నా శరీరంలో
జ్వరం జాడే లేదు. “ఓహ్” అని ఆనందంతో కేరింతలు కొడుతూ,
“మా నాన్నగారి తలకి కూడా ఇలా ఆకులు చుట్టవూ” అని అడిగాను.
దేవదూత ఒక ఆకుని తీసుకుని దానితో
తనతలని తాకి “అప్పుడే కాదు” అని పలికేడు మంద్రంగా.
ఎన్నడూ, మునుపెన్నడూ అలాటి ముఖం చూడలేదు,
ఆ దేవదూత ముఖంకంటే అందమైనదీ
కరుణార్ద్రమూ, దివ్యప్రేమామృతముతో నిండినదీ.

ఆశ్చర్యంతో కొన్ని క్షణాలు అలా ఉండిపోయాను.
కన్నీటితో మసకబారిన నా కళ్ళు ఒక్కసారి విప్పి చూద్దును
ఏమయ్యాయో వింతకాంతులు మరి కనిపించలేదు.
అలాగే, నేలమీద మంచు దట్టంగ కురిసినప్పటి
నక్షత్రాల పూర్వపు వెలుగు వెల్లువా లేదు.  ఆ దేవదూత ముఖం
మరి కనిపించమన్నా కనిపించ లేదు. ఒక్క నాన్నగారు
కనిపించారు, ప్రక్కమీద కూర్చుని నన్ను గమనిస్తూ
తన చేతిలోని నా చేతిని ఆత్మీయంగా ఒత్తిపట్టుకుంటూ…

.

తోరు దత్

(1856-1877)

భారతీయ కవయిత్రి.

తోరుదత్ అతి పిన్నవయసులోనే (21) మరణించినా, అద్భుతమైన ప్రతిభా పాటవాల్ని ప్రదర్శించిన కవయిత్రి. ఆమె చిన్నప్పుడు కలిసి ఆడిపాడిన తన తోబుట్టువుల మరణం ఆమెని బాగా కృంగదీసింది. ఆరోజుల్లో క్షయవ్యాధికి తగిన మందు దొరికేది కాదు. ఆమెకి క్షయ సొకిందని తెలిసి, మృత్యుముఖంలో తానున్నా తెలిసినపుడు వ్రాసిన కవిత ఇది. తన తండ్రి కంటే తనే ముందు చనిపోవడం విధిలిఖితమని చెబుతోంది కవయిత్రి… దేవదూత అతన్ని తలచుట్టూ ఆకులతో అలంకరించడానికి నిరాకరించడాన్ని ప్రతీకాత్మకంగా చెబుతూ. ఆ వెలుగూ, వెన్నెలా స్వర్గానికి ప్రతీకలు.

బాగా ప్రఖ్యాతి వహించిన ఆమె Our Casuarina Tree కవిత కూడా ఈ నేపధ్యం లోనిదే.

English: Toru Dutt (1856-1877), the Indian poe...
English: Toru Dutt (1856-1877), the Indian poetess who travelled to Europe. (Photo credit: Wikipedia)

.

The Tree of Life

.

Broad daylight, with a sense of weariness!

Mine eyes were closed, but I was not asleep,

My hand was in my father’s, and I felt

His presence near me. Thus we often past

In silence, hour by hour. What was the need

Of interchanging words when every thought

That in our hearts arose, was known to each,

And every pulse kept time? Suddenly there shone

A strange light, and the scene has sudden changed.

I was awake: It was an open plain

Illimitable, stretching, stretching oh, so far!

And o’er it that strange light, a glorious light

Like that the stars shed over fields of snow

In a clear, cloudless, frosty winter night,

Only intenser in its brilliance calm

And in the midst of that vast plain, I saw.

For I was wide awake, it was no dream.

A tree with spreading branches and with leaves

Of diverse kinds, dead silver and live gold,

Shimmering in radiance that no words may tell!

Beside the tree an angel stood; he plucked

A few small sprays, and bound them round my head.

Oh, the delicious touch of those strange leaves!

No longer throbbed my brows, no more I felt

The fever in my limbs “And oh” I cried,

“Bind too my father’s forehead with these leaves”.

One leaf the angel took and therewith touched

His forehead, and then gently whispered “Nay”

Never, oh never had I seen a face

More beautiful than that Angel’s, or more full

Of holy pity and of love divine.

Wondering I looked awhile, then, all at once

Opened my tear-dimmed eyes When lo! the light

Was gone the light as of the stars when snow

Lies deep upon the ground. No more, no more,

Was seen the Angel’s face. I only found

My father watching patient by my bed,

And holding in his own, close-prest, my hand.

.

Toru Dutt

(1856-1877)

Indian Poetess

Toru Dutt, one of the earliest of Indo-Anglian poets, led a life of tragedy and beauty. She died young leaving behind a modest corpus of poetry of which the poems included in Ancient Ballads and Legends of Hindustan (1882) are the most enduring. The Ancient Ballads consists of nine legends, most of them chosen from the Mahabharata, the Ramayana and the Vishnu Purana. They are Savitri, Lakshman, Jogadhya Uma, The Royal Ascetic and the Hind, Dhruva, Buttoo, Sindhu, Prahlad and Sita.

Toru Dutt’s fame rests mainly on these ballads and a few other poems of which Our Casuarina Tree is the most well-known. Most of her poems are narrative and her poetry as a whole exhibits a sophisticated poetic mind saturated with Hindu ethos and tempered by European cultural influences. Toru was the first Indo-Anglian poet to interpret the spirit of India to the West.

She was the first woman writer in Indo-Anglian literature. She left behind such a glory and legacy that even today we think of her as the marvellous young girl who died before her prime after blazing an immortal trail in Indo-Anglian poetry.

(Poem and Biography Courtesy: http://archive.org/stream/gatheredgrace029041mbp/gatheredgrace029041mbp_djvu.txt) of Project Gutenberg.

Michael Stern Hart and Gregory Newby, founders...
Michael Stern Hart and Gregory Newby, founders of Project Gutenberg, project to digitize public domain books as e-texts. (Photo credit: Wikipedia)

బస్సు ప్రయాణం … Arun Kolatkar

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులో

కిటికీలకి టార్పాలిన్లు గుండీలతో బిగించి ఉన్నాయి.

జెజూరీ వెళ్ళీదాకా చలిగాలి ఆ టార్పాలిన్ అంచుని

మోచెయ్యి దగ్గర టపటపా కొడుతూనే ఉంటుంది

.

సర్రున సాగిపోతున్న రోడ్డువైపు చూస్తావు

బయటకు పడుతున్న సన్నని బస్సువెలుతురులో

ఉషోదయపు ఛాయలకై వెదుకుతావు

ఎదురుగా కూర్చున్న ముసలతని కళ్ళజోడులో

రెండుముక్కలైన నీ ప్రతిబింబమొక్కటే

నువ్వు చూడగల్గిన గ్రామీణ చిత్రం

.

అతని ముక్కుమీదనున్న నామానికి దూరంగా

ఎక్కడో తెలియని గమ్యం వైపు నువ్వు

నిరంతరం ప్రయాణిస్తున్నట్టు అనిపిస్తుంది

నెమ్మదిగా సూర్యుడు ఉదయించేడని కూడా తెలీదు

.

టార్పాలిన్ కి ఉన్న చిన్న కన్నంలోంచి గురిచూసినట్టు

ఒక కిరణం ముసలతని కళ్ళజోడుమీద పడుతుంది

డ్రైవరు కుడి కణతమీద నెమ్మదిగా

ఒక అరకిరణం వచ్చి వాలుతుంది

బస్సు మలుపుతిరుగుతున్నట్టుంది

.

అతని ముక్కుమీద రెండుగా

అప్పటివరకూ మెరిసిన నీ ముఖం,

కుదుపులప్రయాణం ముగిసి బస్సు దిగేక

ఆ ముసలతని తలలోకి ఏమాత్రం వెళ్లదు.

.

అరుణ్ కొలాట్కర్

భారతీయ కవి, చిత్రకారుడూ.

(November 1, 1932 – September 25, 2004)

(అరుణ్ కొలాట్కర్ మరాఠీ, ఆంగ్లభాషలలో కవిత్వం వ్రాసేరు. 31 కవితలతో కూర్చిన Jejuri అన్న అతని ఆంగ్ల కవితల సంకలనానికి 1977 లో ప్రతిష్టాత్మకమైన కామన్ వెల్త్ రైటర్స్ బహుమతి వచ్చింది. (ఈ కవిత అందులోదే) అతని మరాఠీ కవితల సంకలనానికి 2005లో కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి వచ్చింది.)

(ఈ కవిత ప్రాథమికంగా బస్సు ప్రయాణం గురించి ఉన్నట్టే అయినా, ఇది ప్రయాణాన్ని జీవితానికి ఒక ప్రతీకగా చేసి చెబుతుంది. మన జీవితం ఒక చీకటిలో ప్రయాణం లాంటిది. ఎక్కడెక్కడినుండో పడుతున్న కాంతికిరణాల వెలుగుల్లో ఒకళ్ళనొకళ్ళం చూసుకుంటుంటాం. కలిసి ప్రయాణం చేస్తాం. బయట అద్భుతమైన వెలుగున్నప్పటికీ మనం మూసుకున్న హృదయాలతోనే జీవితాన్ని పూర్తిచేసేసుకుంటాం. ప్రయాణం పూర్తయిన తర్వాత ఎవరిత్రోవ వారిదే. ఎవరి మనసులోనూ కాసింత చోటు సంపాదించుకోకుండానే జీవితం చాలిస్తాం. ఇది సూక్ష్మంగా కవి చెబుతున్నట్టు నాకు అనిపించింది.)

.

The Bus

The tarpaulin flaps are buttoned down
on the windows of the state transport bus
all the way up to Jejuri
A cold wind keeps whipping
and slapping a corner of the tarpaulin
at your elbow.

You look down the roaring road.
You search for signs of daybreak in
what little light spills out of the bus
Your own divided face in a pair of glasses
on an old man’s nose
is all the countryside you get to see.

You seem to move continually forward
towards a destination
just beyond the caste-mark between his eyebrows.
Outside, the sun has risen quietly.

It aims through an eyelet in the tarpaulin
and shoots at the old man’s glasses.
A sawed-off sunbeam comes to a rest
gently against the driver’s right temple.
The bus seems to change direction.

At the end of the bumpy ride
with your own face on either side
when you get off the bus
you don’t step inside the old man’s head.
.

Arun Kolatkar

Indian Poet and Artist

(November 1, 1932 – September 25, 2004)

The image of Indian poet Arun Kolatkar (1910-1...
The image of Indian poet Arun Kolatkar (1910-1987) was published in from http://www.hindu.com/lr/2004/09/05/images/2004090500110101.jpg. This reclusive poet had very few images taken of him, and now after his death it may not be possible to obtain copyright-free material. (Photo credit: Wikipedia)

ARUN KOLATKAR
(1932 – 1987)

Arun Kolatkar was a bilingual poet writing in both English and Marathi. His first book of poems Jejuri appeared in 1976 and was awarded the Commonwealth Poetry Prize in 1977 for the best first book of poetry in English. (The present poem is taken from that). His Marathi collection of poems “Bhijaki Vahi” was awarded Central Sahitya Akademi Award in 2005.

Jejuri is a long poem in thirty-one sections concerned with a visit to Jejuri, a place in western Maharashtra sanctified by the Khandoba temple. The poem combines the irreverent urbanite attitude of the pilgrim Manohar with a colloquial speech rhythm and irony to produce an impact of beauty and power.

He was a product of J J School of Art  and was a renowned Graphics Designer with many awards to his credit.

(Poem and Biographical extract are Courtesy: Gathered Grace— Indian Writing in English, a Project Gutenberg product)

గోడ మీది ముఖం… EV Lucas

నిన్న సాయంత్రం డబ్నీ వాళ్లింటిదగ్గర పార్టీలో మేమందరం మాట్లాడుకుంటున్నప్పుడు మా సంభాషణ  ప్రకృతిసిధ్ధమైన కారణాలతో మనం సమాధానంచెప్పలేని సంఘటనలపైకి మళ్ళింది. ఒక్కొక్కరూ ఒక్కొక్క అనుభవం చెప్పేరుగాని ఏవీ అంతబాగా రక్తి కట్టలేదు. నాకు అపరిచితుల్లో ఒక పొట్టిమనిషి ఉన్నాడు… కుతూహలమైన చూపులూ అతనూ. ప్రతివాళ్ళనీ వాళ్ళు చెబుతున్నంతసేపూ ఎంతో శ్రద్ధగా విని ఆశక్తిగా గమనించేడు గానీ ఏ వ్యాఖ్యానమూ చెయ్యలేదు. చివరకి, అతన్ని కూడా సంభాషణలో భాగస్వామిని చెయ్యడానికి డబ్నీ అతనివైపు తిరిగి “మీకు మాతో పంచుకుందికి ఏదైనా సంఘటన గాని, కథగాని లేవా?” అని అడిగేడు.  ఒక్క క్షణం ఆలోచించి అతను, “ఒకటుంది గాని, నిజానికి మీరందరూ చెప్పిన వాటితో పోలిస్తే దాన్ని సంఘటనగాని, కథగాని అనకూడదేమో.  నా మట్టుక్కి నేను, కథకంటే అనుభవం చిత్రంగా ఉంటుందని నమ్ముతాను. అంతే కాదు చాలా కుతూహలం రేకెత్తిస్తుంది కూడా. నేను నాకు స్వయంగా జరిగిన అనుభవం ఒకటి మీకు చెప్పగలను, చిత్రంగా, అది ఇవాళ మధ్యాహ్నమే మాయమయ్యింది కూడా.” అందరం అతన్ని అ సంఘటన ఏమిటో చెప్పమని వేడుకున్నాం.

“ఏడాదో రెండేళ్ళ క్రిందటో,” అతను ప్రారంభించాడు, “నేను Great Ormand Street లో ఒక పాత ఇంటిలో అద్దెకుంటూ ఉండేవాడిని.  పడకగది గోడలన్నీ పాత కిరాయిదారు చక్కగ రంగులు వేయించాడు. కాని ఒకచోట మాత్రం గోడలోకి నీళ్ళూ దిగాయో ఏమో గాని తడి తడిగా మరకలు ఉండేవి. మన అందరికీ అనుభవంలోని విషయమే, అలాంటి గోడమీది మరకలు చూస్తున్నకొద్దీ రకరకాల ఆకారాలుగా కనపడటం. అందులో ఒకటి మాత్రం అచ్చం ఒక మనిషి ముఖంలా ఉంది. పక్కమీద పడుక్కుని ఉదయాన్నే లేవడానికి బద్దకంగా ఉన్నప్పుడు దాన్నే గమనిస్తూ, ఆ ముఖాన్ని పోలినవ్యక్తి నాకంటెముందు అద్దెకున్నవాడేమోనని ఊహించుకునేవాణ్ణి. ఇందులో ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మిగతా మరకలు పెద్దవీ చిన్నవీ అవుతూ రూపాలు మారినా, ఈ మరక మాత్రం ఏమీ చెక్కుచెదరకుండా, అలానే ఉంది.”

“అక్కడ నాకు ఇన్ ఫ్లూయెంజా వచ్చి, పక్కమీదే ఎక్కువకాలం గడపవలసి వచ్చింది. పొద్దల్లా చదువుకోవడమో ఆలోచనో తప్ప మరోటి ఉండేది కాదు. అదిగో, సరిగ్గా అలాంటిసమయంలోనే ఈ ముఖం నామీద రాను రాను పట్టుసాధించింది. ఆశ్చర్యంగా, అది రోజు రోజుకీ స్పష్టంగా మనిషిముఖంలా తయారవడం ప్రారంభించింది. ఒక రకంగా చెప్పాలంటే పగలూ రాత్రీ నా ఆలోచనల నిండా అదే. నుదురు కొట్టొచ్చినట్టు కనపడుతూ, ముక్కు అద్భుతంగా వంకీ తిరిగి ఉంటుంది. అది మామూలు ముఖంకాదు. వెయ్యిమందిలో ఒకరికి ఉంటుందేమో అలాంటి  ముఖం.

“మొత్తానికి ఎలాగో నాకు ఆరోగ్యం కుదుటపడింది గాని, ఆ ముఖం ఇంకా బుర్రలో తిరుగుతూనే ఉంది. నాకు తెలియకుండానే అలాంటి ముఖం కోసం వెదకడం ప్రారంభించేను. ఎందుకో నాకనిపించింది. అలాంటి మనిషి ఉంటాడు… అతన్ని ఎలాగైనా కలవాలి అని.  ఎందుకు అని అడిగితే కారణం చెప్పలేను. మా ఇద్దరికీ కలవడం రాసిపెట్టి  ఉందని ఎందుకో గాఢంగా అనిపించింది. అందుకని ప్రజలు ఎక్కువగా గుమిగూడేచోటులన్నీ తిరిగే వాడిని… రాజకీయ సమావేశాలు, ఫుట్ బాల్ పోటీలు, రైల్వే స్టేషన్లు,  ఒకటేమిటి ఇది అది అనకుండా అన్నిచోటులూ. కాని ఏం ప్రయోజనం లేకపోయింది. నాకు అప్పటిదాకా తెలీలేదు మనుషుల ముఖాలు ఇంత వైవిధ్యంగా ఉంటాయనీ అయినప్పటికీ అవి తక్కువే ననీ.  ఎందుకంటే, మనుషుల ముఖాలు ఏదీ రెండవదానితో పోలనప్పటికీ, వాటిని ఖచ్చితంగా కొన్ని నిర్దుష్టమైన గుంపులు లేదా వర్గాలుగా విభజించవచ్చు.

“ఈ వెతుకులాట నాకో వ్యసనమైపోయింది. మిగతా వన్నీ అశ్రద్ధచెయ్యడం ప్రారంభించేను. చాలా   జనసమ్మర్దం ఉండే చోటుల్లో ఊరికే అలా నిలబడి వచ్చేపోయే వాళ్లని చూస్తూ నిలబడే వాడిని. వాళ్ళు నాకు పిచ్చిపట్టిందేమో అనుకునే వాళ్ళు; పోలీసులు నన్ను గుర్తుపట్టి అనుమానించడం ప్రారంభించేరు. అయితే నేనెప్పుడూ ఆడవాళ్ళని గమనించలేదు… మగవాళ్ళు… మగవాళ్ళు… ఎప్పుడూ మగవాళ్ళ ముఖాలలోకే చూసేవాడిని.”

అతను చెబుతూ చెబుతూ అలసిపోయేడేమో, ఒకసారి చేత్తో నొసలూ నుదురూ తుడుచుకున్నాడు. “ఎలాగయితేనేం,” అంటూ మళ్ళీ ప్రారంభించేడు, “చివరకి అతన్ని ఒకసారి చూడగలిగేను. అతను టాక్సీలోతూర్పుకి పికడెల్లీ మీదుగా వెళ్తున్నాడు. ఒక్కసారి అటుతిరిగి టాక్సీ వెనక కాసేపు పరిగెట్టి మరో ఖాళీటాక్సీ దొరకగానే అతని టాక్సీని వెంబడించమని చెప్పి అందులో కూలబడ్డాను. డ్రైవరు వాళ్ళ టాక్సీ మా దృష్టిలోంచి తప్పిపోకుండా తీసుకెళ్ళేడు. మేం ఛేరింగ్ క్రాస్ చేరేము. నేను పరిగెత్తి పరిగెత్తి ప్లాట్ ఫాం మీదకి వెళ్ళేసరికి అతను ఒక చిన్నపిల్ల ఇద్దరు స్త్రీలతో ఉన్నాడు.  వాళ్ళు ఫ్రాన్సు వెళుతున్నారు. ఒక్కక్షణం అతనితో ఎలాగైనా మాటకలుపుదామని వేచిఉన్నానుగాని లాభం లేక పోయింది. ఇంతలో మిగతా మిత్రులుకూడ జతకలవడంతో వాళ్లందరూ బృందగా ఏర్పడి ట్రెయిన్   ఎక్కిపోయేరు.

“నేను తొందరగా ఫోక్ స్టోన్ కి ఒక టిక్కెట్టు తీసుకున్నాను, అతను ఓడ ఎక్కేలోగా అతన్ని ఒకమారు ఎలాగైనా కలవగలనన్న ఆశతో; కానీ, అతను నా కంటె ముందుగానే తన స్నేహితులతో ఓడ ఎక్కి తన ప్రైవేట్ కాబిన్ లోకి వెళిపోయేడు. దాన్ని బట్టి అతను బాగా డబ్బున్న వాడని అర్థం అవుతోంది.

“నేను మరోసారి ఓడిపోయేను; కానీ నేను ఈసారి ఎలాగయినా అతన్ని అనుసరించాలని నిశ్చయించుకున్నాను.  ఎందుకంటే, ఒకసారి ఓడ బయలుదేరేక, ఎప్పుడో ఒకప్పుడు ఆడవాళ్ళని వదిలి డెక్ మీదకి కాసేపు సరదాగా తిరగడానికైనా రాకపోడు. నాదగ్గర బొలోన్ వరకు వెళ్ళడానికేగాని తిరిగిరావడానికిడబ్బులు లేవు. కానీ ఇప్పుడు నన్నేదీ ఆపే స్థితిలోలేదు. టిక్కెట్టు కొనుక్కుని అతని కాబిన్ కి ఎదురుగుండా ఎదురుచూస్తూ నిలబడ్డాను. ఒక అరగంట గడిచిన తర్వాత అతను తలుపు తెరుచుకుని బయటకు వచ్చేడు, వెంట చిన్నపిల్లని తీసుకుని. నా గుండె దడదడా కొట్టుకోడం ప్రారంభించింది. ఎక్కడా పొరపాటు లేదు. ఆ ముఖంలో ప్రతి రేఖా నాకు పరిచయమే. అతను నావైపు ఒకసారి చూసి పై డెక్ మీదకి వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు. “ఇదే చివరి అవకాశం. ఇప్పుడు కాకపోతే మరి అవదు”అని నాకు అనిపించింది.

“క్షమించండి!” నేను మాటలకోసం తడువుకుంటూ, “మీరేమీ అనుకోకపోతే, మీ విజిటింగ్ కార్డ్ నాకొకటి ఇవ్వగలరా?” అని అడిగేను. “అతను కొంచెం ఆశ్చర్యంగా చూసేడు. అలా ఆశ్చర్యపోడంలో తప్పులేదు కూడా. అయితేనేం, అతని కేసులోంచి జాగ్రత్తగా ఒకకార్డు తీసి నాకిచ్చేడు. ఇచ్చి ఆ పిల్లని తీసుకుని గబగబా పై డెక్ మీదకి వెళ్లిపోయేడు. అతను నేను పిచ్చివాడినని అనుకున్నాడని అర్థం అవుతోంది; అంతకంటే ముఖ్యంగా, నన్ను సంతృప్తి పరచడమే మేలని కూడా అనుకుని ఉంటాడని తెలుస్తోంది.”

“కార్డుని చేత్తో గట్టిగా పట్టుకుని దాన్ని చదవడానికి ఓ మూలకి చేరుకున్నాను. నా కళ్ళకు ఒక్క సారి చీకటి కమ్మినట్టయింది. నా తలతిరగడం ప్రారంభించింది; దాని మీద Mr. Ormond Wall అన్న పేరూ, ఏదో పిట్స్ బర్గ్ అడ్రసూ ఉన్నట్టు మాత్రం లీలగా గుర్తుంది. అంతే! నాకు మరేమీ గుర్తులేదు. నేను కళ్లుతెరిచి చూసేసరికి బొలోన్లో ఒక ఆసుపత్రిలో ఉన్నాను. అక్కడే కొన్నివారాల చికిత్స అనంతరం, నెలరోజుల క్రిందటే తిరిగి వచ్చేను.”

అతను ఒక్క సారి మౌనం అయిపోయేడు.

మేం అతన్నొకసారి చూసి, ఒకర్నొకరు చూసుకుని నిరీక్షిస్తున్నాం ఏం చెబుతాడో విందామని. ఈ పొట్టి మనిషి చెప్పిన దానితో పోలిస్తే, సాయంత్రం మా సంభాషణ ఏమీ కాదు.

ఒక నిముషమో రెండునిముషాలో గడిచిన తర్వాత మళ్ళీ ప్రారంభించాడు, “నేను తిరిగి Great Ormond Street కి వెళ్ళిపోయాను.  ఈ అమెరికను గురించి ఎంత సమాచారం వీలయితే అంత సంపాదించడానికి ప్రయత్నించేను, నేను పిట్స్ బర్గ్ ఉత్తరాలు రాసేను; అమెరికన్ ఎడిటర్లకి ఉత్తరాలు రాసేను; లండనులోఉన్న అమెరికన్లతో స్నేహంకలిపేను; అంతాచేసి నాకు దొరికిన సమాచారం ఏమిటంటే, అతనొక మిలియనీర్ అనీ, తల్లి దండ్రులు బ్రిటిషుజాతీయులనీ, వాళ్ళు లండనులో నివసించేవారనీ.  అంతే! లండనులో ఎక్కడుంటున్నాడన్నదానికి సమాధానం దొరకలేదు.

“అలా కాలం పరిగెత్తుతూనే ఉంది నిన్నటి ఉదయం దాకా.  రోజూకంటే బాగా అలసి పడకెక్కడంతో, బాగా పొద్దెక్కీదాకా తెలివిరాలేదు. నాకు తెలివి వచ్చేసరికి గదినిండా సూర్యుడివెలుతురు నిండి ఉంది. అలవాటు ప్రకారం నేను గోడవంక చూసేను ఆ ముఖం ఎలా ఉందో చూద్దామని. ఒక్కసారి తుళ్ళిపడి లేచేను. నమ్మలేక కళ్ళునులుపుకుని చూసేను. ఇప్పుడది లీలగా కనిపిస్తోంది. మొన్నరాత్రి ఎప్పటిలాగే చాలా ఖణీగా కనిపించింది… ఎంతగా అంటే అది నా ఎదురుగా మాటాడుతున్నట్టే ఉంది. ఇప్పుడు దానికి వికృతిలా ఉంది.

నాకేం తోచలేదు. బుర్ర దిమ్ముగా అయిపోయింది. అప్పటికే ఉదయం వార్తాపత్రికలన్నీ వచ్చేసేయి.  ప్రముఖవార్త అదే : “అమెరికన్ మిలియనీర్ మోటారు కారు ప్రమాదం”… నిన్న మీరు కూడా అందరూ చదివే ఉంటారు. కొని చదివేను. “పిట్స్ బర్గ్ మిలియనీరు అయిన Mr. Ormond Wall, అతని బృందమూ ఇటలీలో విహారయాత్రచేస్తుండగా ఎదురుగావస్తున్న వాహనం ఢీకొని కారు తలక్రిందులయిపోయింది. అతని పరిస్థితి విషమంగా ఉంది” అదీ సారాంశం.

నేను నా గదికి వెళ్లిపోయి పక్కమీద కూర్చుని గోడమీది ఆ ముఖం వైపే చూస్తూ కూర్చున్నాను. నేను చూస్తుండగానే అది పూర్తిగా మాయమైపోయింది.

తర్వాత నేను తెలుసుకున్నది Mr. Wall నేను ఏ క్షణంలో ఆ ముఖం అదృశ్యం అవడం చూసేనో అదే సమయంలో మరణించేడని.

మరొక్కసారి అతను మౌనంగా అయిపోయేడు.

“అద్భుతం, అపూర్వం…” అన్నా రందరూ. అందరి మనసులోంచి వచ్చిన మాట అది.

“నిజం” అన్నాడు ఆ అపరిచిత వ్యక్తి.

” నా కథలో మూడు అపూర్వమైన, అసాధారణమైన విశేషాలున్నాయి.  మొదటిది, ఎక్కడో లండనులో ఒక గదిగోడమీదనున్న మరక అమెరికాలోనున్న ఒక మనిషి ముఖకవళికలకి చాలా దగ్గరపోలికలు కలిగి ఉండడమేగాక, అతని జీవితంతోకూడా ముడిపడి ఉండడం. సైన్సు దానికి సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు. రెండోది ఒక వ్యక్తి పేరుకీ, అతని కవళికలు కుతూహలం రేకిత్తెంచేటంత ఖచ్చితంగా కనిపిస్తున్న ప్రదేశానికీ  సంబంధం ఉండడం. కాదంటారా?

అందరం అతనితో ఏకీభవించేం. మళ్ళీ ప్రకృతికి అతీతంగా అద్భుత సంఘటనల జరగడం గురించిన మా మొదటి ప్రస్తావన ఊపందుకుంది మరింత ఉత్సాహంతో; అంతలో మా అపరిచిత అతిథి లేచాడు గుడ్ నైట్ చెప్పి శలవు తీసుకుందికి. అతను సరిగ్గా వీధిద్వారం చేరే వేళకి ఇంత ఉత్సాహంగా జరుగుతున్న వాదప్రతివాదనలకి మూలమైన  విషయాలగురించి ఎవరో ప్రస్తావిస్తూ, అతను వెళ్ళిపోయేలోగానే మూడోది ఏమిటో కనుక్కోవాలని గుర్తుచేశారు. ఒకతను, “మీరు మూడువిషయాలన్నారుగదా,” అని అతన్ని అడిగేడు మూడోది ఏమిటి అని ధ్వనిస్తూ.

“ఓహ్,  అదా!” అతను తలుపు తెరుస్తూ అన్నాడు, ” అది మరిచిపోతున్నాను. మూడవ అసాధారణ విషయం ఏమిటంటే, అది నేను అరగంట క్రితమే అప్పటికప్పుడు అల్లిన కట్టుకథ. అందరికీ మరోసారి, గుడ్ నైట్.”

Image Courtesy: http://www.ebooks-library.com/author.cfm/AuthorID/208

EV Lucas

.

English Original:

The Face on the Wall…

We were talking of events which cannot be explained by natural causes at Dabney’s last evening. Most of us had given an instance without producing much effect. Among the strangers to me was a little man with an anxious face. He watched each speaker with the closest attention, but said nothing. Then Dabney wishing to include him in the talk, turned to him and asked if he had no experience he could narrate – no story that could be explained. He thought a moment. “Well,” he said, ‘not a story in the ordinary sense of the word; nothing like most of your examples. Truth, I always believe, is not only stringer than a made up story, but also greatly more interesting. I could tell you an occurrence which happened to me personally and which strangely enough completed itself only this afternoon.”

We begged him to begin.

“A year or two ago,” he said, “I was in rooms in an old house in Great Ormond Street. The bedroom walls had been painted by the previous tenant, but the place was damp and there were great patches on the walls. One of these – as indeed often happens – exactly like a face. Lying on a bed in the morning and delaying getting up I came to think of it as real as my fellow lodger. In fact, the strange thing was that while the patches on the wall grew larger and changed their shapes, this never did. It remained just the same.

“While there I fell ill with influenza, and all day long I had nothing to do but read or think, and it was then that the face began to get a firmer hold of me. It grew more and more real and remarkable. I may say that it filled my thoughts day and night. There was a curious curve of the nose and the forehead was remarkable, in fact the face of an uncommon man, a man in a thousand.”

“Well, I got better, but the face still controlled me, found myself searching the streets for one like it. Somewhere, I was convinced, the real man must exist, and him I must meet. Why, I had no idea; I only knew that he and I were in some way linked by fate. I often went to places where people gather in large numbers – political meetings, football matches, railway stations. But all in vain. I had never before realized as I then did how many different faces of man there are and how few. For all faces differ, and yet they can be grouped into few types.”

“The search became a madness with me. I neglected everything else. I stood at busy corners watching the crowd until people thought me mad, and the police began to know me and be suspicious. I never looked at women; men, men, men, all the time.”

He passed his hand over his brow as if he was very tired. “And then,” he continued. “I at last saw him. He was in a taxi driving east along Piccadilly. I turned and ran beside it for a little way and then saw an empty one coming. ‘Follow that taxi,’ I said and leaped in. The driver managed to keep it in sight and it took us to Charing Cross. I rushed on to the platform and found my man with two ladies and a little girl. They were going to France. I stayed there trying to get a word with him, but in vain. Other friends had joined the party and they moved to the train in one group.”

I hastily purchased a ticket to Folkstone, hoping that I should catch him on the boat before it sailed; but at Folkstone he got on the ship before me with his friends, and they disappeared into a large private cabin. Evidently he was a rich man.”

“Again I was defeated; but I determined to go with him, feeling certain that when the voyage had begun he would leave the ladies and come out for a walk on the deck. I had only just enough for a single fare to Boulogne but nothing could stop me now. I took up my position opposite his cabin door and waited. After half an hour the door opened and he came out, but with the little girl. My heart beat fast. There was no mistaking the face, every line was the same. He looked at me and moved towards the way to the upper deck. It was now or never, I felt.”

“Excuse me,” I stammered, “but do you mind giving me your card? I have a very important reason in asking it.”

“He seemed to be greatly surprised, as indeed well he might; but he granted my request. Slowly he took out his case and handed me his card and hurried on with the little girl. It was clear that he thought me mad and thought it wiser to please me than not.”

“Holding the card tight in my hand I hurried to a lonely corner of the ship and read it. My eyes grew dim; my head reeled; for on it were the words; Mr. Ormond Wall, with an address at Pittsburgh, U.S.A. I remember no more until I found myself in a hospital at Boulogne. There I lay in a broken condition for some weeks and only a month ago did I return.”

He was silent.

We looked at him and at one another and waited. All the other talk of the evening was nothing compared with the story of the little pale man.

“I went back,”  he started once again after a moment or so, “to Great Ormond Street and set to work to find out all I could about this American. I wrote to Pittsburgh; I wrote to American editors; I made friends with Americans in London: but all that I could find out was that he was a millionaire with English parents who had resided in London. But where? To that question I received no answer.”

“And so the time went on until yesterday morning, I had gone to bed more than usually tired and slept till late. When I woke, the room was bright with sunlight. As I always do, I looked at once at the wall on which the face is to be seen. I rubbed my eyes and sprang up. It was only faintly visible. Last night it had been clear as ever – almost I could hear it speak. And now it   was a ghost of itself.”

“I got up confused and sad and went out. The early editions of the papers were already out. I saw the headline, ‘American Millionaire’s Motor Accident.’ You all must have seen it. I bought it and read. Mr. Ormond Wall, the Pittsburgh millionaire, and party, motoring in Italy, were hit by a wagon and the car overturned. Mr. Wall’s condition was critical.”

“I went back to my room and sat on the bed looking with unseeing eyes at the face on the wall. And even as I looked, suddenly it completely disappeared.”

“Later I found that Mr. Wall died of his injuries at what I take it to be that very moment.”

Again he was silent.

“Most remarkable,” we said, “most extraordinary,” and so forth, and we meant it too.

“Yes,” said the stranger.

“There are three extraordinary, three most remarkable things about my story. One is that it should be possible for a patch on the wall of a house in London not only to form the features of a gentleman in America but also to have a close association with his life. Science will not be able to explain that yet. Another one is that the gentleman’s name should bear any relation to the spot on which his features were being so curiously reproduced by some unknown agency. Is it not so?”

We agreed with him, and our original discussion on supernatural occurrences set in again with increased excitement, during which the narrator of the amazing experience rose up and said good-night. Just as he was at the door, one of the companies recalled us to the cause of our excited debate by asking him, before he left what he considered the third most exciting thing in connection with his deeply interesting story. “You said three things, you know?” said he.

“Oh, the third thing,” he said, as he opened the door, “I was forgetting that. The third extraordinary thing about the story is that I made it up about half an hour ago. Good-night again.”

.

EV Lucas

(11 June 1868 – 26 June 1938)

Popular English Writer. 

Edward Verrall Lucas was a prolific writer with over 100 books to his credit, and particularly his essays about the game of Cricket ae still considered standard instructional material. He is also remembered as the biographer for Charles Lamb and as editor of his works.

(Story  Courtesy: http://web.iiit.ac.in/~nirnimesh/Literature/The%20Face%20on%20the%20Wall.htm)

భారతీయ స్త్రీలు… Shiv K Kumar, Indian Poet

.

ముమ్మారు వేగిన శీలవతులైన స్త్రీలు
మట్టిగోడలపై
కోపాన్ని ప్రకటించే కనుబొమల్ని చెక్కరు

ఊరిబావి గట్టుమీది
ఖాళీ కుండల్లా ఓపికగా
మిస్సిసిపీ నదంత పొడవైన సిగపాయలలో
ఒక్కొక్క అల్లికలోనూ ఆశలు పేనుకుంటూ
నీటిలో తమ నీడలు చూసుకుంటారు
తమ కళ్ళలోని చెమ్మకై వెదుకుతూ.

ఇసుకలో కాలిబొటనవేలితో ఆశల ఆకాశాల్ని చిత్రించుకుంటూ
మనసులోని పరివేదనల్ని అణుచుకుంటుంటారు
తమ భర్తల రాకకై ఎదురుచూస్తూ…
ఒక పక్క, పొద్దు మడతపెడుతున్న తమ నీడలు
దూరాన కొండలపై అంతరిస్తున్నా సరే.
.

Image Courtesy: http://en.wikipedia.org/wiki/Shiv_K._Kumar

షివ్ కె కుమార్

(ఈ పద్యంలోని సౌందర్యం చెప్పనలవి కానిది. ఇది ఇప్పుడు మృగ్యమైపోయిన ఒకనాటి పల్లెసీమల వాతావరణం చిత్రిస్తోంది. పరదేశం వెళ్ళిన పతికై ఎదురుచూస్తున్న భార్య మనః స్థితి వర్ణిస్తున్నాడు కవి ఇక్కడ. Triple-baked అన్న శబ్దాన్ని చాలా చమత్కారంగా వాడేడు. Double-baked Bread లా. Continent అన్నమాటకు ఇంద్రియనిగ్రహం అన్న అర్థం ఉంది.

విశ్వనాథ సత్యనారాయణగారు గ్రీష్మ ఋతువర్ణన చేస్తూ, ఎంతకీ వేడిమి చల్లారని రాత్రులవలన దంపతులు “అంతర్ బహిర్వహ్నితప్తులగుచు” బాధపడుతున్నారు  అని అంటారు…

ఇక్కడ కవి విరహోత్కంఠితలని వర్ణిస్తున్నాడు చాల సుకుమారంగా. జడలు పొడుగు అని చెప్పకుండనే చెబుతూ మిస్సిస్సిపి నది అంత పొడవుగా ఉన్న జడ అల్లుకుంటూ ప్రతి అల్లికలోనూ ఆశలు పెనవేసుకున్నారనడంలో ఒక సౌందర్యం ఉంటే, నీటిలో తమ కళ్ళలోని చెమ్మకోసం ప్రతిబింబాలు చూసుకున్నారనడంలో ఎంత అందం ఉందో గమనించండి. అంటే ఎంతగా ఎదురుచూసి చూసి కళ్ళు ఎండిపోయాయో! చివరగా, సూర్యాస్తమయంతో పాటు అలా అలా పక్కకి జరిగిపోతున్న తమనీడల్ని పొద్దు “ఛాయల్ని మడతపెట్టడం” గా చెప్పడం కళ్లకు కట్టించే ఒక అపురూపమైన చిత్రణ. )

.

Indian Women

In this triple-baked continent
women don’t etch angry eyebrows
on mud walls.

Patiently they sit
like empty pitchers
on the mouth of the village well
pleating hope in each braid
of their mississippi-long hair
looking deep into the water’s mirror
for the moisture in their eyes.

With zodiac doodlings on the sands
they guard their tattooed thighs
waiting for their men’s return
till even the shadows
roll up their contours
and are gone
beyond the hills.

.

SHIV K.KUMAR (b. 1921)

Indian Poet, Novelist, Playwright and Short story Writer.

Shiv K. Kumar was born in Lahore in 1921 and was educated at the local Foreman Christian College and later at Fitzwilliam College, Cambridge, from where he received his doctorate. He has travelled extensively and was a British Council Visitor at Cambridge (1961), a Research Fellow at Yale (1962), Visiting Professor at Marshall (1968) and Distinguished Professor of English at the University of Northern Iowa (1969), For a few years he was Professor and Chairman of the Department of English at the University of Hyderabad. Kumar’s poems have appeared in several Indian and foreign journals like Quest, Ariel (Leeds) and Meanjin Quarterly (Melbourne). His first collection of poems Articulate Silences was published in 1970. Since then he has published several volumes of poetry such as Cobwebs in the Sun (1974), Subterfuges (1975), Woodpeckers (1979), Broken Columns (1984) and Trap/all’s in the Sky (1987). He was awarded the Central Sahitya Academy Prize for the best writing in English in 1987. His critical writings include Bergson and the Stream of Consciousness Novel, British Romantic Poets: Recent Revaluations and British Victorian Literature: Recent Revaluations. The major themes in Kumar’s poetry are love, sex and companionship, birth and death and the sense of boredom and horror arising out of the anguish of urban life experiences. He adopts the ironic mode of a confessional poet especially in poems in which he explores the self through interaction with others. Like Robert Frost, he often selects a simple and unpretentious fact or incident and develops it into a meditative experience. Indian Women, A Mango Vendor and Rickshaw-Wallah illustrate this aspect of Kumar’s poetry. Yet another trait in his poetry is the harmonious mingling of wit, humour and irony. With a rare insight into the ridiculous aspect of a situation, experience or fact Kumar digs at follies and pretensions as seen in poems like Poet Laureate and Epitaph on an Indian Politician. 3 8 Gathered Grace Kumar is a scholarly poet with the entire range of English literature at his command. The dichotomy between the East and the West is another major theme in his poetry. Autobiographical elements overflow in poems such as Broken Columns. Kumar writes, “In view of my extensive travelling in the West, I seem to be constantly returning to the theme of cultural interaction. I feel, unconsciously, I guess, that with me contrast is almost a mode of perception. It is this awareness that compels me to recapture my days in New York as a kind of life-in- death.”

(Biographical Text and Poem Courtesy: gathered Grace, Indian Writing in English Project Gutenberg)

తేలుకుట్టిన రాత్రి… నిస్సిం ఎజకీల్, భారతీయ కవి

 

.

మా అమ్మని తేలు కుట్టిన ఆ రాత్రి నాకు బాగా గుర్తుంది.
పది గంటలపాటు ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షం
తేలుని బియ్యపుబస్తా క్రిందకి వెళ్ళేలా చేసింది.
చీకటిగదిలో ఒక్కసారి తోక జాడించి,
తోకకున్న విషం ఎక్కించి
మళ్ళీ వర్షంలోకి పారిపోయింది.

రైతులందరూ ఈగల్లా మూగిపోయేరు
వందసార్లు భగవన్నామ జపం చేసేరు
ఆ తేలు ఎక్కడుంటే అక్కడ ఆగిపోడానికి.
కొవ్వొత్తులూ, లాంతర్లూ
మన్ను మెత్తిన గోడలమీద
పేద్ద తేలులాంటి నీడలు కదులుతుండగా
దానికోసం వెతికేరు గాని, లాభం లేకపోయింది.
“ళబళబళబళబ” అంటూ నాలికతో చప్పుడుచేసేరు
దాన్ని భయపెట్టడానికి.
దాని ప్రతికదలికకీ, అమ్మరక్తంలో
విషం మీదకి ఎక్కుతుందని చెప్పేరు.
తేలు కదలకుండా  చూడాలని అన్నారు.
అమ్మతో మీరు పూర్వజన్మలో చేసిన పాపాలు
ఈ రాత్రి దహించుకుపోవాలన్నారు.
ఇప్పుడు అనుభవించిన బాధ మళ్ళీ జన్మలో
ఆమె అనుభవించబోయే కష్టాల్ని తగ్గించాలన్నారు.
ఇక్కడ చేసిన పాపాలు, పుణ్యాలలో
కొట్టుకుపోతాయిగనక ఆమె అనుభవించిన బాధకి
కొంత పాపం కొట్టుకుపోతుందన్నారు.
విషం ఆమె రక్తాన్ని శుభ్రపరచాలనీ
ఆమె కోరికలూ, ఆశలూ ఆణిగిపోవాలనీ చెప్పి
అమ్మని మధ్యలో కూచోబెట్టి
అందరూ చుట్టూ కూచున్నారు.
అందరిముఖాల్లోనూ ఆమె బాధపట్ల సానుభూతి.

మరిన్ని కొవ్వొత్తులూ, మరిన్ని లాంతర్లూ,
మరింతమంది చుట్టుపక్కలవాళ్ళూ,
మరిన్ని పురుగులూ, ఆగకుండా మరింత వాన.
మా అమ్మ నొప్పితో కింకలు చుట్టుకుపోతూ
పాపం చాపమీద అటూ ఇటూ దొర్లుతోంది.
హేతువాదీ, ఏదీ ఓ పట్టాన నమ్మని మా నాన్న
చూర్ణం, మిశ్రమం, వేరు, పసరు, ఒకటేమిటి
ప్రయత్నించని మందు లేదు…
చివరకి, కుట్టిన వేలిమీద కొంచెం పేరఫిన్ వేసి
అగ్గిపుల్ల వెలిగించేడు కూడా.
ఆ మంటకి మా అమ్మ చర్మం బొబ్బలెక్కడం చూసేను
విషబాధ నివారణకి మంత్రగాడు వచ్చి
ఏవో పూజలుచేసి మంత్రాలు చదవడం చూసేను.
అలా ఇరవై గంటలు గడిచిన తర్వాత
ఎలాగయితేనేం విషం ప్రభావం తగ్గింది.

మా అమ్మ తర్వాత ఒక్కటే మాట అంది:
భగవంతుడు చల్లగా చూడబట్టి
ఆ తేలేదో నన్ను కుట్టింది
నా పిల్లల్ని కుట్టకుండా.

.

(ఈ కవితలోని సౌందర్యమంతా ఆఖరి మాటలోనే ఉంది. అటువంటి తల్లులు ఎక్కడ చూసినా కనపడతారు. ఆ చివరి మాటలతో పద్యాన్ని ఎన్నోవేలమైళ్ల ఎత్తుకు తీసికెళ్ళిన కవి, దానికి ముందు మన మనసును ఎంతచక్కగా విషయంలోనే మగ్నంచేసి ఉంచుతూ ముగింపు ఏమిటయి ఉంటుద్దబ్బా అన్న ఆలోచనరానీకుండా కవిత నిర్వహించేడు. అందులోనే కవి రచనా చమత్కారం, ప్రతిభా దాగున్నాయి. గమనించండి.)

నిస్సిం ఎజకీల్ స్వాతంత్రానంతర భారతీయ ఆంగ్లసాహిత్యంలో పేర్కొనదగ్గ ముందుతరం కవులలో ఒకరు. ఆయన కవీ, నాటక రచయితా, సంపాదకుడూ, కళావిమర్శకుడూ. Later-day Poems అన్న కవితా సంకలనానికి 1983లో ఆయనకి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. అదిగాక ఇంకా అతను చాలా కవితా సంకలనాలు వెలయించారు.

Nissim Ezekiel
Nissim Ezekiel (Photo credit: Wikipedia)

నిస్సిం ఎజకీల్

(16 December 1924 – 9 January 2004)

.

English Original:   Night of the Scorpion

.

I remember the night my mother
Was-stung by a scorpion. Ten hours
of steady rain had driven him to crawl beneath a sack of rice.
Parting with his poison— flash
of diabolic tail in the dark room—
he risked the rain again.
The peasants came like swarm of flies
and buzzed the name of God a hundred times
to paralyze the Evil One.
With candles and with lanterns
throwing giant scorpion shadows
on the mud-baked walls
they searched for him: he was not found.
They clicked their tongues.
With every movement that the scorpion made
his poison moved in mother’s blood, they said.
May he sit still, they said.
May the sins of your previous birth
be burned away tonight, they said.
May your suffering decrease
the misfortune of your next birth, they said.
May the sum of evil
balanced in this unreal world
against the sum of the good
become diminished by your pain, they said
May the poison purify your flesh
of desire, and your spirit of ambition,
they said, and they sat around
on the floor with my mother in the centre,
the peace of understanding on each face.
More candles, more lanterns, more neighbours,
more insects, and the endless rain.
My mother twisted through and through
groaning on a mat.
My father, sceptic, rationalist,
trying every curse and blessing,
powder, mixture, herb and hybrid.
He even poured a little paraffin
upon the bitten toe and put a match to it.
I watched the flame feeding on my mother.
I watched the holy man perform his rites
to tame the poison with an incantation.
After twenty hours
it lost its sting.

My mother only said,
Thank God the scorpion picked on me
and spared my children.
.
Nissim Ezekiel,

(16 December 1924 – 9 January 2004)

Indian Jewish Poet, Playwright, Editor and art-critic. One of the leading writers of Indo-anglian Literature in post-independence era. For his collection of  Poems “Latter-day Psalms”  he received Central Sahitya Akademi award in 1983.  The Bad Day (1952), Ten Poems, The Deadly man (1962), The Exact Name (1965) are some of his other collections of poetry.  He also published “Three Plays”  in 1969.


 

The Ultimate Survivor … Vinnakota Ravi Sankar, Indian Poet

.

Gradually
Life becomes
a reconciliation to death.
Instead of pigeons, now
Lapwings carry messages.

The smiling faces
of the childhood group-photo
leave one by one
searching for their own.

Not only the actors,
even the audience recede
one after another.
There will be nobody left
on either side,
to share tears
for the tragedy on the stage.

Besides shedding its leaves,
The deciduous Family Tree
sheds its roots as well
intermittently.

After all tangles are disentangled
and all strings are snapped,
a wizened spiritless frame remains
like the sole thread
connecting it to the Nature.
.

Photo Courtesy: Vinnakota Ravi Sankar

Vinnakota Ravi Sankar

Mr. Vinnakota Ravi Sankar is living in Columbia, South Carolina, USA for the last 14 years. He has to his credit three collections of poetry in Telugu published so far — kuMDeelO marri ceTTu (The Bunyan in a Flowerpot) (1993), vEsavi vaana(Summer Rain) (2002) & remDO paatra (The Second Role)(2010).

.

తెలుగు మూలం:

ఆఖరి మనిషి
.

క్రమక్రమంగా
మరణానికి అలవాటుపడటమే
జీవితంగా మారిపోతుంది.
పావురాలకి బదులు తీతువు పిట్టలు
ఉత్తరాలు మోసుకువస్తాయి.

చిన్నప్పటి గ్రూప్ఫోటోలో
చిరునవ్వులు చిందించినవారంతా
ఎవరి ఫొటో వారు వెతుక్కుని
వెళ్ళిపోతారు

నటులేకాదు, ప్రేక్షకులు కూడా
ఒకరొకరుగా నిష్క్రమిస్తారు.
రంగస్థలం మీది విషాదానికి
కలిసి కన్నీరు పెట్టటానికి
ఇరువైపులా ఎవరూ కనబడరు

ఆకులతోబాటు
ఈ “సంసారవృక్షం”
వేళ్ళు కూడా ఒకటొకటిగా
పోగొట్టుకుంటుంది

అన్ని ముడులూ విడిపోయాక
అన్ని తీగలూ తెగిపోయాక
ప్రపంచంతో కలిపే ఏకైక సూత్రంలా
శుష్కించిన ఒక శరీరం
మిగిలిపోతుంది.

.

విన్నకోట రవిశంకర్

%d bloggers like this: