Last Night … తిలక్

When God came to me last night
looking wan and sat downcast by my bedside
tell me, did I speak any thing? did I really say anything?

Did I mention to Him about the promising boy
so full of hope, and after failing in everything,
took away his life out of hunger?

Did I speak about the young damsel
who dragged out her life selling her youth,
got tired of it, and one fine evening committed suicide?

Did I unveil the heart-break of the granny
who jumped into the river
hearing the news of her son’s death in the war with China?

Did I brief Him about the agony of the peoples
or about the acrid smell of time burning
in Congo, Cuba, Cyprus and Laos.

Tell me, tell me honestly
did I ask Him anything about you, or me
or about the decadence of the world
Or did I compel, blame or accost Him
to speak about the venom
that filled the serene comely hearts.

I know I know where lies the weakest link in the chain
I know I know
That’s why, when I saw the pitiful tears
rolling down his cheeks
in the reflection of the lamp,
I got up suddenly seized with compassion,
embraced Him, dried His tears, and consoled
and bade Him good bye,
escorting him up to the turn of the street.

I know I know
When man turns out to be a Satan
Poor old man! what can He do?
After all, he is His own making.

Image Courtesy: https://www.facebook.com/pages/Devarakonda-Bala-Gangadhara-Tilak/116860905055361

Tilak (21 August 1921 – 1966)

Poet  and Short Story Writer

Devarakonda Balagangadhara Tilak was one of the few young poets who were famous before  their poems were published in an anthology. Amrutam Kurisina Ratri (The Night When Nectar Rained) was his first collection of poems published posthumously and it received Central Sahitya Akademi Award in 1970. He was at ease with classical poetry as well and some of his poems appeared in the then benchmark journal of Telugu literature “Bharati”.

.

నిన్న రాత్రి …
.
ఒక మాట చెప్పు
నిన్న రాత్రి దేముడువచ్చి నా మంచం మీద కూర్చొని
దీనంగా నా కేసి చూసి కన్నులు దించుకున్నాడు
ఏమైనా అన్నానా? నే నేమైనా అన్నానా?

ఆకలి అని ఆశలుగొని అన్నింటా విఫలుడై
ఆత్మహత్యచేసుకున్న అబ్బాయిని గురించి అడిగానా?
అమ్ముకొని యౌవనం, అలసిన జీవనం,
సాగించి సాగించి సంధ్యవేళ ఉరితీసుకున్న
సానిపడుచు మాట చెప్పానా?
చీనాతో యుద్ధంలో చితికిన కొడుకువార్తవిని
చీకట్లో ఏట్లో దూకిన ముసలిదాని పసరుగుండె
నే చూపించానా?
కాంగోలో, క్యూబాలో, సైప్రెస్ లో లావోస్ లో
కాలి కమురుకంపుకొట్టే కాలం కథ, మానవ వ్యధ
నే వివరించానా?

నిజం చెప్పు నిజం చెప్పు

నిన్ను గూర్చి, నన్నుగూర్చి
నిఖిల సృష్టిలోని ఖిలం గూర్చి
నీరవ సుందర హృదయపాత్ర
నిండిన కాలాహలం గూర్చి
నిజం చెప్పమని అడిగానా? నిందించానా?నిలదీసానా?

నాకు తెలుసు నాకు తెలుసు గొలుసులోని అసలు కిటుకు

నాకు తెలుసు నాకు తెలుసు
దేవుని చెక్కిళ్ళమీద దీనంగా జారే కన్నీటిని
దీపకాంతిలో చూసి చటుక్కున జాలితో లేచి
కౌగిలించి ఊరడించి
కన్నీటిని తుడిచి
వెళ్ళిరమ్మని వీధిచివరిదాకా సాగనంపి వచ్చాను

నాకు తెలుసు నాకు తెలుసు

మానవుడె దానవుడై తిరగబడినప్పుడు
పాపం పెద్దవాడు… కన్న కడుపు… ఏం చేస్తాడని?

దేవరకొండ బాలగంగాధర తిలక్

“Last Night … తిలక్” కి 4 స్పందనలు

  1. goppa hrudhayam tho raasina kavitha, nissahayatha kooda.
    thank you sir.

    మెచ్చుకోండి

  2. When man turns out to be a Satan
    Poor old man! what can He do?

    — తిలక్ పేథోస్‌ని సరిగ్గా పట్టుకున్నారు.

    మెచ్చుకోండి

    1. Thank Phaneendra garu for the compliment.
      with best regards

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: