బుడగా… బండరాయీ… లూయిజా మే ఏల్కోట్

Image Courtesy: http://t3.gstatic.com

.

ఓహ్! బోడిగా, గోధుమ రంగులో ఉన్న ఆ బండరాయి,
తన పాదాల చెంత కెరటాలు నృత్యం చేస్తుంటే
చూడ్డానికి ఎంత మనోహరంగా ఉంది!

ఒకసారి ఓ చిన్న నీటిబుడగ
అలలమీద తేలుతూ బండరాయి పక్కకి వచ్చి,
గట్టిగా అరుస్తోంది:
“ఏయ్ మొద్దూ!
త్వరగా పక్కకి తప్పుకో.
కనిపించటం లే? ఈ అలలమీద తేలియాడే
అందాన్ని నే వస్తుంటే?

చూడు హరివిల్లులాంటి నా ఆహార్యం.
చూడు నా వెలుగు కిరీటాన్ని.
నా మెరిసే సొగసూ,
గాలిలా తేలిపోగలిగే నా ఆకారాన్నీ.

నురగలతో, తుంపరలతో
తీరాన్న నర్తించడానికి
ఈ నీలికెరటాలమీద తేలియాడుతున్నాను.

ఊ! త్వరగా, త్వరగా పక్కకి జరుగు.
కెరటాలు ఉధృతంగా ఉన్నాయి.
వాటి పాదతరంగాలు
నన్ను ఒడ్డుకి త్వరగా తీసుకుపోతాయి.

కాని, ఆ బండరాయి నీటిలో నిటారుగా నిల్చుని
ఒక్కసారి క్రిందకి ఒక్కసారి తీక్షణంగా చూసి,
అంతలో సంబాళించుకుని
చిరునవ్వుతో ఇలా అంది:

“చిన్ని నా మిత్రమా!
నువ్వే మరొక త్రోవ వెతుక్కోవాలి.
నేను ఇక్కడనుండి ఎన్నో ఏళ్ళుగా
కదలకుండా పడి ఉన్నాను

“ఉప్పెనలాంటి కెరటాలు నన్ను తోసాయి,
ఉధృతమైన గాలులూ తాకేయి.
కాని, ఏవీ ఈ ఆకారాన్ని
ఒక్క అడుగుకూడా కదల్చలేకపోయాయి.

“నీటిలోగాని, గాలిలోగాని ఉన్నదేదీ
నన్ను కదల్చ లేదే.
మిత్రమా నీకోసం నేనెలా కదలగలను చెప్పు?”

అది విని కెరటాలన్నీ
సన్నని కంఠస్వరంలో మధురంగా నవ్వేయి.
నీటిపక్షులుకూడా తమ రాతి గూళ్లలోనుండి
విలాసంగా ఉన్న బుడగని ఒకసారి చూసేయి

ఆ బుడగకి అమాంతం కోపంవచ్చి,
బుగ్గలు ఎరుపెక్కి,
మితిమీరిన గర్వంతో ఇలా అంది:

“ఏయ్, వికారపు బండరాయీ!
నువ్వు నాకోసం పక్కకి తప్పుకుంటున్నావు.
తప్పుకోవాలి. అర్థం అయిందా?

“ఓయ్ పక్షులూ!
ఎందుకలా తేరిపారి చూస్తున్నారు?
నిశ్శబ్దంగా ఉండండి.

“అనాగరికపు కెరటాల్లారా!
మీ నవ్వులు కట్టిపెట్టి
నన్ను ముందుకి మోసుకెళ్ళండి.
ఈ సముద్రానికి రారాణిని నేను.
ఈ మొరటు రాళ్ళు నన్ను భయపెట్టలేవు”

కోపంతో పైకిలేచి నిందిస్తూ
ఒక్కసారి రాతిని కొట్టి పగిలిపోయింది
తెలివితక్కువ బుడగ.
బండరాయిమాత్రం
ఎంతమాత్రం కదలలేదు.

అప్పుడు గూళ్ళలోని నీటి పక్షులు
తమ గుండెలమీద పడుక్కున్న
చిన్నారులతో ఇలా అన్నాయి:

మీరు ఆ బుడగలా బుర్ర తిరుగుడుగా,
అహంకారంతో, అసభ్యంగా ఉండకండి.
దౌర్జన్యంగానైనా మీ పనులు
నెరవేర్చుకుందికి ప్రయత్నించకండి

ఆ రాయిలా నిశ్చలంగా,
నిజాయితీగా, ధృడంగా ఉండండి.
తప్పు చేసినవారిపట్ల
ఖచ్చితంగాఉంటూనే,
దయతో, ప్రసన్నతతో ఉండడం
ఎంతమాత్రం మరిచిపోవద్దు.

“చిన్నారులూ,
ఇవాళ మీరు నేర్చుకున్న
ఈ గుణపాఠం శ్రధ్ధగా గుర్తుంచుకుంటే,
మీరు వివేకవంతులౌతారు.

.

లూయిజా మే ఏల్కోట్

(November 29, 1832 – March 6, 1888)

(లూయిజా మే ఏల్కోట్ అనగానే ఛప్పున గుర్తువచ్చేది Little Women అన్న నవల (అమెరికనుసివిల్ వార్ నేపథ్యంలో రాయబడిన ఈ నవల అనంతరం నాటకంగా మలచబడింది.  5సార్లు తెరకెక్కింది. 1949 సినిమాలో ఎలిజబెత్ టేలర్ Amy March గా నటించింది).  రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, హెన్రీ డేవిడ్ థొరోల వంటి హేమాహేమీల ప్రభావంతో పెరిగిన అమ్మాయి స్వతంత్రభావాలు లేకుండా ఎలాఉంటుంది? చిన్నప్పటినుండే తన రచనలద్వారా కుటుంబానికి ఆర్థికసహాయం చెయ్యవలసి వచ్చిన ఈమె, బానిసత్వ నిర్మూలనకు వ్యతిరేకంగా తనగొంతు వినిపించింది. )

.

Louisa May Alcott
Louisa May Alcott (Photo credit: Wikipedia)

The Rock and the Bubble

.

Oh! a bare, brown rock
Stood up in the sea,
The waves at its feet
Dancing merrily.

A little bubble
Once came sailing by,
And thus to the rock
Did it gayly cry,–

“Ho! clumsy brown stone,
Quick, make way for me:
I’m the fairest thing
That floats on the sea.

“See my rainbow-robe,
See my crown of light,
My glittering form,
So airy and bright.

“O’er the waters blue,
I’m floating away,
To dance by the shore
With the foam and spray.

“Now, make way, make way;
For the waves are strong,
And their rippling feet
Bear me fast along.”

But the great rock stood
Straight up in the sea:
It looked gravely down,
And said pleasantly–

“Little friend, you must
Go some other way;
For I have not stirred
this many a long day.

“Great billows have dashed,
And angry winds blown;
But my sturdy form
Is not overthrown.

“Nothing can stir me
In the air or sea;
Then, how can I move,
Little friend, for thee?”

Then the waves all laughed
In their voices sweet;
And the sea-birds looked,
From their rocky seat,

At the bubble gay,
Who angrily cried,
While its round cheek glowed
With a foolish pride,–

“You SHALL move for me;
And you shall not mock
At the words I say,
You ugly, rough rock.

“Be silent, wild birds!
While stare you so?
Stop laughing, rude waves,
And help me to go!

“For I am the queen
Of the ocean here,
And this cruel stone
Cannot make me fear.”

Dashing fiercely up,
With a scornful word,
Foolish Bubble broke;
But Rock never stirred.

Then said the sea-birds,
Sitting in their nests
To the little ones
Leaning on their breasts,–

“Be not like Bubble,
Headstrong, rude, and vain,
Seeking by violence
Your object to gain;

“But be like the rock,
Steadfast, true, and strong,
Yet cheerful and kind,
And firm against wrong.

“Heed, little birdlings,
And wiser you’ll be
For the lesson learned
To-day by the sea.”

.

Louisa May Alcott

(November 29, 1832 – March 6, 1888)

American Novelist.

“బుడగా… బండరాయీ… లూయిజా మే ఏల్కోట్” కి 4 స్పందనలు

  1. ఆ రాయిలా నిశ్చలంగా,
    నిజాయితీగా, ధృడంగా ఉండండి.
    తప్పు చేసినవారిపట్ల
    ఖచ్చితంగాఉంటూనే,
    దయతో, ప్రసన్నతతో ఉండడం
    ఎంతమాత్రం మరిచిపోవద్దు.

    పాలకులకు ఇది అర్ధం కావటం లేదు.

    మెచ్చుకోండి

    1. శర్మగారూ,
      మీరన్నది అక్షరాలా నిజం. రాజకీయనాయకులు ఎప్పుడైతే రాజ్యాంగేతర శక్తులుగా ఎదిగిపోయారో, ప్రజలు వాళ్లకి అక్కరలేని ప్రాముఖ్యతనీ, మేధోశక్తినీ అంటగట్టడం ప్రారంభించారో మనకీ దౌర్భాగ్యాలన్నీ పట్టుకున్నాయి. బుద్బుదప్రాయమైన అధికారం పరిధిలోనే వామనావతారం ప్రదర్శించాలని చూస్తారు. భర్తృహరి చెప్పినట్టు, ఇసకలోంచి అయినా తైలం తీయవచ్చునేమో గాని, ఈ బుద్ధిజాడ్యజనితోన్మాదులైన ఈ రాజకీయ నాయకులకి వివేకం తెప్పించడం కష్టం.
      అభివాదములతో

      మెచ్చుకోండి

  2. konda , elukala samvadam la undi, chaalaa chinna amsanni, goppaga rayagaligaru,

    మెచ్చుకోండి

    1. Bhaskar garu,
      That is the beauty of her writing. Simple yet, powerful.

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: