శాశ్వతత్వం … ఎమిలీ డికిన్సన్.

కొందరు శాశ్వతత్వం కోసం కృషిచేస్తారు
చాలామందికి తక్షణ ప్రయోజనాలుకావాలి.
వీరికి ఫలితం వెంటనే లభిస్తే
మొదటివారికి కీర్తి…భావి చెక్కులుగా దొరుకుతుంది

అది చాలా మెల్లిగా లభ్యమౌతుంది… కాని శాశ్వతం.
ఈ రోజుకి లభించే బంగారం మాత్రం
నిత్యం చెల్లుబాటయే ఆ నాణేలతో పోలిస్తే
వెలవెలపోతుంది

అక్కడక్కడ ఉంటారు… నిర్భాగ్యులైనా
స్టాకుబ్రోకరుని మించిన సూక్ష్మబుద్ధిగల మదుపుదారులు
బ్రోకర్లకి కేవలం డబ్బులు మాత్రమే దక్కితే
వాళ్ళకి దక్కేది … అంతులేని భాగ్యాల గని.

  .

Emily dickinson
Emily Dickinson (Photo credit: Wikipedia)

ఎమిలీ డికిన్సన్.

(డిసెంబర్ 10, 1830 – మే 15, 1886)

అమెరికను కవయిత్రి

పైకి లౌకిక ప్రవృత్తిని విమర్శిస్తున్నట్టు కనిపిస్తున్నా, ఈ కవితలో తాత్విక చింతన ఉంది. చాలా మంది ఇహంలో దొరికే తక్షణప్రయోజనాలూ, ప్రలోభాలకోసం పాకులాడుతుంటే, కొందరు పరమ దుర్భరమైన జీవితం గడుపుతున్నా, పరానికి సంబంధించిన మదుపు (Investment) చేసుకుంటున్నారని కవయిత్రి చెబుతోంది. ఆమెకు తన జీవితకాలంలో తన సాహిత్యంవల్ల పేరుగాని, ధనంగాని చేకూరలేదు. కాని భవిష్యత్తులో తన కవిత్వాన్ని ఆదరించగల పాఠకులు ఉంటారన్న విశ్వాసమో, లేదా పరలోకంలో తన కృషికి తగిన పారితోషికం లభిస్తుందన్న నమ్మకమో, బహుశా, ప్రపంచానికి దూరంగా, ఏకాంతంలో 1800 కి పైగా కవితలు వ్రాయడానికి ప్రేరణ కావచ్చు. చిత్రంగా ఆమె మరణం తర్వాత చెల్లెలు లవీనియా చూసేదాకా ఆమె అంత సాహిత్య సృష్టిచేసిందన్న విషయం కూడా కుటుంబసభ్యులెవరికీ తెలీదు.

.

Some — Work for Immortality

(406)

.

Some—Work for Immortality—
The Chiefer part, for Time—
He—Compensates—immediately—
The former—Checks—on Fame—

Slow Gold—but Everlasting—
The Bullion of Today—
Contrasted with the Currency
Of Immortality—

A Beggar—Here and There—
Is gifted to discern
Beyond the Broker’s insight—
One’s—Money—One’s—the Mine—

.

Emily Dickinson

(December 10, 1830 – May 15, 1886)

American Poet

“శాశ్వతత్వం … ఎమిలీ డికిన్సన్.” కి 2 స్పందనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: