అనువాదలహరి

Carry On… RW Service

.

అన్నీ అనుకున్నట్టు జరుగుతున్నంతసేపూ పోరాడడం సుళువే
గెలుపు ఇచ్చే పులకరింతలూ, ప్రఖ్యాతీ మత్తెక్కిస్తాయి;
విజయం దాపుల్లో ఉన్నంత సేపూ ఉత్సాహపరచడం సుళువే
విజయధ్వానాలుచేసుకుంటూ అక్కడ రుధిరభూమిలో దొర్లవచ్చు.
అనుకున్నది ఏదీ జరగనప్పుడే పరిస్థితి వేరు;
మానవమాత్రులమేనన్న వేదన ముసురుకున్నపుడూ
గెలుపు పదింటిలో ఒకటిగా అనిపించి, ఆశలణగారిపోతున్నప్పుడు
నడుం బిగించు ఓ నా యువ సైనికుడా! చిరునవ్వు చెదరనీకు.

ముందుకి సాగిపో! ముందుకి సాగిపో!
నీ ముష్టిఘాతాల్లో మునపటి బలం లేకపోవచ్చు
నువ్వుతిన్న దెబ్బలకి, సొమ్మసిల్లిపోతూ,
గుడ్డిగా చెయ్యివిసురుతూ ఉండవచ్చు
ఒళ్ళంతా చెమటలు కక్కుతూ, రక్తాలోడుతుండవచ్చు, ఫర్వాలేదు
మరొక్క క్షణం, మరొక్క క్షణం నిగ్రహించుకో!
నీలో ఇంకా జీవం ఉంది
ప్రాణాలుపోతున్నట్టనిపించవచ్చు, కానీ ఊపిరున్నంతవరకు
నీ పోరాటం సాగించరా, తండ్రీ! పోరాటం కొనసాగించు!

జీవితపోరాటంలోనూ అంతే.
గెలుస్తున్నంతసేపూ పోరాడడం సులభం
గెలుపు సూర్యోదయంలా తొంగిచూస్తున్నప్పుడు
శత్రువుని బంధించి, హింసించి ధైర్యంగా నిలబడొచ్చు
కానీ, నిరాశనీ, పరాజయాన్నీ ఎవడు సంతోషంగా
స్వీకరించగలడో, వాడిని దేముడు మెచ్చుకుంటాడు
ఆ దివ్యమైన ప్రమాణాలకు అనుగుణంగా ఎవడు పోరాడుతాడో
వాడే, ఓటమి అంచుల్లో కూడా ధైర్యంగా  పోరాడగలడు.

పోరాటం కొనసాగించు! పోరాటం కొనసాగించు!
మునుపెన్నడూ భవిష్యత్తు ఇంత అంధకారంగా కనిపించి ఉండకపోవచ్చు
కానీ, నీలో పిరికిదనం లేదని చూపించు
దురదృష్టంవెన్నాడినా, నువ్వు బలహీనుడవుగాదని నిరూపించు
పోరాటం కొనసాగించు! పోరాటం కొనసాగించు!
మరొక దాడిచెయ్యడానికి సిద్ధం కా
నరకప్రాయంగా కనిపించవచ్చు— కానీ, ఏమో, ఎవరు చెప్పగలరు?
ముందుకి సాగిపో, యుద్ధవీరుడా, ముందుకి సాగిపో!

కొందరు అనుమానపుటెడారులలో దారితప్పిపోతారు
కొందరు మూర్ఖత్వంలో మగ్గుతుంటారు
మరికొందరు భక్తిమార్గం పట్టెస్తారు
ఎలాగూ వెళ్లవలసింది స్వర్గానికేగదా అని.
కాని ఇష్టంతో కష్టపడడంలోనూ
మన అత్యున్నత నైపుణ్యాన్ని చూపించడంలోనూ
ఇవ్వడంలోని తియ్యదనమూ, ఆనందమూ ఆస్వాదించడంలోనూ
ఆడుటూ పాడుతూ చేయూత అందించడంలోనూ,
అన్నెందుకు, అసలు జీవితంలోనే ఎంతో వెలుగు ఉంది.

ముందుకి సాగిపో! ముందుకి సాగిపో!
జరిపినపుడు అసలు సిసలైన పోరాటం జరుపు
నీ జీవితాశయం మీద నమ్మకం ఉంచుకో,
జీవితాన్ని నవ్వుతూ పలకరించు
నువ్వు చెయ్యవలసిన ఘనకార్యాలు చాలా ఉన్నాయి,
అందుకే నువ్విక్కడకు వచ్చింది.
ముందుకు సాగిపో! ముందుకు సాగిపో!
ఈ ప్రపంచాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దు
నీ తుదిశ్వాస విడిచేటప్పుడు
ఇది నీ మరణ నినాదం కావాలి:
ముందుకి సాగిపో! నా ప్రాణమా! ముందుకి సాగిపో!

.

Image Courtesy: http://en.wikipedia.org/wiki/Robert_W._Service

రాబర్ట్ విలియం సెర్విస్

(January 16, 1874 – September 11, 1958)

.

Carry On

.

It’s easy to fight when everything’s right,
And you’re mad with the thrill and the glory;
It’s easy to cheer when victory’s near,
And wallow in fields that are gory.
It’s a different song when everything’s wrong,
When you’re feeling infernally mortal;
When it’s ten against one, and hope there is none,
Buck up, little soldier, and chortle:

Carry on! Carry on!
There isn’t much punch in your blow.
You’re glaring and staring and hitting out blind;
You’re muddy and bloody, but never you mind.
Carry on! Carry on!
You haven’t the ghost of a show.
It’s looking like death, but while you’ve a breath,
Carry on, my son! Carry on!

And so in the strife of the battle of life
It’s easy to fight when you’re winning;
It’s easy to slave, and starve and be brave,
When the dawn of success is beginning.
But the man who can meet despair and defeat
With a cheer, there’s the man of God’s choosing;
The man who can fight to Heaven’s own height
Is the man who can fight when he’s losing.

Carry on! Carry on!
Things never were looming so black.
But show that you haven’t a cowardly streak,
And though you’re unlucky you never are weak.
Carry on! Carry on!
Brace up for another attack.
It’s looking like hell, but — you never can tell:
Carry on, old man! Carry on!

There are some who drift out in the deserts of doubt,
And some who in brutishness wallow;
There are others, I know, who in piety go
Because of a Heaven to follow.
But to labour with zest, and to give of your best,
For the sweetness and joy of the giving;
To help folks along with a hand and a song;
Why, there’s the real sunshine of living.

Carry on! Carry on!
Fight the good fight and true;
Believe in your mission, greet life with a cheer;
There’s big work to do, and that’s why you are here.
Carry on! Carry on!
Let the world be the better for you;
And at last when you die, let this be your cry:
Carry on, my soul! Carry on!

Robert William Service

(January 16, 1874 – September 11, 1958)

English Poet and writer

Further reading: http://en.wikipedia.org/wiki/Robert_W._Service

%d bloggers like this: