అనువాదలహరి

బాధ … సారా టీజ్డేల్

A mother holds up her child.
A mother holds up her child. (Photo credit: Wikipedia)

కెరటాలు సముద్రపు శ్వేత పుత్రికలు

చిరు చినుకులు ఆ వర్షపు చిన్ని పిల్లలు

నులివెచ్చని నా తనువున

ఏ మూలనో మాతృత్వపు తీపు?

.

రాత్రి ఈ తారకలకు మాతృమూర్తి

నురగలని చేతుల్లోకెత్తుకుని ఆడిస్తోంది గాలితల్లి

విశ్వమంతా సౌందర్యంతో పొంగిపొర్లుతోంది

కానీ, నేనే ఇంటిపట్టున ఉండిపోవాలి

.

English: Filsinger, Sara Teasdale, Mrs., portr...
English: Filsinger, Sara Teasdale, Mrs., portrait photograph. (Photo credit: Wikipedia)

సారా టీజ్డేల్

మాతృత్వ కాంక్ష ఎలా ఉదయిస్తుందో సారా టీజ్డేల్ ఈ కవితలో చక్కగా చెప్పింది. ఆ కాంక్ష మనసులో రగిలినప్పుడు ప్రకృతిలోని సమస్త వస్తువులూ మాతృత్వపు ప్రతిబింబాలుగా కనపడినట్టు చెప్పడం ఎంత కమ్మని ఊహ!

.

Pain

Waves are the sea’s white daughters,
And raindrops the children of rain,
But why for my shimmering body
Have I a mother like Pain?

Night is the mother of stars,
And wind the mother of foam —
The world is brimming with beauty,
But I must stay at home.

.

Sara Teasdale

August 8, 1884 – January 29, 1933

American Lyrical Poet

%d bloggers like this: