అనువాదలహరి

గాలి ఘోషిస్తోంది … బాబ్ డిలన్

Hunger Deaths

.

మనిషిని మనిషిగా గుర్తించడానికి

అతను ఇంకా ఎంత దూరం నడవాలి?

ఆ తెల్లని పావురం ఇసుకలో నిద్రించడానికి

ఇంకా ఎన్ని సముద్రాలు దాటాలి?

అవును, ఎన్ని ఫిరంగి గుళ్ళు ఇంకా గాలిలో ఎగరాలి

వాటిని శాశ్వతంగా నిషేధించడానికి?

మిత్రమా! దీనికి సమాధానం

గాలి ఘోషిస్తోంది, గాలి ఘోషిస్తోంది.

.

అవును, ఇంకా ఎన్ని సంవత్సరాలని పర్వతం నిల్చోవాలి

అది సముద్ర స్నానం చెయ్యడానికి?

అవును, ఎన్ని సంవత్సరాలు ఇంకా మనుషులు బతికి బట్టకట్టాలి,

వాళ్ళని స్వతంత్రంగా జీవించనివ్వడానికి?

నిజం, ఇంకా ఎన్నిసార్లు మనిషి తనముఖం పక్కకి తిప్పుకోవాలి,

తను చూడనట్టు నటిస్తున్నదాన్ని చూడడానికి?

మిత్రమా! దీనికి సమాధానం

గాలిఘోషిస్తోంది, గాలిఘోషిస్తోంది.

.

ఎన్నిసార్లు మనిషి ఇంకా తలెత్తి పైకి చూడాలి,

ఆకాసాన్ని చూడగలగడానికి?

అవును, మనిషికి ఇంకా ఎన్ని చెవులుండాలి,

ప్రజల ఏడుపులు అతను వినగల్గడానికి?

నిజం, ఇంకా ఎన్ని చావులు చూడాలి,

అమ్మో చాలా మంది చనిపోయారే అని గుర్తించడానికి?

మిత్రమా! దీనికి సమాధానం

గాలి ఘోషిస్తోంది, గాలి ఘోషిస్తోంది.  (విను!)

.

Bob Dylan performing at St. Lawrence Universit...
Bob Dylan performing at St. Lawrence University in New York. (Photo credit: Wikipedia)

బాబ్ డిలన్

(ఈ పాటలోని ఆవేదన స్వయం ప్రకటితం. దీనికి వ్యాఖ్యానం అక్కరలేదు. ఇది మన భారతదేశానికీ, మన ఆంధ్రరాష్ట్రానికి అక్షరాలా సరిపోతుంది.ఇంకా ఎంతదోచుకోవాలి, ఈ దేశసంపద దోచుకోబడుతోందని ప్రజలు అర్థంచేసుకుందికీ, ప్రభుత్వాలు దాన్ని అరికట్టడానికి ప్రయత్నాలు చేయడానికీ? ఇంకా ఎంత విషాదం కమ్ముకోవాలి కవులకి తమ నత్తగుల్లల్లోంచి బయటికి రావడానికి? ఇంకా ఎంతమంది నిజాయితీపరులు  మాఫియాలచేతుల్లో చనిపోవాలి,ప్రభుత్వాలు మాఫియాలనుండి నిజాయితీ పరులైన ఉద్యోగుల్ని రక్షించుకుందికి? ఇంకా ఎంత అవినీతి పెరిగిపోవాలి, ప్రజలు దానిపై పోరాటం సాగించడానికీ, భావితరాలకి ఏమీ మిగలడం లేదని  గుర్తించడానికి? దీనికి సమాధానాలు గాలిఘోషిస్తోంది. వినడానికి మనకి ఇంకెన్ని చెవులు కావాలో తెలీదు. ఈ పాటని కవిస్వరంలోనే విని చూడండి. మాటలే కాదు, అతని మనసుకూడా ఎంతగా రోదిస్తోందో   తెలుసుకోడానికి.)

.

Blowing in the Wind.. Bob Dylan

.

How many roads most a man walk down
Before you call him a man ?
How many seas must a white dove sail
Before she sleeps in the sand ?
Yes, how many times must the cannon balls fly
Before they’re forever banned ?
The answer my friend is blowin’ in the wind
The answer is blowin’ in the wind.

Yes, how many years can a mountain exist
Before it’s washed to the sea ?
Yes, how many years can some people exist
Before they’re allowed to be free ?
Yes, how many times can a man turn his head
Pretending he just doesn’t see ?
The answer my friend is blowin’ in the wind
The answer is blowin’ in the wind.

Yes, how many times must a man look up
Before he can see the sky ?
Yes, how many ears must one man have
Before he can hear people cry ?
Yes, how many deaths will it take till he knows
That too many people have died ?
The answer my friend is blowin’ in the wind
The answer is blowin’ in the wind.

.

Bob Dylan

Born as Robert Allen Zimmerman on May 24, 1941, is an American singer-songwriter, musician and artist.

For further reading: http://en.wikipedia.org/wiki/Bob_Dylan

%d bloggers like this: