అనువాదలహరి

లండను నగర దృశ్యం.4.. శ్మశానవాటి… లెటిషా ఎలిజబెత్ లాండన్

.

The Humans Meditate on the Tiger's Grave
The Humans Meditate on the Tiger’s Grave (Photo credit: premasagar)

నిన్ను బ్రతిమాలుకుంటా  ఈ చివికిపోతున్న
ఎముకలమధ్య నన్ను సమాధిచెయ్యొద్దు.
కిక్కిరిసిపోతున్న ఈ రాళ్ళగుట్టలు
నేలను మరీ గట్టిగా ఒత్తుతున్నాయి.

వాళ్ళ ఆడంబరాలతో, ఆనందాలతో
జన జీవితం మరీ చేరువగా ఉంది;

ప్రాపంచికసుఖాలకు అలవాటుపడ్డ ఈ నేలమీద
నిన్ను బ్రతిమాలుకుంటా, సమాధిచెయ్యవద్దు

ఎడతెరిపిలేని ఈ వాహనాల చప్పుళ్ళు
చనిపోయిన వాళ్ళకి నిద్రాభంగంచేస్తాయి
ఓహ్, నా తలమీంచి ఇలా జీవితం రాదారివెయ్యడం
నేను జన్మజన్మలకీ భరించలేను.  

ఇక్కడ స్మృతిఫలకాలు, నిస్తేజంగా, బావురుమంటున్నాయి
అవి దేనికదే ఒంటరిగా నిలబడి ఉంటున్నాయి
చనిపోయిన వాళ్లకై వగవడానికి
ఇక్కడ ఎవరూ ఎప్పుడూ ఒక క్షణమైనా ఆగరు.

ఇక్కడ వద్దు. నన్ను దూరంగా ఎక్కడో
పొలాల్లో వేసవి ఎండ పలకరించే చోట సమాధిచెయ్యి;
అక్కడ తొలిసారి పూచిన ఏ అడవి మల్లో
దాని కన్నీళ్ళు కానుక ఇవ్వగలదు

ఎక్కడ బలుసాకులు నీడనిస్తుంటాయో
ఎక్కడ చెట్లు తొంగిచూస్తుంటాయో
ఎక్కడ గడ్డికొసలపై మంచు బిందువులు వేలాడుతుంటాయో  
ఓహ్, అక్కడ నాకో సమాధి కట్టు  

సూర్యాస్తమయం అయే వేళ
దారినిపోయే బాటసారులు సమాధిదగ్గర
విశ్రాంతి తీసుకుంటూ, జీవితంగురించి చర్చిస్తుంటారు
వాళ్ళకి అర్థంకాదు; అయినా అదే కాంక్షిస్తుంటారు

బహుశా ఏ జాలిగుండెకో దయగలిగి
ఎప్పుడైనా ఏదో ఒకటి సమాధిపై ఉంచాలనిపించొచ్చు
ఉంచుతూ, వసంతంలో రాలిపోయే పువ్వులా
జీవితం కూడ ఏదోనాడు రాలిపోవలసిందే గదా అనొచ్చు.

.

కానీ, ఇక్కడ, ఒదార్చేవీ
ఉపశమింపజేసేవీ ఆలోచనలేవీ ఉండవు
ఏ భ్రమలూ, ఏ పువ్వులూ తోడ్కొని రారు
వాళ్ళ దుఃఖంతోపాటే సమసిపోడానికి  

ఇక్కడ కవిత్వమూ, ప్రేమా పుట్టుకురావు
ఇది ఒక అద్భుతమైన శిలా ప్రపంచం
ఇక్కడ సమాధి కొనడం, పూడ్చడం మర్చిపోడం, అంతే!
జీవితం యధాప్రకారం పరిగెడుతూంటుంది.

.

దుఃఖమూ— ఆనందమూ; ప్రకృతీ— ప్రేమా
మనిషి తను పోగొట్టుకున్న శ్వాసని తిరిగి ప్రసాదిస్తాయి.
సమాధిమీద పందిరి వెయ్యనీ, పర్వాలేదు,
అది మృత్యువుకి కూడ ఒక అందాన్ని ప్రసాదిస్తుంది.  

.
లెటిషా ఎలిజబెత్ లాండన్

(14 August 1802 – 15 October 1838)

English poet and novelist

Letitia Elizabeth Landon (1802-1838) by Maclise
Letitia Elizabeth Landon (1802-1838) by Maclise (Photo credit: Wikipedia)

లెటిషా ఎలిజబెత్ లాండన్

.

Scenes In London IV – The City Churchyard

I pray thee lay me not to rest
Among these mouldering bones;
Too heavily the earth is prest
By all these crowded stones.

Life is too gay—life is too near—
With all its pomp and toil;
I pray thee do not lay me here,
In such a world-struck soil.

The ceaseless roll of wheels would wake
The slumbers of the dead;
I cannot bear for life to make
Its pathway o’er my head.

The flags around are cold and drear,
They stand apart, alone;
And no one ever pauses here,
To sorrow for the gone.

No: lay me in the far green fields
The summer sunshine cheers;
And where the early wild flower yields
The tribute of its tears.

Where shadows the sepulchral yew,
Where droops the willow tree,
Where the long grass is filled with dew—
Oh! make such grave for me!

And passers-by, at evening’s close,
Will pause beside the grave,
And moralize o’er the repose
They fear, and yet they crave.

Perhaps some kindly hand may bring
Its offering to the tomb;
And say, As fades the rose in spring,
So fadeth human bloom.

But here there is no kindly thought
To soothe, and to relieve;
No fancies and no flowers are brought,
That soften while they grieve.

Here Poesy and Love come not—
It is a world of stone;
The grave is bought—is closed—forgot!
And then life hurries on.

Sorrow and beauty—nature—love—
Redeem man’s common breath;
Ah! let them shed the grave above—
Give loveliness to death.

Letitia Elizabeth Landon

For Further Reading: http://en.wikipedia.org/wiki/Letitia_Elizabeth_Landon

%d bloggers like this: