అనువాదలహరి

సుఖమయ జీవితానికి ఆనవాళ్ళు … సర్ హెన్రీ వాటన్

.

Raj Ghat, Delhi is a memorial to Mahatma Gandh...
Raj Ghat, Delhi is a memorial to Mahatma Gandhi that marks the spot of his cremation (Photo credit: Wikipedia)

స్వతంత్రుడుగా పుట్టినవాడుగాని,
బానిసగా బతకకూడదని నేర్చినవాడుగాని
ఎంత సుఖంగా ఉంటాడో గదా!
నైతికవర్తనే అతని కవచం; సత్యమే నైపుణ్యం.

ఆవేశాలు అతన్ని శాసించలేవు
మృత్యువంటే అతనికి భయమూ ఉండదు;
కీర్తి ప్రతిష్టల లాలసగాని, స్వంత
ఆస్థుల లౌల్యం గాని అతన్ని కట్టిపడెయ్యవు

అదృష్టం అందలమెక్కించినవాళ్ళనుచూసి
అసూయ ఉండదు; వ్యసనాల ఊసు లేదు;
పొగడ్తలతో మానని గాయాలు చెయ్యడం తెలియదు;
సద్వర్తనమే తప్ప, చట్టాల నిబంధనలు తెలియవు.

పుకార్లకి దూరంగా ఉంటాడు
ప్రశాంత చిత్తమే అతని బలమైన స్థావరం
అతని స్థితి భట్రాజులని పోషించేదీ కాదు,
తన దైన్యం, దాని కారకులని గొప్పవాళ్ళనీ చెయ్యదు

అతను నిద్రకు ముందూ, నిద్రలేస్తూనూ దైవస్మరణ
ఏదో ఇమ్మని కాకుండా, గుణగణాలు కీర్తిస్తూ చేస్తాడు
తన రోజుని స్నేహితులతోనో
అధ్యాత్మిక పఠనంతోనో వెళ్ళబుచ్చుతాడు

ఆ వ్యక్తి, ఎదగాలన్న ఆశ, పతనమౌతానన్న భయం
వంటి బంధాల నుండి విముక్తుడు;
ఏ రాజ్యాలూ లేకపోయినా, తనకు తానే రారాజు
తన దగ్గర ఏమీ లేకపోయినా, అన్నీ ఉంటాయి.

.Sir Henry Wotton, by unknown artist. See sourc...

సర్ హెన్రీ వాటన్

30 మార్చి 1568 – డిసెంబరు 163930

ఇంగ్లీషు రచయితా, రాజప్రతినిధీ (ఒక చిన్న కవీ, ఎందుకంటే అతనివిగా గుర్తించబడిన 15 కవితలేరాసాడు.  అందులో ఈ కవిత ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందడమే గాక ఇంగ్లీషు సాహిత్యం లో పేరెన్నిక గన్న పద్యాలలో ఒకటిగా నిలిచింది).  జేమ్స్ I కాలంలో రాజప్రతినిథిగా పనిచేసిన ఇతను చిన్నప్పుడు ఎదో సందర్భంలో స్నేహితుడి పుస్తకంలో “an Ambassador is an honest man sent abroad to lie for the sake of his country”అన్న మాటలు బహుళ ప్రచారంలోకి వచ్చాయి.

English: Dr. Martin Luther King giving his &qu...
English: Dr. Martin Luther King giving his “I Have a Dream” speech during the March on Washington in Washington, D.C., on 28 August 1963. Español: Dr. Martin Luther King dando su discurso “Yo tengo un sueño” durante la Marcha sobre Washington por el trabajo y la libertad en Washington, D.C., 28 de agosto de 1963. (Photo credit: Wikipedia)

.

The Character of a Happy Life

.

How happy is he born and taught
That serveth not another’s will;
Whose armour is his honest thought,
And simple truth his utmost skill!

Whose passions not his masters are;
Whose soul is still prepared for death,
Untied unto the world by care
Of public fame or private breath;

Who envies none that chance doth raise,
Nor vice; who never understood
How deepest wounds are given by praise;
Nor rules of state, but rules of good;

Who hath his life from rumours freed;
Whose conscience is his strong retreat;
Whose state can neither flatterers feed,
Nor ruin make oppressors great;

Who God doth late and early pray
More of His grace than gifts to lend;
And entertains the harmless day
With a religious book or friend;

—This man is freed from servile bands
Of hope to rise or fear to fall:
Lord of himself, though not of lands,
And having nothing, yet hath all.

.

Sir Henry Wotton.

(30 March 1568 – December 1639)

English Author, Diplomat (and to a lesser extent Poet since he wrote about 15 poems only). This is Wotton’s most distinguished poem and there is a remark credited to him: That an Ambassador is an honest man sent abroad to lie for the sake of his country.

%d bloggers like this: