అనువాదలహరి

మంచుకురుస్తున్న సాయంత్రం… ఊరికి దూరంగా… రాబర్ట్ ప్రాస్ట్.

.

ఈ కళ్ళాలు* ఎవరివో నాకుతెలుసుననుకుంటున్నాను,
అయితే, అతని ఇల్లుమాత్రం ఊర్లోనే ఉంది;
అతను నేనిక్కడ ఆగడంగాని,
అతని తోటనిండా మంచు పరుచుకోడం గాని చూడలేడు.

ఈ ఏడాదిలోనే ఇంతచీకటి ఎరుగని సాయంత్రవేళ
గడ్డకట్టుకుపోయిన సరస్సుకీ
ఈ కళ్ళాలకీ మధ్య ఏ ఖండ్రికా లేనిచోట
ఆగిపోవడం నా చిన్ని గుర్రానికి వింతగా తోచవచ్చు

దాని జీరాకి తగిలించిన చిరుగంటలు ఒకసారి మోగిస్తూ
సంజ్ఞచేసింది పొరపాటున ఆగలేదుగదా అన్నట్టు.
ఇక్కడ వినిపిస్తున్న ఇతర శబ్దమేదైనా ఉందంటే, అది
చల్లగా వీస్తున్న గాలిదీ, నెమ్మదిగా కురుస్తున్న మంచుదీ.

ఈ తోపులు  చీకటిగా, అందంగా, గంభీరంగా ఉన్నై
కాని నేను నెరవేర్చవలసినవి చాలా ఉన్నాయి
నిద్రించేలోగా మైళ్ళు నడవాల్సి ఉంది
మరణించేలోగా చాలా చెయ్యాల్సి ఉంది

.

*విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లొ, ఊరికి దూరంగా పొలాల మధ్యలో పంటనూర్చుకుందికీ దాచుకుందికీ, పశువుల్ని కట్టడానికి పాకలువేసి, అప్పుడప్పుడు మనుషులు కూడా ఉండడానికీ ఉండే జాగాలని కళ్ళాలు (కళ్ళం +లు)  అంటారు.

Robert Frost, 1913.

రాబర్ట్ ప్రాస్ట్.

(ఈ కవితలో ప్రత్యేకత అది చాలా సరళంగా కనిపిస్తూనే అందించే తాత్త్విక సందేశం. దాన్ని ఎవరి మానసిక ప్రవృత్తినిబట్టి వాళ్లకిష్టమైన రీతిలో అన్వయించుకోవచ్చు. మనిషికి ప్రకృతిలో తన ఉనికిని మరిచిపోయేలా పరవసిస్తూ ఉండాలనిపిస్తుంది. అలా కట్టిపడివేయగల వస్తువులు చాలా ఉంటై. ఇది స్వకీయం. కాని తను నెరవేర్చవలసిన బాధ్యతలుకూడా పట్టిలాగుతుంటాయి.  అది పరకీయం. జీవితం  ఈ రెండింటి మధ్య సంఘర్షణలోనూ,  సమతౌల్యంలోనే ఉంది.  మనిషి మట్టిగా మాత్రమే మిగలకూడదు. )

.

Stopping by Woods on a Snowy Evening

.

Whose woods these are I think I know.
His house is in the village, though;
He will not see me stopping here
To watch his woods fill up with snow.

My little horse must think it queer
To stop without a farmhouse near
Between the woods and frozen lake
The darkest evening of the year.

He gives his harness bells a shake
To ask if there is some mistake.
The only other sound’s the sweep
Of easy wind and downy flake.

The woods are lovely, dark, and deep,
But I have promises to keep,
And miles to go before I sleep,
And miles to go before I sleep.
.

Robert Frost

(March 26, 1874 – January 29, 1963)

American Poet.

With a seemingly simple narration and words, Frost essentially conveys the conflict between the things that a man wants for himself and the things he has to oblige or discharge, and the subtle ultimate message that man’s obligations take precedence over his personal pleasures.

[This is one of the early poems of Robert Frost. The poem was inspired by a real life incident. That was a very difficult winter in New Hampshire that year. Frost was returning home after an unsuccessful trip at the market. That he did not have enough to buy Christmas presents for his children, overwhelmed Frost with depression and he stopped his horse at a bend in the road in order to cry. After a few minutes, the horse shook the bells on its harness, and Frost was cheered enough to continue home. ]

%d bloggers like this: