అనువాదలహరి

Driftwood… Sara Teasdale

Driftwood
Driftwood (Photo credit: sirwiseowl)

.

కొట్టుమిట్టాడుతున్న నా ఆత్మజ్యోతికి
ఒక ఆకారాన్నీ, ఒక హృదయాన్నీ,
ఒక పేరునీ ఇచ్చింది నా తాతముత్తాతలే గాని

నిలకడలేని ఆ దీపకళికకి
ఇంద్రధనుసు వన్నెలనద్దింది మాత్రం
నా ప్రేమికులే…

రగుల్తున్న బల్లచెక్క
తన రతనాలవెలుగులను
సముద్రంమీద దిక్కులేక కొట్టుకొస్తున్నప్పుడు,
నీలి అలల దీప్తులనుండీ,
రంగురంగుల రేయింబవళ్ళనుండీ
నేర్చుకున్నట్టు.

English: Filsinger, Sara Teasdale, Mrs., portr...
English: Filsinger, Sara Teasdale, Mrs., portrait photograph. (Photo credit: Wikipedia)

సారా టీజ్డేల్

.

Driftwood
.

My forefathers gave me
My spirit’s shaken flame,
The shape of hands, the beat of heart,
The letters of my name.

But it was my lovers,
And not my sleeping sires,
Who gave the flame its changeful
And iridescent fires;

As the driftwood burning
Learned its jewelled blaze
From the sea’s blue splendor
Of colored nights and days.

.

Sara Teasdale

%d bloggers like this: