అనువాదలహరి

సుద్దులు … ఫాతిమా అల్ మతార్, కువైటీ కవయిత్రి

Tulip Festival in Woodburn, Oregon. 2007
Tulip Festival in Woodburn, Oregon. 2007  (Photo credit: Wikipedia)

నీళ్ళు ఎలా సంతోషంగా
ముందు కూజా ఆకారంలోకి ఒదిగిపోతాయో,
మరు నిమిషంలోనే మంచినీళ్ళ గ్లాసులా ఎలా
మారగలుగుతాయో ఆమె తన మనసుకి ప్రదర్శించింది;

ఆమెకి తెలుసు వేడి టీ కప్పులో పంచదారని
సాత్త్వికంగా కలిపినా, మోటుగా కలిపినా,
త్వరత్వరగాకలిపినా, నెమ్మదిగాకలిపినా
ఇష్టపూర్వకంగానే  కరిగిపోతుందని;

ఒక టులిప్ దుంప ఎక్కడ పాతితే అక్కడే మొలిచి,
శ్రద్ధగా పెకలించి మరొక తోటలోకి తీసుకెళ్ళి పాతితే,
అక్కడకూడ అంత బాగానూ పెరిగి,
అభివృధ్ధిచెందుతుందనీ తెలుసు;

ఆమె అయిష్టంగా ఉన్న తనమనసుకి
నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తోంది:
పలుపుతాడుతో కట్టినట్టు
బాధాకరమైన ప్రేమకి కట్టుబడపోకుండా
మనిషి ఎప్పుడూ తన సహజస్థితికిరావడం
ఎలా సుగుణమో చెబుతోంది.

ఒక ఆకారం నుండి మరొకదానిలోకి,
ఎన్నిసార్లు మార్చినా,
పగులగొట్టినా, పొదువుకున్నా,
అలా రూపుదిద్దుకోగల మెత్తదనం
కలిగి ఉండడం మనకే మంచిదని.

ఆమె మరొకమాటకూడ అంది:
“దేన్నైనా సరిదిద్దవచ్చు” ననీ
“ఏదైనా సాధించవచ్చు” ననీ
ఎవరైనా నిర్లక్ష్యంగా అన్నప్పుడు
తనకి కోపంతో ఒళ్ళు సలసలా
మరిగిపోతున్నట్టుంటుందని.

.

ఫాతిమా అల్ మతార్

కువైటీ కవయిత్రి

.

Lessons

.

She demonstrates to her heart

how water gladly

takes the shape of a jug,

then almost instantly adapts to

he shape of a drinking glass.

She shows it how sugar willingly dissolves

stirred gently or roughly, quickly or

slowly into the warm cup of tea.

How a tulip bulb will grow exactly

where it is planted and if removed

with care to another garden,

continues to grow and flourish.

She explains

trying to convince her reluctant heart

how resilience can be a virtue

not to be tethered by painful love;

to be shaped and reshaped

the flexibility to be contained, scratched or

fenced might be good for us

she adds.

She feels it seeth with anger

when some one recklessly says:

“anything can be fixed”

“anything can be done”.

.

Fatima Al Matar

Kuwaiti Poetess

Image Courtesy: http://www.blogger.com/profile/15217312425251484859

Fatima Al Matar فاطمة المط

(Poem Courtesy: http://fatimaalmatar.blogspot.ca/)

%d bloggers like this: