అనువాదలహరి

అనుభూతి … రింబో, ఫ్రెంచి కవి

Arthur Rimbaud, poet
Arthur Rimbaud, poet (Photo credit: Wikipedia)     (20 October 1854 – 10 November 1891)

.

వేసవి వినిర్మల సాయంత్రపువేళలో,

నీలాకాశం దిగువన అలా కాలిబాటల్లో 

లే పచ్చికమీంచి నడుచుకుంటూ పోతుంటాను

వరికంకులు గుచ్చుకుంటుంటాయి,

నా కాళ్ళక్రింద ఆ చల్లదనాన్ని

ఏదో కలలోలా, అనుభూతిచెందుతాను.

రక్షణలేని నా శిరసుమీదినుండి

చిరుగాలి ఒరుసుకుని పోనిస్తూ…  


నేనేం మాటాడను… ఏ ఆలోచననీ దరి రానీయను…

అంతులేని ప్రేమతో నా ఆత్మ నిండిపోతుంది. 

నే నెక్కడెక్కడికో పల్లెసీమలవెంట

దేశద్రిమ్మరిలా తిరుగాడుతుంటాను… 

నాకిపుడు ఎంత ఆనందంగా ఉందంటే… 

చెంత నా సహచరి ఉందేమోన్నంత.  

.

రింబో

ఫ్రెంచి కవి

(20 October 1854 – 10 November 1891)

(కొన్ని సందర్భాల్లో ఈ శారీరాన్ని అనుభూతికి వదిలెయ్యాలి. హేతువుకి అందని ఆనందంలో, ప్రకృతిలో మమేకమై పులకింతలు పోనివ్వాలి. ఆ అనుభూతి ముద్ర మనసుపొరల్లో జీవితకాలం నిక్షిప్తమై ఆ క్షణాల్ని తలుచుకున్నప్పుడల్లా తిరిగి అనుభూతి చెందనివ్వాలి. కవి ప్రకృతికి మనల్ని మనం అర్పించుకునేప్పుడు కలిగే అనుభూతిని వర్ణిస్తున్నాడిక్కడ)

.

Sensation

.

On the blue summer evenings, I shall go down the paths,
Getting pricked by the corn, crushing the short grass:
In a dream I shall feel its coolness on my feet.
I shall let the wind bathe my bare head.

I shall not speak, I shall think about nothing:
But endless love will mount in my soul;
And I shall travel far, very far, like a gipsy,
Through the countryside – as happy as if I were with a woman.

(March 1870)

Arthur Rimbaud

20 October 1854 – 10 November 1891

French Poet

(Sometimes we should subject ourselves to sensations of the nature with no holds barred . We should bathe in such an experience which we cannot describe rationally. And, whenever we recollect those beautiful moments later, the mind re-lives the same moments and once more experiences  the bliss. )

%d bloggers like this: