నవ్వే హృదయం … ఛార్ల్స్ బ్యుకోవ్స్కీ

నీ జీవితం నీది.
దాన్ని ఒకరికి దాసోహం అనేలా తొక్కిపెట్టకు.
అప్రమత్తంగా ఉండు

మార్గాంతరాలు లేకపోలేదు.
ఎక్కడో ఒకచోటునుండి చిన్నవెలుతురు కనిపించకపోదు

అదేమంత పెద్ద వెలుగుకాకపోవచ్చు గాని,
చీకటిని హరించడానికి సరిపోతుంది
కనుక అప్రమత్తంగా ఉండు

దైవం నీకు అవకాశాలు కల్పిస్తూనే ఉంటుంది.
అవితెలుసుకో.
వాటిని అందుకో.

నువ్వు మృత్యువునయితే జయించలేకపోవచ్చు గాని,
అప్పుడప్పుడు జీవితంపై కలిగే
నిరాసక్తతని మాత్రం జయించగలవు.

ఇది నువ్వు ఎంత ఎక్కువ నేర్చుకుంటుంటావో,
నీకు అంత ఎక్కువ వెలుగు కనిపిస్తుంటుంది.

నీ జీవితం నీది.
అది నువ్వు బతికుండగానే తెలుసుకో.

నువ్వు ఒక అద్భుతానివి.
దైవం నిన్ను చూసి అనందపడడానికి
ఉవ్విళ్ళూరుతుంటుంది. గ్రహించు.

.

English: Charles Bukowski, portrait by italian...
English: Charles Bukowski, portrait by italian artist Graziano Origa, pen&ink+pantone, 2008 (Photo credit: Wikipedia)

ఛార్ల్స్ బ్యుకోవ్స్కీ

.

The Laughing Heart

.

your life is your life
don’t let it be clubbed into dank submission.
be on the watch.
there are ways out.
there is a light somewhere.
it may not be much light but
it beats the darkness.
be on the watch.
the gods will offer you chances.
know them.
take them.
you can’t beat death but
you can beat death in life, sometimes.
and the more often you learn to do it,
the more light there will be.
your life is your life.
know it while you have it.
you are marvelous
the gods wait to delight
in you.

Charles Bukowski

“నవ్వే హృదయం … ఛార్ల్స్ బ్యుకోవ్స్కీ” కి 12 స్పందనలు

  1. వావ్! అద్భుతమయిన భావ వ్యక్తీకరణ! ఈ రచన చదువుతుంటే అనుభవం నుండి పుట్టినట్టు అనిపిస్తోంది. అంత లోతుగా ఉంది.
    నువ్వు మృత్యువునయితే జయించలేకపోవచ్చు గాని,
    అప్పుడప్పుడు జీవితంపై కలిగే
    నిరాసక్తతని మాత్రం జయించగలవు. బాగా నచ్చాయి ఇవి.

    మెచ్చుకోండి

    1. అమ్మా రసజ్ఞా,
      బ్యుకోవ్స్కీ లాస్ ఏంజల్స్ లోని చీకటికోణాలన్నీ చూస్తూ పెరిగినవ్యక్తి. చెప్పలేనన్ని కవితలూ, వందలకొద్దీ కథలూ రాసేడు. చీకటికోణాలు చూసినవాళ్ళందరూ తాత్త్విక దృక్పథాన్ని అలవరచుకోలేకపోయినా, అలవరచుకోగలిగిన కొద్దిమందీ మాత్రం తప్పకుండా జీవితాన్ని చాలాకోణాల్లోంచి చూడగలుగుతారు. భగవమంతుణ్ణి నమ్మినవారు జీవితాన్ని దైవప్రసాదంగా భావించి దాన్ని తదనుగుణంగా మలుచుకోమని చెబితే, ప్రకృతివాదులు మనిషికీ ప్రకృతికీ ఉన్న అవినాభావాన్ని ప్రస్తుతిస్తూ, జీవితంలోని అమూల్యమైన కోణాల్ని ఆవిష్కరించడానికీ, నిరాశా నిస్పృహలలోనుండి మనిషి తనని తాను ఎలా బయటపడేసుకోవాలో చెప్పారు. కొందరు సత్యాన్ని సౌందర్యవంతంగా ఆవిష్కరిస్తే, మరికొందరు బ్యుకోవ్స్కీలా matter-of-factగా ఆవిష్కరించేరు. ఈ కవితలో ప్రతిమాటా ఎంతో అర్థవంతంగా ఉపయోగిస్తూ, తూచి తూచి మాటలు వాడేడేమో అనిపించేలా వ్రాసేడు.
      ఆశీస్సులతో

      మెచ్చుకోండి

  2. దైవం నీకు అవకాశాలు కల్పిస్తూనే ఉంటుంది.
    అవితెలుసుకో.
    వాటిని అందుకో.
    Really wonderful, hopeful

    మెచ్చుకోండి

    1. శర్మగారూ,
      చాలా లలితమైన మాటలతో, నిరలంకారంగా, సత్యాన్ని ఆవిష్కరించడం చాలా కష్టం. దానివెనుక గాఢమైన ఎంతో అనుభూతి సాంద్రత ఉంటేనేగాని అంత శక్తిమంతంగా చెప్పడం కష్టం. జీవితం అంటేనే కష్టాలసమూహం. దానిలో సంభవత (Probability) ఎంతో ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. మన విజయాలన్నీ కేవలం మన శక్తిసమర్థ్యాలవలనే కాదనీ, మనకు తెలియని వేరే శక్తులు మనకు అనుకూలంగా పనిచెయ్యడం అని ఒక అర్థం చెబుతే, మన వైఫల్యాలకు కూడా మన శక్తిసామర్థ్యాలలోపం కారణం కాదనీ, మనకు అననుకూలంగా కొన్ని శక్తులు పనిచెయ్యడం వల్లనే ననీ, ఒకసారి (లేదా కొన్ని సార్లు) వైఫల్యం చెందినంత మాత్రంచేత జీవితం ముగిసిపోలేదనీ, ఇంకా ఎన్నో అవకాశాలు తలుపుతడుతూ ఉంటాయనీ, మనవైఫల్యాలదిగులుతో వాటిని పోగొట్టుకోకూడదనీ చెప్పగలగడం కేవలం పరిణతిచెందిన మానక స్థితిలోనే సాధ్యం.
      అభివాదములతో

      మెచ్చుకోండి

  3. చాలా బాగుందండి అసలైనది మరియు దాని అనువాదం .

    మెచ్చుకోండి

    1. Thank you padma garu.

      with best regards

      మెచ్చుకోండి

  4. చాలా బాగుంది.
    నాకు ఈ కవిత లోని లోని ఈ భాగం బాగా నచ్చింది. Thank you sir!

    ఇది నువ్వు ఎంత ఎక్కువ నేర్చుకుంటుంటావో,
    నీకు అంత ఎక్కువ వెలుగు కనిపిస్తుంటుంది.
    నీ జీవితం నీది.
    అది నువ్వు బతికుండగానే తెలుసుకో.

    మెచ్చుకోండి

    1. వనజగారూ,
      జీవితాన్ని ఆశావహదృక్పథంతో చూస్తే ఎప్పుడూ వెలుగు కనిపిస్తుందని ప్రోత్సహించేవాళ్ళెందరుంటారు? ముఖ్యంగా పరీక్షల్లో తప్పిపోతామనో , రాంకులు రాలేదనో, ఇలా సవాలక్షకారణలతో మానసిక ఒత్తిడికి లోనైన, అవుతున్న యువతరానికి జీవితం ఎప్పుడూ EAMCETలలోనూ, AUCET, ICET AIEEEలలోనే లేదనీ, వాటీతో జీవితం అంతం అయిపోదనీ, మనిషి తననితాను నిరూపించుకోడానికి అనేకమార్గాలున్నాయనీ పిల్లలలో ఒక్క ప్రోత్సాహకరమైన మాట చెబితే, ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళూ, ప్రయత్నించేవాళ్ళూ ఉండరని నా అభిప్రాయం. ఈ విషయం లో ముందుగా తల్లిదండ్రులకి ఈ రకమైన శిక్షణ అవసరం. తమపిల్లలకి రాంకురాకపోతే తాముఏదో అపరాధంచేశామన్నంత ఒత్తిడికిగురై, (నిజంగా చేసే అపరాధాలకు మాత్రం బాథపడరు), అసలే దిగులుతో ఉన్న పిల్లలని మరింతకృంగదీసే విధంగా ప్రవర్తించకుండా ఉండడానికి.
      అభివాదములతో

      మెచ్చుకోండి

  5. నీ జీవితం నీది.
    అది నువ్వు బతికుండగానే తెలుసుకో.

    నువ్వు ఒక అద్భుతానివి.
    దైవం నిన్ను చూసి అనందపడడానికి
    ఉవ్విళ్ళూరుతుంటుంది. గ్రహించు.

    Nice 🙂

    ?!

    మెచ్చుకోండి

  6. శివగారూ,
    జీవితం ఒక అద్భుతం అనితెలుసుకోడానికి చాలాకాలం పడుతుంది. ఆ విషయం మనకు తెలుసునని అనిపించవచ్చు. మనకి దానిగురించిన స్పృహేగాని, పరిజ్ఞానము ఉండదు కొంత జీవితం గడిచిపోయేదాకా. ఆ జ్ఞానోదయం ఎంతవేగిరం అయితే అంతవేగిరంగా మనజీవితాన్ని ఒక అద్భుతంగా మలుచుకునే అవకాశం కలుగుతుంది.
    అభివాదములతో

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: