నేను గతానికి వగవను … అలెక్సాండర్ సెర్గేవిచ్ పూష్కిన్ …

( 6 జూన్ 2012 అలెక్సాండర్ సెర్గేవిచ్ పూష్కిన్ 214 జయంతి సందర్భంగా)

.

కలలకీ, జీవితానికీ పొంతనలేకుండా

గడచిన నా యవ్వనపురోజులకై వగవను;

ప్రేమావేశంలో వీణతోడుగాపలికిన గీతాలని

గుర్తుతెచ్చిన రాత్రులకై కూడా వగవను;

.

మిధ్యా స్నేహాలకై, విశ్వాసంలేని మిత్రులకై వగవను;

విందులసందళ్ళకీ, వినోదాల సంబరాలకీ వగవను;

అందమైన సాంకర్యాలకీ వగవను;

యోచనాపరుడైన అపరిచితుడుగా, వాటికి దూరంగా ఉంటాను

.

కానీ, మనసునిండిన మౌనాలతో, యౌవ్వన ఆశల తీవెలతో

సుకుమారమైన ఆశయాలతోగడిపిన కాలమేదీ?

ఉద్రేకం రేకెత్తించే ఆవేశం, స్ఫూర్తినిచ్చిన కన్నీళ్ళూ ఏవీ?

ఓ నా యవ్వనమా! మరొక్కసారి తిరిగి రావూ?

.

(ముందుగా పేర్కొనవల్సినది ఈ తెలుగు అనువాదానికి మాతృకగా తీసుకున్న ఇంగ్లీషు అనువాదం. అది ఎంతో అర్థవంతంగా, మూలం మనకి తెలియకపోయినా, ఇంగ్లీషులో తనకి తాను వ్యక్తిత్వం ఉన్న కవితగా తీర్చిదిద్దబడింది. అందుకు ముందుగా అనువాదకుడు… Yevgeny Bonver కి నా మనఃపూర్వక అభినందనలు, ధన్యవాదాలు.

మనిషి జీవిత చరమాంకంలో తనజీవితంలోని మధురఘట్టాలను నెమరువేసుకుని ఆనందంతోనో, తప్పిపోయిన అవకాశాలని తలుచుకుని చింతిస్తూనో గడుపుతాడు. వగవనివి చెబుతూనే, వేటికి వగవాలో చమత్కారంగా చెబుతున్నాడు కవి.

కవి ఇక్కడ 3, 4 విషయాలు చెప్పాడు. మనసునిండిన మౌనాలూ, స్ఫూర్తినిచ్చే కన్నీళ్ళూ, సాంకర్యాలు (adulteries)… ఇవి  శారీరకమైనవికావు (Not Licentious)… అవి భాషకీ, సంస్కృతికీ, భావాలకీ చెందినవని నా భావన.

మనసునిండిన మౌనం క్రియాత్మకమై, పేలబోయే అగ్నిపర్వతంలా ఉంటుంది; కన్నీటివిలువ దాన్ని అపురూపంగా ఖర్చుపెట్టేవాడికే తెలుస్తుంది. కన్నీరు రాలనంతవరకూ మనసులోనే పదునెక్కుతూ, రాలినతర్వాత లక్ష్యాన్ని అవలీలగా ఛేదిస్తుంది. తొందరగా కారే కన్నీళ్ళలో జాలిని కొట్టుకుపోయి, మనిషి  నిష్క్రియాపరుడుగా మిగులుతాడు. సమాజంలో మార్పు తీసుకురావాలంటే, కన్నీళ్ళు దాచుకోవలసిందే.

సాంకర్యాలకి తను దూరంగా ఉన్నానని చెప్పాడు. అతనికి తన సంస్కృతిపట్ల అభిమానమూ, రాజకుటుంబాలలో తనకాలంలో పెచ్చుమీరిన అనైతిక వర్తనపట్ల ద్వేషమూ ఉందని నే ననుకోడానికి అతను తరచుగా చేసిన ద్వంద్వయుధ్ధాలు (Duels). అలాంటి ఒక దానిలో గాయపడి తను 37 ఏళ్ళకే ఎంతో మంచిభవిష్యత్తున్న జీవితాన్ని అర్థాంతరంగా ముగించాడు.)

English: Alexander Pushkin
English: Alexander Pushkin (Photo credit: Wikipedia)

అలెక్సాండర్ సెర్గేవిచ్ పూష్కిన్

ఆధునిక రష్యను సాహిత్యవేత్త.

(6  జూన్ 1799 – 10  ఫిబ్రవరి 1837)

.

“I Don’t Deplore the Years…”

I don’t deplore the years of my spring,
Where dreams and life were never in connection,
I don’t deplore the nights’ mysterious ring,
Sang by a lyre in a fiery passion.

I don’t deplore the false and faithless friends,
The wreaths of feasts, the bowls of the parties,
I don’t deplore the beautiful adulteries –
A thoughtful stranger, I avoid these trends.

But where’s the time of gentle inclination,
Of hearty silence and young hopes’ strings?
Where are the flame and tears of inspiration?
Come back again, the years of my spring!

Aleksandr Pushkin

(6 June  1799 – 10 February  1837)
Translated by Yevgeny Bonver, September, 1999
Edited by Dmitry Karshtedt, January, 2000
(Poem Courtesy: http://www.poetryloverspage.com/poets/pushkin/i_dont_deplore_years.html)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: