చీకట్లో పిట్టపాట… థామస్ హార్డీ

(అనంతనైరాశ్యంలో కూడ ఒక వెలుగురేక ఎక్కడనుండో కనిపిస్తుందనీ, ప్రకృతి తనజీవచైతన్యాన్ని ఎట్టిపరిస్థితులలోనూ కోల్పోదనీ సందేశమిచ్చే ఈ అద్భుతమైన కవిత  …. థామస్ హార్డీ  173వ పుట్టినరోజు సందర్భముగా)

Song Thrush in Wellington, New Zealand (introd...
Song Thrush in Wellington, New Zealand (introduced species) (Photo credit: Wikipedia)

.

నేను మా తోట వాకిలికి ఆనుకుని చూస్తున్నాను.
కురిసినమంచు దయ్యంలా తెల్లగా ఉంది.
ఈ శీతకాలపు అవశేషాలు  
సూర్యుడిని ఇంకా ఏకాకిని చేస్తున్నాయి  

చెట్లకు ఎగబాకిన లతలు
తెగినవీణల తీగల్లా ఉన్నయి.  
దగ్గరలో మనిషన్నప్రతివాడూ
ఇంటిలోపల చలికాగుతున్నాడు.

ఈ నేల కవళిక ఎటు చూసినా
ఈ శతాబ్దశవపు ఛాయ గోచరిస్తోంది.   
ఈ కమ్ముకున్న మబ్బు శవపేటికలాగా,
గాలిరొద శవరోదనలాగా ఉన్నాయి  

స్థావరజంగమాలలోని ఆదిమ ప్రాణస్పందన,
లోలోపలికి కుంచించుకుపోయినట్టుంది,
ఈ ప్రకృతిలోని ప్రతిప్రాణీ నాలాగే
ఉత్సాహ విహీనమైనట్టుకనిపిస్తోంది.

కానీ, ఒక్కసారి నా తలమీది
మోడువారిన కొమ్మలలోనుండి,
అవధిలేని ఆనందంతో ఒక గొంతు  
సాంధ్యగీతాన్ని ఆలపించడం ప్రారంభించింది

బక్కగా చిక్కి వడిలిపోయిన చిన్న ముసీలి పక్షి,
రొజ్జగాలికి ఈకలు చెదిరినా,
విస్తరిస్తున్న నైరాశ్యాన్ని తన
జీవశక్తితో నింపడానికి నిశ్చయించుకున్నట్టు.

దగ్గరలోగాని, కనుచూపుమేరలోగాని,
భూమిమీద ఏ వస్తువులోనూ
అంత రసవత్తరంగా ఆలపించడానికి
తగిన కారణం కనిపించదు

నేననుకుంటున్నాను:
బహుశా ఈ చక్కని నిశాపవనం లో
నాకు తెలియనిదీ, దానికి తెలిసినదీ
ఏదో ఆశాస్వరూపం కదలాడుతున్నాదేమోనని.   
.

The poetry of Thomas Hardy was the influence t...
The poetry of Thomas Hardy was the influence that helped Larkin reach his mature style. (Photo credit: Wikipedia)

థామస్ హార్డీ

(I am greatly pleased to present here one of the best poems of Hardy on his 173rd Birthday today.

In this poem he weighs each word keeping in view the ultimate message he wants to convey. The image and the inspiration he wants to convey are striking in the ambience he created for the catharsis. The more critical you read the poem, I am sure, the more you would enjoy it.)

.

The Darkling Thrush

.

I leant upon a coppice gate
When Frost was spectre-gray,
And Winter’s dregs made desolate
The weakening eye of day.
The tangled bine-stems scored the sky
Like strings of broken lyres,
And all mankind that haunted nigh
Had sought their household fires.

The land’s sharp features seemed to be
The Century’s corpse outleant,
His crypt the cloudy canopy,
The wind his death-lament.
The ancient pulse of germ and birth
Was shrunken hard and dry,
And every spirit upon the earth
Seemed fervourless as I.

At once a voice arose among
The bleak twigs overhead
In a full-hearted evensong
Of joy illimited;
An aged thrush, frail, gaunt, and small,
In blast-beruffled plume,
Had chosen thus to fling his soul
Upon the growing gloom.

So little cause for carolings
Of such ecstatic sound
Was written on terrestrial things
Afar or nigh around,
That I could think there trembled through
His happy good-night air
Some blessed Hope, whereof he knew
And I was unaware.

.

Thomas Hardy

(2 June 1840 – 11 January 1928)

“చీకట్లో పిట్టపాట… థామస్ హార్డీ”‌కి ఒక స్పందన

  1. నిజమే మూర్తిగారు. మొదటిసారి చదివినప్పుడు ఇంత బాగా అర్ధం కాలేదు.

    ఈ నేల కవళిక ఎటు చూసినా/ ఈ శతాబ్దశవపు ఛాయ గోచరిస్తోంది/
    ఈ కమ్ముకున్న మబ్బు శవపేటికలాగా/గాలిరొద శవరోదనలాగా ఉన్నాయి.

    అంతటి నైరాశ్యాన్ని ” నాకు తెలియనిదీ, దానికి తెలిసినదీ
    ఏదో ఆశాస్వరూపం కదలాడుతున్నాదేమోనని. ”

    అంటూ గొప్పగా,ఎంతో ఆశావహంగా,కళాత్మకంగా ముగించాడు.

    image and inspiration రెండు మీరన్నట్టు చాలా strikingగా ఉన్నాయి.

    మనలోని శూన్యాన్ని నింపుకోగల పదాలు,భావం.

    స్థావరజంగమాల,రొజ్జగాలి లాంటి పదాలు తెలుగు అనువాదాన్ని అందంగా ముందుంచాయి.

    హార్డీని పరిచయం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: