అనువాదలహరి

అక్కసు … ఫ్రాంక్ ఒహారా

.

నాకు చాలా విషయాల గురించి తెలుసు.

ఇంకా తెలుసుకుంటూనే ఉంటాను.

ఎంత ఎక్కువంటే, ఇక నా బుర్రపట్టనంత.

ఇవతలవాళ్ళ గురించి ఎక్కువ తెలుసుకోవడం,

వాళ్ళు ఏమిటి చేస్తుంటున్నారో తెలుసుకోవాలనే బలహీనతే

నన్ను నిలబెడుతోంది.

దాని విలువేమిటో నాకు తెలియదంటే

గొప్ప చికాకు తెప్పిస్తుంది.

వాళ్ళకి దాని విలువేమిటో

నాకు  తెలుసు.

అందుకే నాకు అసహ్యం

ఫ్రాంక్ ఒహారా 

(మార్చి 27, 1926 – జులై 25, 1966 )

అమెరికను రచయితా, కవీ, విమర్శకుడూ అయిన ఒ హారా కి సంగీత సాహిత్యాలే గాక, కళలూ, తత్వశాస్త్రమూ, వేదాంతమూ మొదలైన చాలా విషయాలపై ఆసక్తి ఉండేది. ఆర్థర్ రింబో, మలామే, బోరిస్ పాస్టర్నాక్,  వ్లాడిమిర్ మయకోవ్స్కీ అతని అభిమాన కవులు.  అతని మరణానంతరం ప్రచురించబడ్డ కవితా సంకలనం కవిత్వ విభాగానికి 1972 నేషనల్ బుక్ ఎవార్డ్ ను ఇతరులతో పంచుకుంది. ఈ కవితలో మానవ స్వభావాలైన ఈర్ష్యా అసూయలూ, ప్రక్కవాళ్ల విషయాలలో మనకి అక్కరలేని కుతూహలము ఉండడం గురించి చెబుతున్నాడు.

Frank O'Hara
Frank O’Hara (Photo credit: Wikipedia)

.

Spleen

.

I know so much
about things, I accept
so much, it’s like
vomiting. And I am
nourished by the
shabbiness of my
knowing so much
about others and what
they do, and accepting
so much that I hate
as if I didn’t know
what it is, to me.
And what it is to
them I know, and hate.

Frank O’Hara

(Francis Russell “Frank” O’Hara)

(March 27, 1926 – July 25, 1966)

American Writer, Poet and Critic

A sonarman on destroyer US Nicholas in World War II, O’Hara had diversified interests like philosophy, Visual Art and Theology apart from music in which he majored, and English Literature in which he graduated. Arthur Rimbaud, Stephane Mallarmé, Boris Pasternak, and Vladimir Mayakovsky were his favorite poets. A posthumous collection, The Collected Poems of Frank O’Hara edited by Donald Allen (Knopf, 1971), shared the 1972 National Book Award for Poetry. 

%d bloggers like this: