అనువాదలహరి

ఔష్విజ్ … లేయాన్ ఫెలిపె స్పానిష్ కవి.

Auschwitz concentration camp, arrival of Hunga...
Auschwitz concentration camp, arrival of Hungarian Jews, Summer 1944 (Photo credit: Wikipedia)
Auschwitz concentration camp
Auschwitz concentration camp (Photo credit: imansari)

.

ప్రపంచంలోని యూదులందరికీ…

నా స్నేహితులారా (నా తోబుట్టువులారా),

నరకాన్ని వర్ణించిన కవులు

దాంతే, బ్లేక్, రింబో లని

నెమ్మదిగా మాటాడనీండి…

మౌనంగా ఉండనీండి!

ఇవాళ, ఈ భూమ్మీద నివసిస్తున్న వాడెవడికైనా,

నరకం అంటే ఏమిటో వాళ్ళముగ్గురి కంటే ఎక్కువ తెలుసు.

దాంతే ఒక భగవద్దత్తమైన ప్రతిభకల

వాయులీన విద్వాంసుడని నాకు తెలుసు.

ఓహ్! అతనొక గొప్ప కళాప్రపూర్ణుడు.

.

కానీ,

ఇప్పుడు తల్లి దండ్రులనుండి దూరం చెయ్యబడి

అక్కడ ఔష్విజ్ శ్మశానవాటికలో

ఒక్కడూ, ఒంటరిగా నిలబడి,

తన తరుణంకోసం ఎదురుచూస్తున్న

ఆ యూదు కుర్రవాడిని

దాంతే పదకొండు మాత్రల

అద్భుత, లయాన్వితమైన కవిత్వంతో

భయపెట్టడానికి ప్రయత్నించ వద్దు.

.

ఓ దాంతే!

నువ్వు వర్జల్ చెయ్యి పట్టుకుని

( వర్జల్? ఓహ్! “గొప్ప మార్గదర్శకుడు”)

నరకంలోకి అడుగుపెట్టేవు.

నీ “డివైన్ కామెడీ” ఒక వినోదకర సాహస సంగీత, విహారయాత్ర.

కానీ, ఇదివేరు.  ఈ సందర్భమే వేరు.

నీకు ఆ ఊహాశక్తే లేకపోతే ఎలా బోధపరచాలి?

నీకు… అసలు ఆ ఆలోచనేరాలేదు…

గుర్తుందా? నువ్వు వర్ణించిన నరకంలో

కనీసం ఒక్క పసివాడైనా లేడు.

కానీ, … అక్కడ చూడు… అతడొక్కడూ ఉన్నాడు…

ఒంటరిగా!  ఏ దిక్కూలేక. …

నరకద్వారాలు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురుచూస్తూ…

 ఓ ఫ్లారెంటైన్ నివాసీ,

ఇది నువ్వెన్నడూ ఊహించనైనా ఊహించలేకపోయావు.

ఈ సందర్భమే వేరు … ఎలా చెప్పాలి?

చూడు.

ఈ స్థలంలో నువ్వు నీ వాయులీనాన్ని వాయించలేవు.

ఇక్కడ ప్రపంచంలోని ఏ వాయులీనాకైనా తీగలు తెగిపోతాయి..

.

వజల్, దాంతే, బ్లేక్, రింబో!

నరకాన్ని వర్ణించిన కవులారా!

మీకు అర్థం అయిందా?

నెమ్మదిగా మాటాడండి!

మీ మీ వాయిద్యాలని నెమ్మదిగా వాయించండి!!

ష్…! చప్పుడుచెయ్యొద్దు!!!


నేను మహా విద్వాంసుణ్ణి. 

నరకం లో ఎన్నోసార్లు వాయించాను…

కానీ, ఇప్పుడు, ఇక్కడ

నా వాయులీనాన్ని ధ్వంసంచేస్తున్నాను…

చేసి, నిశ్శబ్దంగా ఉండిపోతాను!

.

లేయాన్ ఫెలిపె

స్పానిష్ కవి.

(మానవజాతి చరిత్రలో శాశ్వతంగా మిగిలిపొయే మాయని మచ్చ ఈ ఔష్విజ్.  అక్కడ యూదులని ఒక క్రమప్రణాళిక ద్వారా కోసిన ఊచకోత ఈ కవితలో ఫెలిపే చెప్పినట్టు ఊహాతీతమైనది.  ఇక్కడ పసిపిల్లలన్న జాలి దయా దాక్షిణ్యం లేకుండా, గాస్ ఛాంబరులోకి పంపి దారుణంగా చంపడం ఊహించుకుంటే వళ్ళు జలదరిస్తుంది.  స్నానఘట్టాల్లా ఏర్పాటుచేసిన గదుల్లోకి పంపి, వాళ్ళు హాహాకారాలు చేస్తున్నా ముందు ఎవరికీ  వినిపించనీయకుండ కట్టుదిట్టాలు చేసి, తర్వాత వినిపించినా పట్టించుకోకుండా నిర్భయంగా, వ్యక్తి స్వాతంత్ర్యాన్ని సమూలంగా నాశానం చేసిన దౌర్భాగ్య ప్రదేశమిది. Anne Frank అనే చిన్నారి నిత్యం ప్రాణభయంతో బతుకుతూ,  అయినా క్రమం తప్పకుండా వ్రాసిన          “ఏన్ ప్రాంక్ డైరీ” అన్న పుస్తకం దొరికితే చదవండి. మనం ఎన్నో కష్టాలు పడిపోతున్నట్టూ, ఆ కష్టాలుపడలేక చచ్చిపోతున్నట్టూ బాధపడిపోతుంటాం. మృత్యువుతో సహవాసం చెయ్యడం అంటే ఏమిటో తెలుస్తుంది. “ఇరవైలో అరవై వయసు” అన్న మాటలోని ఆంతర్యం ఏమిటో బోధపడుతుంది.).

.

Auschwitz

.

To all the Jews in the world, my friends, (my brethren)
Those infernal poets Dante, Blake, Rimbaud…
Let them speak quietly…Let them be silent!
Today
any inhabitant of these earth
understands more about hell
than those three bards together.

I know Dante is a gifted violinist…Ah, a great virtuoso!
But do not dare to attempt now, with your amazing stanzas
and perfect hendecasyllables, to frighten that Jewish boy who is standing there, extricated from his parents…

Alone
Alone!
Awaiting his turn
in the Auschwitz crematorium

.

Dante… you descended to hell by the hand of Virgil (Oh Virgil, the “great cicerone”) and that Divine Comedy of yours
was an amusing adventure
of music and tourism.

This is something else… something else…How can I explain?
If you don’t have an imagination!

You… do not have an imagination, remember that in your “inferno”there is not a single child…
But that one over there…He is alone
Alone! Without cicerone…Waiting for the gates to a hell to open, that you, poor Florentine!
Could not even imagine.
This is something else… How can I explain?Look! This is a place where you can not play the violin
Here, the strings of every violin in the world get broken

Have you understood, Infernal Poets? Virgil, Dante, Blake, Rimbaud…
Speak quietly! Play your instruments quietly! Shht!…

Be quiet!!I am too a great virtuoso And have played many a time in hell…But now, here…I shatter my violin…

and keep silent.

.

León Felipe Camino Galicia 

(11 April 1884 – 17 September 1968)

Spanish poet.

%d bloggers like this: